హైదరాబాద్‌కు “విమాన పరిశ్రమలు” కూడా !

హైదరాబాద్ ఫార్మా, ఐటీ రంగాల్లో ప్రపంచవ్యాప్త పేరు తెచ్చుకుంది. ఇప్పుడు కొత్తగా విమానయాన రంగానికి సంబంధించిన పరిశ్రమలు కూడా తరలి వస్తున్నాయి. విమానయాన రంగ ఉత్పత్తులను తయారుచేసే ఫ్రాన్స్ కు చెందిన దిగ్గజ సంస్థ శాఫ్రాన్ తన మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాల్ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. 15 కోట్ల డాలర్లు అంటే దాదాపుగా పన్నెండు వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. విమాన ఇంజన్ల నిర్వహణ, మరమ్మత్తు కేంద్రాన్ని శాఫ్రాన్ ఏర్పాటు చేస్తుంది.

ఇండియాలో తన తొలి ఓవర్‌హాల్ కేంద్రాన్ని ఏర్పాటుచేసేందుకు హైదరాబాద్ ను ఎంచుకోవాలనుకున్న శాఫ్రాన్ నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్ స్వాగతించారు. శాఫ్రాన్ సంస్థకు చెందిన అతిపెద్ద నిర్వహణ కేంద్రం హైదరాబాద్‌దే అవుతుందన్నారు పౌర, సైనిక విమానాల కోసం అధునాతన ఇంజిన్లు ఉత్పత్తి చేసే అగ్రశ్రేణి కంపెనీల్లో ఒకటి శాఫ్రాన్‌. ఈ ప్రతిపాదిత ఎంఆర్‌వో తో సుమారు వెయ్యి ఉద్యోగాలు లభిస్తాయి. భారత్‌తో పాటు విదేశీ వాణిజ్య విమానయాన సంస్థల విమానాల్లో వాడే లీప్‌-1ఏ, లీప్‌-1బీ ఇంజన్ల నిర్వహణను హైదరాబాద్ లోనే చేస్తారు.

ప్రస్తుతం విదేశాల్లోనే ఈ సౌకర్యం అందుబాటులో ఉందన్నారు. శాఫ్రాన్ ఎంఆర్ఓ కేంద్రం ఏర్పాటుతో తెలంగాణలోని ఏవియేషన్ పరిశ్రమకు మరింత ఊతం లభిస్తుంది. ఇప్పటికే హెలికాఫ్టర్ చాసిస్‌ల తయారీ కంపెనీలు హైదరాబాద్‌లో ున్నాయి. ఈ భారీ పెట్టుబడితో ఏరోస్పేస్ రంగంలో హైదరాబాద్ కు మరిన్ని కంపెనీలు తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

చిరుని క‌లిసిన మారుతి.. ఏం జ‌రుగుతోంది?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఇది వ‌ర‌కు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌న్న వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతా ఓకే అనుకొన్న త‌రుణంలో.....

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close