గోరంట్ల వీడియోపై ఢిల్లీలో విచారణ ఖాయం !

పక్కాగా తప్పు చేశాడని తెలిసినా స్క్రిప్ట్ ప్రకారం పోలీసులతో కూడా తప్పుడు స్టేట్‌మెంట్లు ఇప్పించి క్లీన్ చిట్ వచ్చిందని గోరంట్ల మాధవ్‌ను వైసీపీ వెనకేసుకు వస్తుంది కానీ .. ఆ వీడియో వ్యవహారం ఢిల్లీలో కలకలం రేపడం ఖాయంగా కనిపిస్తోంది. జాతీయ మహిళా కమిషన్ ఈ అంశంపై లోక్‌సభా స్పీకర్‌కు లేఖ రాసింది. ఆ వీడియో పోర్న్‌ వీడియో కిందకు వస్తుందని.. తక్షణం విచారణ చేయించాలని.. ఎంపీపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ స్పీకర్‌ని కోరింది . జాతీయ మహిళా కమిషన్‌కు ఏపీ నుంచి పలు ఫిర్యాదులు అందాయి.

దీంతో ఆ వీడియోను మహిళా కమిషన్ సీరియస్‌ గా తీసుకుంది. విచారణ జరిపి ఎంపీపై చర్య తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ లోక్ సభ స్పీకర్‌ను కోరారు. స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని ఏపీ డీజీపీకి కూడా జాతీయ మహిళా కమిషన్ ఓ లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. త్వరలో విచారణ జరిపి వివరాలు తెలపాలని సూచించినట్లుగా తెలుస్తోంది. అయితే ఏపీ పోలీసులు ఒరిజినల్ వీడియో లేదని..ప్రస్తుతం ఉన్నది రికార్డు చేసిందని చెబుతున్నారు.

ఫోరెన్సిక్‌కు పంపడానికి కూడా పోలీసులు అంగీకరించడం లేదు. ఒక్క ఎన్‌సీడబ్యూనే కాదు.. పంజాబ్ కాంగ్రెస్ ఎంపీ కూడా లే్ఖ రాశారు. దీంతో స్పీకర్ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అక్కడి దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ చేయిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. చేతిలో ఉన్న ఏపీ పోలీసులతో ఏదో విధంగా మ్యానేజ్ చేసినా ఇప్పుడీ విషయం ఢిల్లీకి వెళ్తే అసలు గుట్టు బయటపడే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్‌కు బీజేపీ అండ లేదని చేతల్లో చూపిస్తేనే నమ్ముతారు లక్ష్మణ్ జీ !

రెండు రోజులుగా ఏపీలో పర్యటిస్తున్న బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్ డాక్టర్ కె లక్ష్మణ్.. తజన్గ సర్కార్‌పై ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. అమరావతికే తమ మద్దతంటున్నారు. అభివృద్ది లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని...

“ఉద్యమ” పంచాయతీ పెట్టుకున్న కేటీఆర్ !

తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. చాలా మందికి సాయం చేస్తూంటారు. విపక్షాలతో పాటు మోదీపైనా విమర్శలకు వాడుకుంటూ ఉంటారు. అయితే రాజకీయ పరమైనవే అయినా... విధానపరంగా ఆ...

ఉత్తదే.. ఆ ప్రచారాన్ని ఖండించిన నాగార్జున …!

విజయవాడ ఎంపీ స్థానానికి పోటీ చేసే అంశంపై వైసీపీ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్‌కు నాగార్జున ఇంచ్ కూడా కదల్లేదు. అలాంటి ఆలోచనలు.. ఆశలు .. పెట్టుకోవడం లేదని తేలిగ్గా తీసుకున్నారు. తన కొత్త...

ఆ లెక్కన కేసీఆర్ కూడా ” యాంటీ వైసీపీ గ్యాంగ్‌’లో చేరినట్లేనా సజ్జల !?

తెలంగాణ మంత్రులు వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని.. జగన్ పరిపాలనను అవకాశం దొరికిన ప్రతీ చోటా..ఇంకా చెప్పాలంటే అవకాశం సృష్టించుకుని మరీ విమర్శలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కూడా నేరుగా ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. హరీష్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close