సచివాలయ ఉద్యోగులకు మరో ఫిట్టింగ్ !

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఈ నెల కూడా పాత జీతమే వచ్చింది. పెరిగిన జీతం వచ్చే నెల నుంచి వస్తుందేమోనని ఆశ పడుతున్నారు. అయితే ప్రొబేషన్ ఖరారు చేసినా వారి వద్ద నుంచి కోట్లు వసూలు చేయడానికి ప్రభుత్వం స్కెచ్ వేసింది. ఆ డబ్బులు ప్రభుత్వానికి బాకీ ఉన్నారని చెల్లిస్తేనే ప్రొబేషన్ ఖరారు చేస్తామని చెబుతోంది. కానీ అలాంటి బాకీలేమి లేమని గ్రామ, వార్డు సచివాయ ఉద్యోగులు అంటున్నారు.

గత ప్రభుత్వాలు ఎప్పుడో ఇచ్చిన ఇళ్లకు ఇప్పుడు డబ్బులు వసూలు చేయాలనుకుంది ఏపీ ప్రభుత్వం. అందుకు ఓటీఎస్ అనే స్కీమ్ పెట్టింది. వాటిపై రోజువారీ టార్గెట్లు పెట్టి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బాధ్యతలు ఇచ్చింది. ఈ టార్గెట్లకు తాళ లేక.. వారు చాలా మంది లబ్దిదారుల నుంచి తర్వాత ఇస్తామనో.. మరో ప్రామిసరి నోటో రాయించి.. వారు ఓటీఎస్ కట్టినట్లుగా రికార్డుల్లో నమోదు చేశారు. కానీ వారు చెల్లించలేదు. అలా పేరుకుపోయిన సొమ్ము ఎనభై కోట్లకుపైగానే ఉంది. నిజానికి అది లబ్దిదారులు కట్టింది కాదు… కానీ కట్టినట్లుగా రాశారు. అయితే రికార్డుల్లో కట్టినట్లుగా ఉంది.. ఆ సొమ్ము ఖజానాకు జమ కాలేదు కాబట్టి ఎప్పటి పరిస్థితుల్లో ఇవ్వాల్సిందేనని ప్రభుత్వం చెబుతోంది.

ఆ సొమ్ము ఎవరి వద్ద పెండింగ్‌లో ఉందో.. వారి ప్రొబేషన్లను ప్రభుత్వం నిలిపివేసింది. ఆ డబ్బులు కట్టాలని ఒత్తిడి తెస్తోంది., కొంత మంది ఇలా పెండింగ్ బకాయిలు లక్షల్లో ఉన్నట్లుగా ఉండటంతో చాలా మంది టెన్షన్‌కు గురవుతున్నారు. కట్టకపోయినా కట్టినట్లుగా రికార్డు చేసుకోమని ఒత్తిడి చేసిన పై అధికారులను.. స్థానిక వైసీపీ నేతలను వారు గట్టెక్కించమని వేడుకుంటున్నారు. కానీ వారు పట్టించుకోవడం లేదు.

మరో వైపు ఎవరూ నోరెత్తకుండా కఠిన చర్యలను ప్రభుత్వం తీసుకుంటోంది. నిరసనకు దిగిన వారి ప్రొబేషన్ రద్దు చేస్తామని గతంలో రోడ్డెక్కిన వారి పేర్లను కలెక్టర్లకు పంపింది. దీంతో ఇప్పుడు నోరెత్తలేని పరిస్థితికి మిగతావారు వెళ్లిపోయారు. ప్రభుత్వాన్ని నమ్మిదారుణంగా మోసపోయామని వారు ఆవేదన చెందుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కోవిషీల్డే కాదు… కోవాగ్జిన్ తోనూ ప్రమాదమే..!!

కరోనా వైరస్ నిర్మూలన కోసం తయారు చేసిన కోవిషీల్డ్ తో సైడ్ ఎఫెక్ట్ నిజమేనని ఇటీవల ఆస్ట్రాజెనెకా అంగీకరించగా... భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ తో కూడా దుష్ఫలితాలు ఉన్నాయని తాజాగా...

ఓటమి భయమా – మోడీ, షా వ్యాఖ్యల అంతరార్ధం ఇదేనా..?

ఓ వైపు మేమే అధికారంలోకి వస్తామని ఇండియా కూటమి ధీమా వ్యక్తం చేస్తుండగా... ప్రధాని మోడీ, అమిత్ షా మాత్రం చార్ సౌ పార్ నినాదాన్ని వదిలేసి ఇండియా అధికారంలోకి వస్తే అంటూ...

సీట్ల సంఖ్య తేల్చేందుకు కాంగ్రెస్ ఇంటర్నల్ సర్వే

లోక్ సభ ఎన్నికల్లో 13 సీట్లు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తోన్న కాంగ్రెస్ పార్టీ, సీట్ల సంఖ్యపై ఖచ్చితమైన అభిప్రాయానికి వచ్చేందుకు ఇంటర్నల్ సర్వే చేపట్టింది. హస్తం పార్టీకి ఈ ఎన్నికల్లో ఏయే...

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close