చంద్రగిరి : చెవిరెడ్డి వ్యక్తిగత సాయాలు కాపాడుతాయా?

ఆంధ్రప్రదేశ్‌లో కీలక నియోజకవర్గాల్లో ఒకటి చంద్రగిరి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తొలి సారి గెలిచింది చంద్రగిరి నుంచే. తర్వాత ఆయన కుప్పం నియోజకవర్గానికి మారారు. అయితే చంద్రగిరి మాత్రం చేతులు మారుతూనే వస్తోంది. టీడీపీకి కంచుకోటగా మాత్రం కాలేదు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు గల్లా కుటుంబం పట్టు సాధించింది. ఆ కుటుంబం టీడీపీలో చేరినా ప్రయోజనం లేకపోయింది. గల్లా అరుణకుమారి వయసు కారణంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండటం ఆయన కుమారుడు గుంటూరు నుంచి ఎంపీగా ఉండటంతో చంద్రగిరి రాజకీయాలకు వారు దూరమయ్యారు.

వైసీపీ ఏర్పడిన తర్వాత వైఎస్ అనుంగు అనుచరునిగా పేరు తెచ్చుకున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ పార్టీకి కీలక నేతగా ఎదిగారు. ఆయన ఎలా సంపాదిస్తారన్నదానిపై ఎన్నో ఆరోపణల ఉన్నప్పటికీ అదే సమయంలో అందరికీ పంచడానికి వెనుకాడరన్న అభిప్రాయం ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యక్తిగత సాయాలు ఎక్కువగా చేస్తారు. కరోనా సమయం.. ఇతర సందర్భాల్లో కూడా ఆయన నుంచి సాయం పొందిన కుటుంబాలు వేలల్లోనే ఉంటాయి. ఎన్నికల సందర్భంలో ఒకే సారి పంచడం కన్నా ఇలా అప్పుడప్పుడూ పంచితే… చివరిగా కూడా గుర్తుంచుకుంటారన్నది ఆయన పొలిటికల్ వ్యూహం అని ప్రత్యర్థులు భావిస్తూ ఉంటారు.

అయితే చెవిరెడ్డి సాయాలు ఉన్నా.. గ్రామాల్లో మాత్రం ఇప్పుడు పరిస్థితి మారిపోయిన సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల గ్రామ నాయకుల ఆధిపత్య పోరాటం .. ఎక్కువ చోట్ల వైసీపీ నేతల దాడులు. దౌర్జన్యాలు పెరిగిపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. ప్రజల కన్నా ద్వితీయ శ్రేణి నేతలే చెవిరెడ్డికి ముఖ్యం కాబట్టి .. ఆయనకు కూడా ఎన్ని ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోవడం లేదు . అదే సమయంలో పనులు చేసి బిల్లులు కోసం ఎదురు చూస్తున్న వైసీపీ నేతల సంఖ్య ఎక్కువేం లేదు. ఇటీవలి కాలంలో పలువురు చంద్రగిరి వైసీపీ నేతలు బిల్లులు రావడం లేదని సూసైడ్ చేసుకుంటామంటూ వీడియోలు కూడా విడుదల చేయడం కలకలం రేపింది.

ఇక చంద్రగిరి నియోజకవర్గంలో అత్యధిక శాతం కుటుంబాలు గల్లా ఫ్యామిలీ పరిశ్రమల మీద ఆధారపడి ఉంటాయి. వైఎస్ జగన్ ప్రభుత్వ ఆ కుటుంబంపై కక్ష సాధింపులకు పాల్పడటం…కొన్ని రోజులు బ్యాటరీ ఫ్యాక్టరీని కూడా మూసేయడంతో ఓ రకమైన అలజడి ఆ కుటుంబాల్లో ఏర్పడింది. నిజానికి వారు గత ఎన్నికల్లో వైసీపీకి ఓటేశారు. అందుకే 2014 ఎన్నికల్లో నాలుగు వేల ఓట్ల తేడాతోనే ఓడిపోయిన గల్లా అరుణకుమారి .. గత ఎన్నికల్లో పులివర్తి నాని పోటీ చేస్తే.. ఆ తేడా నలభై వేలకు వెళ్లిపోయింది. కానీ ఈ సారి ఆ కుటుంబాలన్నీ తమ పొట్ట కొట్టే పని జగన్ చేయబోయారన్న అసంతృప్తిలో ఉన్నారు. వారు తీసుకునే నిర్ణయం కీలకం కాబోతోంది.

చెవిరెడ్డి ప్రభుత్వ ఉద్యోగులందర్నీ బెదిరించడం.. లేదా తాయిలాలు ఇవ్వడం ద్వారా తన వైపు ఉండేలా చూసుకోవడంలో సిద్ధహస్తుడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యోగులను బెదిరించేలవారు. అధికారంలోకి వచ్చాక తాయిలాలు ఇస్తూంటారు. ముఖ్యంగా ఎన్నికల విధుల్లో పాల్గొంటారని భావిస్తున్న ప్రతి ఉద్యోగికి పండుగకు కానుక ఠంచన్‌గా చెవిరెడ్డి తరపున వెళ్తుంది. అంటే వచ్చే ఎన్నికలకు ఎలా సన్నాహాలు చేసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు.

చెవిరెడ్డి ఇతర రాజకీయ నాయకుల్లా కాదు. ఆయన సంపాదించుకుంటారు… పంచుతారు.. ఖర్చు పెడతారు. అదే సమయంలో సొంత పార్టీతో పాటు.. జగన్‌ను తీవ్రంగా వ్యతిరేకించే వారితోనూ సన్నిహితంగా ఉంటారు. అందుకే చంద్రగిరిలో చెవిరెడ్డి.. ప్రభుత్వ వ్యతిరేకతను తన సానుకూలతతో అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎంత వరకు సాధ్యమో ఎన్నికల్లోనే తెలియాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

జగన్ లండన్ పర్యటనలోనూ స్కిట్స్ !

ఏపీలో బస్సు యాత్రలు చేసేటప్పుడు జగన్ కు మోకాళ్ల మీద నిలబడి దండాలు పెట్టే బ్యాచ్ ను ఐ ప్యాక్ ఏర్పాటు చేస్తుంది. ఆ వీడియోలు సర్క్యూలేట్ చేసుకుంటూ ఉంటారు. ఇదేం బానిసత్వంరా...

ఎన్నారై కనిపిస్తే వణికిపోతున్నారేంటి

డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే అమెరికా డాక్టర్.. గన్నవరం ఎయిర్ పోర్టులో ఉన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు అక్కడ ఉన్నారు. అప్పుడే జగన్ రెడ్డి తన అత్యంత విలాసవంతమైన స్పెషల్ ఫ్లైట్‌లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close