చైతూ మాత్ర‌మే చేయ‌గ‌లిగే సినిమా ఇది: విక్ర‌మ్ కె.కుమార్‌

అక్కినేర‌ని కుటుంబానికీ, విక్ర‌మ్ కె.కుమార్‌కీ ఉన్న అనుబంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ కుటుంబానికి మ‌నం లాంటి మ‌ర్చిపోలేని సినిమాని విక్ర‌మ్ అందించాడు. ఆ త‌ర‌వాత అఖిల్ తో `హ‌లో` చేశాడు. ఇప్పుడు.. నాగ‌చైత‌న్య‌తో `థ్యాంక్యూ` చేశాడు. ఆ సినిమా బ‌య‌ట‌కు రాకుండానే… చైతూతో ఓ వెబ్ సిరీస్ ప‌ట్టాలెక్కించేశాడు. ఆ వెబ్ సిరీస్ కూడా.. దాదాపుగా పూర్తి కావొచ్చింది. `థ్యాంక్యూ` త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సినిమా గురించి, అందులోని చైతూ పాత్ర గురించీ.. కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు చెప్పుకొచ్చాడు

“ఈ క‌థ‌ని చైతూ ఒక్క‌డే చేయ‌గ‌ల‌డు. ఎందుకంటే.. ఇందులో హీరో మూడు భిన్న‌మైన రూపాల్లో క‌నిపించాలి. అందులో ప‌ద‌హారేళ్ల పాత్ర కూడా ఉంది. ఆ పాత్ర‌ని మ‌రొక‌రితో చేయించ‌లేం. గ్రాఫిక్స్‌లో మ్యాజిక్ చేసి ఆ పాత్ర‌ని సృష్టించ‌లేం. ప‌ద‌హారేళ్ల పిల్లాడిగా చైతూ మారిపోవ‌డం చూసి నేను ఆశ్చ‌ర్య‌పోయాను. ఆ పాత్ర‌కు సంబంధించిన సీన్స్ చేస్తున్న‌ప్పుడు త‌ను బాగా క‌ష్ట‌ప‌డ్డాడు. కేవ‌లం ఆ పాత్ర కోస‌మే… 45 రోజుల పాటు క‌ఠిన‌మైన డైట్ పాటించాడు. ఇదంతా చైతూ మాత్ర‌మే చేయ‌గ‌ల‌డు..“ అని చైతూ క‌ష్టాన్ని వివ‌రించాడు.

విక్ర‌మ్ కె.కుమార్ ప్ర‌స్తావ‌న ఎప్పుడొచ్చినా `24 సీక్వెల్ ఎప్పుడు` అనే చ‌ర్చ మొద‌ల‌వుతుంది. దీనికీ.. ఆయ‌న స‌మాధానం చెప్పాడు. “24 సీక్వెల్ చేయాల‌ని నాకూ ఉంది. అందుకోసం ఆలోచిస్తున్నాను. మొన్నే.. నాలుగైదు పేజీల్లో క‌థ కూడా రాశాను. దానిపై ఏగాగ్ర‌త‌తో ప‌నిచేయాలి. సూర్య‌తో మ‌రో టైమ్ ట్రావెల్ క‌థ తీయాలి అనుకుంటే.. ఆ ప‌ని నాకు చాలా తేలిక‌. కానీ.. ఆత్రేయ లాంటి పాత్ర‌ని కొన‌సాగిస్తూ ఆ క‌థ చెప్పాలి అంటేనే క‌ష్టం. అందుకే ఈ సినిమా ఆల‌స్యం అవుతోంద‌“న్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close