ఏపీ సర్కార్ యువర్ స్క్రీన్స్ .. బుక్ మై షోకు పోటీ !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో అమ్మేందుకు యువర్ స్క్రీన్స్ పేరుతో పోర్టల్ లాంఛ్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఇందులో సినిమా టిక్కెట్లు తక్కువ ధరకే లభిస్తాయని ఏపీఎస్‌ఎఫ్‌డీసీ ఎండీ విజయ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. సినిమా టిక్కెట్ల ధరలను ప్రభుత్వమే నిర్దేశిస్తుందని.. అదే సమయంలో ఇతర టిక్కెట్ పోర్టళ్లలో తీసుకునే సర్వీస్ చార్జీని తాము వసుూలు చేయబోమని చెబుతున్నారు. అంటే.. బుక్ మై షో లాంటి యాప్స్ లో కూడా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. వాటితో పాటు ప్రభుత్వ టిక్కెటింగ్ యాప్‌ను అందుబాటులోకి తెస్తారన్న మాట.

ఒక్క ప్రభుత్వమే ఆన్ లైన్ టిక్కెట్లు అమ్మడం చట్ట విరుద్ధమయ్యే ్వకాశం ఉండటంతో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ఇతర పోర్టల్ లలో టికెట్ బుకింగ్ చేసుకుంటే టికెట్ పై అదనంగా రూ.20 నుండి రూ.25 వరకు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని.. యువర్ స్క్రీన్స్ యాప్‌లో కేవలం కేవలం 1.95 శాతం మాత్రమే వసూలు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. అంటే సున్నా శాతమని విజయ్ కుమార్ రెడ్డి తన ప్రకటనలో చెప్పారు కానీ… దాదాపుగా రెండు శాతం స్పష్టంగా కనబడుతూంటే.. సున్నా శాతం ఎట్లా అవుతుందో వైసీపీ లెక్కల మాస్టార్లకే తెలియాలి. ఆ లెక్కన ఒక్కో టికెట్ పై ప్రేక్షకుడికి సుమారు రూ.25 భారం తగ్గుతుందని ప్రభుత్వం చెబుతోంది.

ప్రస్తుతం ఉన్న ఆన్ లైన్ పోర్టల్ లతో థియేటర్లకు ఒప్పందాలు ఉన్నాయి. ఈ ఒప్పందాలు కొనసాగుతాయి. అయితే ప్రభుత్వ ఎగ్జిస్టింగ్ జీవో ప్రకారం కేవలం 50 శాతం సీట్లు మాత్రమే ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకునే అవకాశం ఉందని ప్రభుత్వం గుర్తు చేసింది. అదే యువర్ స్క్రీన్స్‌లో అయితే వంద శాతం బుక్ చేసుకోవచ్చు. థియేటర్ల వారికి తమ డబ్బు తమకు సక్రమంగా రాదనే అపోహలు అవసరం లేదని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం ఉన్న ఆన్ లైన్ పోర్టల్ లతో పాటు ప్రభుత్వం తీసుకువచ్చిన యువర్ స్క్రీన్స్ ద్వారా కూడా ప్రేక్షకులు టికెట్ బుక్ చేసుకునే అవకాశం థియేటర్లు కల్పించాలని అవసరమైన హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ లను కూడా ప్రభుత్వమే అందిస్తుంగని ప్రభుత్వం స్పష్టం చేసింది.

మొత్తంగా ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం చూస్తే… బుక్ మై షో తరహాలో ప్రభుత్వం యాప్ రిలీజ్ చేస్తోంది. తాను రెండు శాతం కమిషన్ తీసుకుంటోంది. అయితే ఇచాలా వరకూ ప్రభుత్వం చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండదు. అందుకే.. ప్రభుత్వం .. గుత్తాధిపత్యం కోసం ఏదో ఓ ప్రయత్నం చేస్తుందని.. ఎంవోయూలు చేసుకోవడం లేదన్న కారణంగాఈ ప్రకటన ఇచ్చిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close