“సివిల్ సర్వీస్” అధికారం చేతిలో ఇంత బలహీనమా !?

సివిల్ సర్వీస్ అంటే అత్యున్నతం. రాజకీయంగా అధికారంలోకి వచ్చేవాళ్లు ఐదేళ్లుంటారు.. కానీ వారు మాత్రం జీవితాంతం పవర్‌లో ఉంటారు. ఇలాంటివి సివిల్ సర్వీస్ అధికారుల గురించి చెప్పుకోవడానికి బాగుంటాయి. కానీ వాస్తవంలో అ రాజకీయ అధికారంలో ఆ సివిల్ సర్వీస్ అధికారుల వెన్నుముక విరిగిపోయిందని .. వ్యవస్థలు కూడా ఏమీ చేయలేని స్థితిలోకి వెళ్లిపోయాయని డీజీపీ స్థాయి ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరరావు సస్పెన్షన్ వ్యవహారంతో మరోసారి తేలిపోయింది.

మూడేళ్ల నిరీక్షణ.. రెండేళ్ల సస్పెన్షన్ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన రెండు నెలల తర్వాత పోస్టింగ్ ఇచ్చిన ప్రభుత్వం రెండు వారాల్లోనే మళ్లీ సస్పెండ్ చేసింది. దానికి చెప్పిన కారణం తనపై నమోదైన కేసుల్లో సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారనడం. ప్రభుత్వం ఎలా ఊహించుకుంటే అలా కారణాలు చెప్పి ఉత్తర్వులు ఇచ్చేస్తోంది. ఈ కారణంగా మరోసారి సీనియర్ ఐపీఎస్ అధికారి సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇలాంటి కారణాలతో డీజీపీ స్థాయి అధికారిని కూడా ఇలా ఆడుకుంటే ఇక సివిల్ సర్వీస్ అధికారులకు పదవి.. పలుకుబడి ఎక్కడ ఉంటుంది ?

ఐదేళ్లే అధికారంలో ఉండే రాజకీయం చేతిలో సీనియర్ ఐపీఎస్‌లు కొంత మంది కీలు బొమ్మల్లా మారడంతోనే ఈ దుస్థితి తలెత్తుతోందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ రోజు ఒక్క ఏబీ వెంకటేశ్వరరావు.. రేపు ప్రభుత్వం మారితే పది మంది అవుతారు. ఆ తర్వాత ఇరవై మంది అవుతారు. ఇలా ఒక్కొక్కరు పెరుగుతూనే పోతారు. ప్రభుత్వానికి ఎవరైతే గులాంగిరీ చేస్తారో వారికి ఆ ప్రభుత్వం ఉన్నంత కాలం బాగుంటుంది.. తర్వాత ?.

ముస్సోరిలో ట్రైనింగ్‌లో పాతికేళ్ల కింద నేర్పిన విలువులు.. అన్నింటినీ రిటైర్మెంట్ దగ్గరకు వచ్చే సరికి పాతరేస్తున్నారు. ఇది వారికి వ్యక్తిగతంగా లాభం.. నష్టం చేస్తున్నాయి. రాజకీయ అధికారానికి లొంగిపోయి… తాత్కాలిక ప్రయోజనాల కోసం… సొంత వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారు. కానీ అంతిమంగా ఓ అత్యున్నత వ్యవస్థను నిర్వీర్యం చేసి దేశానికి నష్టం చేస్తున్నారు. రాను రాను పరిస్థితి దిగజారుతోంది కానీ మెరుగుపడే పరిస్థితి కనిపించడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close