నేరస్తులకే అండ – ఇదేం పాలన !?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహారశైలి వివాదాస్పదమవుతోంది. ఘోరమైన నేరాలు చేసిన వారికే అత్యున్నత స్థాయిలో అండగా నిలుస్తోంది. అత్యున్నత స్థాయిలో వ్యవస్థలను కూడా ప్రభావితం చేసి మరీ ఈ పనులు చేయడం ప్రజలను కూడా విస్మయానికి గురి చేస్తోంది. పాలన చేపట్టిన మొదటి నుంచి ఇదే వరుస. చిన్న చిన్న నేరాల్లోనూ సొంత పార్టీ నేతలయితే చర్యలు తీసుకోవడానికి పోలీసులకు ఎలాంటి అనుమతి రావడంలేదు. మీడియాలో అటెన్షన్ వస్తే అసలు తీసుకోవడం లేదు. ఈ కారణంగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి.. పోలీసుల వ్యవస్థ పనితీరు చర్చనీయాంశమవుతోంది.

సొంత బాబాయ్ హత్య కేసు దగ్గర్నుంచీ అదే పరిస్థితి !

వివేకానందరెడ్డి జగన్ సొంత బాబాయ్. ఆయనను దారుణంగా హత్య చేస్తే నిందితుల్ని వేటాడి.. వెంటాడి చట్టం ముందు పెట్టాల్సిన సీఎం.. నిందితుల్ని వెనకేసుకు వచ్చేలా వ్యవహరిస్తున్నారు. పోలీసు వ్యవస్థ తమ దర్యాప్తును పూర్తి చేయకుండా ఉండటంలో సక్సెస్ అయ్యారు. సీబీఐకి ఇచ్చినా వారిని ఎలా అడ్డుకున్నారో కళ్ల ముందే కనిపిస్తోంది. సొంత బాబాయ్ హంతకులు … సొంత వాళ్లైనా సరే రక్షించాలని .. ఏ ముఖ్యమంత్రైనా అనుకుంటారా ? ఘనత వహించిన ముఖ్యమంత్రి అనుకుంటున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ బాబాయ్ కుమార్తె.. సోదరి .. రాఖీ పండుగ రోజే.. సుప్రీంకోర్టు మెట్లెక్కి.. అన్న ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పారు.

హవ్వ.. హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే ఎమ్మెల్సీకీ మద్దతా !?

ఆ ఎమ్మెల్యే నేరప్రవృప్తి కొత్తదేం కాదు. ఆయనపై రౌడీషీట్ ఉంది. తమ ప్రభుత్వం వచ్చాక ఎత్తేయించుకున్నారు. ఇప్పుడు ఓ డ్రైవర్‌ని చంపానని అంగీకరించి జైల్లో ఉన్నారు. కానీ ఆయనకు పోలీసులు ఇస్తున్న సపోర్ట్ చేస్తే.. ప్రాణం అంటే అంత అలుసైపోయిందా అని ఆశ్చర్యపోక తప్పని పరిస్థితి. ప్రభుత్వం ఒత్తిడి లేకపోతే.. ఖాకీ డ్రెస్ వేసుకున్న పోలీసులు ఓ హంతకుడ్ని వెనకేసుకు వచ్చే ప్రయత్నం చేస్తారా ? అసలు దర్యాప్తు చేయకుండా పక్కన పెడతారా ? ఎమ్మెల్సీని మంచివాడికి చూపించే ప్రయత్నం చేస్తారా ?

నీచానికి పాల్పడిన గోరంట్ల మాధవ్‌కీ మద్దతు !

గోరంట్ల మాధవ్ చేసింది తప్పుడు పని. అది ఒరిజినల్ కాదు అని పోలీసులతో చెప్పించి.. పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని తగ్గించారు కానీ.. గోరంట్ల తప్పు చేయలేదు అని ఎవర్నీ నమ్మించలేకపోయారు. అదే సమయంలో అత్యంత దారుణంగా అసభ్యంగా.. మనుషుల్ని..కులాల్ని తిట్టిస్తూ… రాక్షాసానందం పొందుతున్నారు. తప్పు చేసిన వ్యక్తిపై చర్య తీసుకుంటేనే ఇతరులు తప్పు చేయాలంటే భయపడతారు. కానీ అతనికి మద్దతిచ్చి ఏం సంకేతం పంపుతారు ? అలాంటి తప్పుడ పనులు చేసే వారు పెరిగిపోతారు. అంతిమంగా అది ఎవరికి చేటు చేస్తుంది ?

నేరాలు చేసిన ఎంతో మంది స్వేచ్చగా తిరుగుతున్నారు !

వైసీపీ పాలనలో నేరాలు చేసినట్లుగా స్పష్టమైన ఆధారాలున్న వారిపై కేసులు నమోదైన సందర్భాలు లేవు. టీడీపీ ఆఫీసు మీద .. ఓ ముఠా దాడి చేస్తే ఎవరిపైనా కేసులు పెట్టలేదు. పట్టాభి అనే నేత ఇంట్లో బీభత్సం సృ,ష్టించినా కేసులు లేవు. ఎంతో మంది రౌడీషీటర్లు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ఎక్కడ చూసినా.. నేరాలే కనిపిస్తున్నాయి. ప్రభుత్వ అండఉందని వారు చెలరేగిపోతున్నారు. ఇది ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయడమే. వారి నమ్మకాన్ని వమ్ము చేయడమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close