‘వాల్తేరు వీర‌య్య‌’ త‌ర‌వాతే ఏదైనా..!

ప‌రాజ‌యాల నుంచి త్వ‌ర‌గా పాఠాలు నేర్చుకుంటారు చిరంజీవి. అందుకే…. ఆయ‌న కెరీర్ ఇన్నేళ్ల పాటు దిగ్విజ‌యంగా సాగుతోంది. `ఆచార్య‌` చిరుకి పెద్ద షాక్ ఇచ్చింది. ఈ సినిమా ప‌రాజ‌యంతో.. చిరు ఆలోచ‌న‌లో ప‌డ్డారు. ఇక మీద‌ట ఎలాంటి సినిమాలు చేయాలి? ఎవ‌రితో చేయాలి? అనే విష‌యంపై ఓ నిర్దిష్ట‌మైన అభిప్రాయానికి వ‌చ్చారు. ఇప్పుడు ఆయ‌న లైన‌ప్ చాలా బలంగా ఉంది. వాల్తేరు వీర‌య్య‌, గాడ్ ఫాద‌ర్‌, భోళా శంక‌ర్‌.. లైన్‌లో ఉన్నాయి. ఒకొక్క సినిమాకీ కొన్నేసి కాల్షీట్లు కేటాయిస్తూ, స‌మాంత‌రంగా పూర్తి చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు టాక్‌. ముందు `వాల్తేరు వీర‌య్య‌` పూర్తి చేసి, ఆ త‌ర‌వాత మిగిలిన సినిమాలు మొద‌టెట్టాల‌ని చూస్తున్నార్ట‌.

వాల్తేరు వీర‌య్య‌…చిరు స్టైల్లో సాగే సినిమా. మాస్ గా ఉండ‌బోతోంది. పైగా స్ట్ర‌యిట్ క‌థ‌. గాడ్ ఫాద‌ర్‌, భోళా శంక‌ర్ రీమేకులు. ఆ క‌థ‌ల గురించి ప్రేక్ష‌కుల‌కు అవ‌గాహ‌న ఉంది. కాబ‌ట్టి.. ఎంత బాగా చేసినా, మాతృక‌తో పోలిక‌లు వెదుకుతారు. పైగా రీమేకులతో హిట్టు కొట్టినా పెద్ద‌గా కిక్ రాదు. వాల్తేరు వీర‌య్య స్ట్ర‌యిట్ క‌థ కాబ‌ట్టి.. ఈ సినిమాని పూర్తి చేసి, విడుద‌ల చేసి, హిట్టు కొట్టాల‌ని చిరు భావిస్తున్నారు. అందుకే కాల్షీట్ల‌న్నీ.. వాల్తేరు వీర‌య్య‌కే కేటాయించ‌బోతున్నార్ట‌. గాడ్ ఫాద‌ర్ ముగింపు ద‌శ‌కు వ‌చ్చేసింది. ఆగ‌స్టులో విడుద‌ల అనుకుంటున్నారు. అంత‌కంటే ముందే.. వీర‌య్య పూర్త‌వుతుందో, లేదో చూడాలి. త్వ‌ర‌లోనే మ‌లేషియాలో `వాల్తేరు వీర‌య్య‌` కొత్త షెడ్యూల్ మొద‌ల‌వుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close