బీజేపీతో పొత్తుపై టీడీపీ క్యాడర్‌లో వ్యతిరేకత !

భారతీయ జనతా పార్టీతో పొత్తు విషయంలో తెలుగుదేశం పార్టీలో ఎలాంటి సానుకూల సంకేతాలు కనిపించడం లేదు. పై స్థాయి నేతలు మాత్రం ఆసక్తిగా ఉన్నారు. కానీ కింది స్థాయి నేతలు మాత్రం బీజేపీతో పెట్టుకోవడం కన్నా ఖాళీగా ఉండటం మేలన్న అభిప్రాయానికి వస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నామన్న కారణంగా ఇక్కడి నేతలు చూపించే నోటి దురుసు.. టీడీపీపై చేసే కుట్రలు ఇంకా తమ కళ్ల ముందే ఉన్నాయని టీడీపీ నేతలంటున్నారు.

దేశానికి బీజేపీ చేసిన మేలేం లేదని చాలా మంది టీడీపీ నేతలు లెక్కలతో సహా ట్విట్టర్‌లో వాదిస్తున్నారు. డీపీలు మార్చుకోవడం.. జెండాలు కట్టుకోవడానికి ఇచ్చే పిలుపులు మినహా.. దారుణమైన పరిపాలన అందిస్తున్నారని అంటున్నారు. ఏపీలో రాజధాని, పోలవరం అన్నీ మూలన పడుతున్నా కేంద్రం పట్టించుకోలేదని గుర్తు చేస్తున్నారు. జనసేనతో పొత్తు విషయంలో చాలా మంది టీడీపీ క్యాడర్ సానుకూలంగా ఉన్నా.. బీజేపీ విషయంలో మాత్రం నిర్మోహమాటంగా తమ అభిప్రాయం చెబుతున్నారు.

బీజేపీకి ఉన్న ఓటు బ్యాంక్ వల్ల … పొత్తు పెట్టుకునే పార్టీకి జరిగే మేలు కొంతే. అయితే .. అయితే ఎక్స్‌టర్నల్ మ్యాటర్స్అనుకూలంగా మారుతాయని ఎన్నికల్లో గెలవాలంటే అది కూడా ముఖ్యమని వాదిస్తున్నారు. ఈ విషయంలో హైకమాండ్ ఆలోచన ఎలా ఉంటుందో కానీ మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకునే అంశంలో టీడీపీ క్యాడర్‌లో మాత్రం అంత సానుకూలత లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close