రెండు, మూడు నెలల్లో కేసీఆర్ “సంచలన వార్త”

రెండు, మూడు నెలల్లో సంచలన వార్త చెబుతానని తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బెంగళూరులో ప్రకటించారు. దేశంలో ఓ సంచలనం జరగాల్సి ఉందని .. జరుగుతందని ఢిల్లీలో కేజ్రీవాల్‌ను కలిసిన తర్వాత ప్రకటించిన ఆయన బెంగళూరులో … మరో అడుగు ముందుకేసి… రెండు, మూడు నెలల గడువు పెట్టారు. దేశంలో మార్పు రావడం తథ్యమని.. ఈ మార్పును ఎవరూ ఆపలేరని తేల్చి చెప్పారు. జేడీఎస్ ముఖ్య నేతలు దేవేగౌడ, కుమారస్వామిలతో మాట్లాడేందుకు కేసీఆర్ ప్రత్యేకంగా బెంగళూరు వెళ్లారు. వారితో భేటీ అయ్యారు. కలిసి లంచ్ చేశారు. తర్వాత మీడియాతో మాట్లాడారు.

ఎందరో ప్ర‌ధానులు దేశాన్ని ప‌రిపాలించార‌ని, ఎన్నో ప్ర‌భుత్వాలు రాజ్యాన్ని ఏలాయ‌ని.. అయినా.. దేశ ప‌రిస్థితి ఏమాత్రం మార‌లేద‌న్నారు. ఒకప్పుడు భార‌త్ కంటే త‌క్కువ జీడీపీ వున్న చైనా ఇప్పుడు ఆర్థికంగా ప్ర‌పంచాన్ని శాసిస్తోంద‌న్నారు. మోదీ ప్ర‌భుత్వం మాత్రం 5 ట్రిలియ‌న్ డాల‌ర్ల బిజినెస్ అంటూ ప్ర‌చారం చేస్తోంద‌ని, ఇది దేశానికే అవ‌మాన‌మ‌ని అన్నారు. నిజంగా మ‌న‌సు పెట్టి అభివృద్ధి చేస్తే.. అమెరికాకంటే ఆర్థికంగా మ‌న‌మే ఫ‌స్ట్ ప్లేస్‌లో వుంటామ‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. రోజురోజుకీ ప‌రిస్థితి దిగ‌జారిపోతోంద‌ని దేశంలోని ఏ వ‌ర్గం కూడా మోదీ పాల‌న‌తో సంతోషంగా లేద‌ని సీఎం కేసీఆర్ విమ‌ర్శించారు.

కేసీఆర్ వెంట ఎంపీ సంతోష్ తదితరులున్నారు.జాతీయ స్థాయిలో బీజేపీ యేతర కూటమి ఏర్పాటు దిశగా నేతలు చర్చించారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా బెంగళూరులో కటౌట్‌తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దేశ్‌కి నేత అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. టీఆర్ఎస్ నేతలు ప్రణాళిక ప్రకారం కేసీఆర్‌ను దేశ్‌ కీ నేతగా ప్రజెంట్ చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close