షర్మిల చెప్పారు.. జగన్ చెప్పలేదు !

ఎప్పుడైనా రాఖీ పండుగ వస్తే.. వైసీపీ నేతలకు కానీ.. వైసీపీ మీడియాకు కానీ.. వారి అనుబంధ మీడియాకు కానీ జగన్- షర్మిల అనుబంధం చూపించడానికి స్పెషల్ ఎపిసోడ్లు వేసేవారు. షర్మిల, జగన్ మధ్య రాఖీ అనుబంధం లైవ్‌లో చూపించేవారు. రాఖీలు కట్టే ఫోటోలు వైరల్ అయ్యేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కానీ గత రెండేళ్ల నుంచి అది లేదు. వారి మధ్య దూరం పెరిగిందని మాటల్లేవని చెప్పుకుంటున్నారు. అది నిజమేననిపించేలా పరిస్థితులు ఉన్నాయి.

కనీసం సోషల్ మీడియాలో కూడా చెల్లి షర్మిలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు చెప్పలేదు. కానీ షర్మిల మాత్రం అన్న జగన్ పేరెత్తకుండా.. అందరితో కలిపి అయినా రాఖీ శుభాకాంక్షలు చెప్పారు. ” నా తోడబుట్టిన అన్నతోపాటు నా ఈ ప్రజాప్రస్థాన పాదయాత్రలో 1600 కిలోమీటర్ల పైగా నాతో నడిచి, నాకు దేవుడిచ్చిన తోబుట్టువుల్లా రక్షణగా నిలిచిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి రాఖీ పండుగ శుభాకాంక్షలు..” అని ట్వీట్ చేశారు. ఎక్కడా జగన్ పేరు రాయలేదు. అలాగే ట్వీట్‌ను కూడా జగన్‌కు ట్యాగ్ చేయలేదు.

వైఎస్ జగన్ కానీ..వైసీపీ కానీ ఎక్కడా షర్మిల పేరును రాఖీ పండుగ సంబరాల్లో తీసుకు రాలేదు. ప్రతీ సారి పెట్టో ఫోటోలు ఈ సారి కనిపించనీయలేదు. రాజకీయం వేరు.. వ్యక్తిగత సంబంధాలు వేరు. కుటుంబం వేరు. రాజకీయం కోసం వ్యక్తిగతం.. కుటుంబ సంబంధాలను కాలదన్నుకోకుండా ఎంతో మంది రాజకీయ నేతలు వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో సీఎం జగన్ మాత్రం వ్యక్తిగతంగా.. కుటుంబపరంగా కూడా సోదరికి దూరమైనట్లుగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్యాపింగ్ కేసులో కీలక పత్రాలు బయటపెట్టిన బండి సంజయ్ – ఎలా ?

ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరును రాధాకిషన్ రావు అనేక సార్లు చెప్పినప్పటికీ ఆయన కోసమే తాము ట్యాపింగ్ చేశామని నిర్దారించినప్పటికీ కేసీఆర్ కు ఇంత వరకూ నోటీసులు ఇవ్వకపోవడానికి కారణం ఏమిటని...

మీడియా వాచ్ : “స్టడీ”గా రవిప్రకాష్ ఈజ్ బ్యాక్ !

సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ చాలా వస్తాయి. కానీ స్టడీలు మాత్రం కొన్నే ఉంటాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో రవిప్రకాష్ స్టడీ హాట్ టాపిక్ అవుతోంది. RTV స్టడీ...

వృద్ధుల ప్రాణాలతో రాజకీయం – ఇంత క్రూరమా ?

ఏపీ ప్రభుత్వానికి వృద్ధులను ఎంత హింసిస్తే అంత మంచి రాజకీయం అనుకుంటున్నారు. వాళ్లు ఎంత బాధపడితే అంతగా చంద్రబాబును తిట్టుకుంటారని ఊహించుకుంటూ వాళ్లను రాచి రంపాన పెడుతున్నారు. ఇంటింటికి పంపిణీ చేసేందుకు...

ఓటేస్తున్నారా ? : ఏపీ రాజధానేదో ఒక్క సారి గుర్తు తెచ్చుకోండి !

పాలకుడు సొంత రాష్ట్రంపై కుట్రలు చేసుకునేవాడు అయి ఉండకూడదు. సొంత ప్రజల్ని నాశనం చేసి తాను ఒక్కడినే సింహాసనంపై కూర్చుని అందర్నీ పీల్చి పిప్పి చేయాలనే వ్యక్తిత్వం ఉండకూడదు. అలా ఉంటే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close