పూరీ జగన్నాథ్ ఆలోచనలు చాలా క్రేజీగా వుంటాయి. ఇప్పుడాయన నుండి లైగర్ సినిమా వస్తోంది. విజయ్ దేవరకొండ మొదటి పాన్ ఇండియా మూవీ ఇది. ఈ సినిమా కోసం లెజండ్ ఫైటర్ మైక్ టైసన్ ని రంగంలో దించుతున్నాడు పూరి. మైక్ నటిస్తున్న మొదటి ఇండియన్ మూవీ గా కూడా లైగర్ చరిత్రకెక్కింది. అయితే ఇందులో మైక్ పాత్రలో ఒక సర్ ప్రైజ్ వుంది. మైక్ అనగానే ఫైటర్ అనుకుంటాం. ట్రైలర్ కూడా బాక్సింగ్ నేపధ్యంలో వుండటం వలన ఆయన కూడా రింగ్ లో దిగుతాడని భావిస్తాం. ఐతే పూరి మైక్ పాత్రని పక్కా కమర్షియల్ గా డిజైన్ చేశాడట. ఈ చిత్రంలో నటించిన నటుడు విష్ ఈ సంగతి చెప్పుకొచ్చారు.
”లైగర్ లో ఒక లెజెండ్ ఫైటర్ పాత్ర అవసరం ఏర్పడింది. లెజెండ్ అంటే మనకి మైక్ టైసన్ గుర్తుకువస్తారు ఆయనకి కథ అద్భుతంగా నచ్చి ప్రాజెక్ట్ లోకి రావడం ఆనందంగా అనిపించింది. చిన్నప్పటినుండి మైక్ టైసన్ కి ఫ్యాన్ బాయ్ నేను. ఆయన ఫైట్స్ చూస్తూ పెరిగాను. అయితే పర్శనల్ గా ఆయన ఎలా వుంటారో అనే ఒక ఆసక్తి వుండేది. పర్శనల్ గా ఆయన పదేళ్ళ చిన్న పిల్లాడు ఎలా ఉంటారో అంత స్వీట్ గా వున్నారు. ఆయన లెజండ్ పాత్రలో కనిపిస్తారు. ఫైట్లు వుంటాయి. అయితే అవి బాక్సింగ్ రింగ్ లో కాదు. సినిమాలో ఆయన పాత్ర పక్కా మాస్ మసాలా కమర్షియల్ గా వుంటుంది. ఇందులో ఆయన పేరు కూడా మైక్ టైసన్ కాదు. ఆయన పాత్రలో ఒక సర్ప్రైజ్ వుంటుంది” అని చెప్పుకొచ్చాడు విష్.