వైసీపీలో కట్టుదాటుతున్ననేతల ఆధిపత్య పోరాటాలు !

కొండ నాలికకు ముందేస్తే ఉన్న నాలిక ఊడిందన్నట్లుగా మారింది వైసీపీ పరిస్థితి. వైఎస్ఆర్‌సీపీలో అన్ని జిల్లాలో అసంతృప్తి స్వరాలు పెరిగిపోతున్నాయి. తమపై సొంత పార్టీ నేతలే కుట్రలు చేస్తున్నారని.. బాలినేని, అనిల్ లాంటి మాజీ మంత్రులు కూడా మీడియాకు ఎక్కాల్సిన పరిస్థితి ఏర‌్పడింది. అటు కడప నుంచి ఇటు సిక్కోలు వరకూ వైసీపీలో ఎవరి పరిస్థితి ప్రశాంతంగా లేదు. అన్ని జిల్లాల్లోనూ నేతలు ఒకరిపై ఒకరు కుట్రలు చేసుకుటున్నారన్న ఆరోపణలు ఎవరికి వారు చేసుకుంటున్నారు. అవి అంతకంతక పెరిగిపోతున్నాయి. దీనికి సీఎం జగన్ తీరు కూడా కారణం అవుతోంది. తాజాగా దర్శి ఎమ్మెల్యే వ్యాఖ్యలే దీనికి సాక్ష్యంగా కనిపిస్తున్నాయి.

మెజార్టీ నియోజకవర్గాల్లో ఆధిపత్యపోరాటం సాగుతోంది. దీంతో విభేదాలు పార్టీని బలహీనపరిచేలా ఉంటున్నాయి. కానీ హైకమాండ్ మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. కొంద‌రు బ‌య‌ట ప‌డుతున్నారు. మ‌రికొంద‌రు వేచి చూస్తున్నారు. పార్టీలో అధినేతకు సన్నిహితులుగా పేరుపడ్డ వారు సైతం అసంతృప్తితో రగిలిపోతున్నారు. వారు కూడా అధినేతకు చెప్పుకోలేక మీడియాకు ఎక్కుతున్నారు. హైకమాండ్ జిల్లాలో నాయకుల మధ్య ఆధిపత్య పోరాటంపై తక్షణం దృష్టి పెట్టాలన్న సూచనలు చేస్తున్నా.. వారు ఇతర పనులతో బిజీగా ఉన్నారు.

పార్టీలో అంతర్గత రాజకీయాల కారణంగా పార్టీ నేతలను ఒకరికొకరు దెబ్బతీసుకునే వ్యూహాలను కొంత కాలంగా వైఎస్ఆర్‌సీపీ నేతలు చేసుకుంటున్నారని ఆ పార్టీ నేతుల చెప్పుకుంటున్నారు. ప్రతి జిల్లాలో దాదాపుగా సగం నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి ఉందంటున్నారు. పార్టీలో ముఖ్య నేతల వద్ద ప్రాపకం సంపాదించి ప్రత్యేకంగా వర్గం ఏర్పాటు చేసుకుని పోటీగా ఉన్న వారిపై పైచేయి సాధించడానికి వివాదాల్లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు. వివాదాస్పద వీడియోలు వెలుగులోకి రావడానికి కూడా వైసీపీ నేతల అంతర్గత పోరాటమేనని చెబుతున్నారు.

ప్రస్తుతానికి వైసీపీ హైకమండ్ తాము ఏం చేయాలనుకుంటున్నామో అదే చేస్తున్నారు. పరిస్థితుల్ని అర్థం చేసుకుని.. దానికి తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోవడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కూటమిదే విజయమని వైసీపీ అభ్యర్థుల బెట్టింగులు..!!

స్వయంగా జగన్ రెడ్డి గతంలో కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని ప్రకటించినా వైసీపీలో ఆ ధీమా ఏమాత్రం కనిపించడం లేదు. ఇప్పటికే బెట్టింగ్ రాయుళ్లు కూటమిదే అధికారమని లక్షల్లో బెట్టింగ్ కాస్తుండగా...వైసీపీ తరఫున...

ఓట్లు ఎలా వస్తాయో అలానే మోదీ ప్రచారం !

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలి కాలంలో మతప రమైన అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ వస్తే రామ మందిరాన్ని బుల్డోజర్లతో కూల్చేస్తుందని ప్రచారం చేస్తున్నారు. మోదీ...

మళ్లీ అదే నినాదం ఎత్తుకున్న మోడీ – ఏంటి సీక్రెట్ ..?

కొద్ది రోజులుగా కాంగ్రెస్ పై ఎదురుదాడి చేయడానికి ప్రాధాన్యత ఇచ్చిన ప్రధాని తాజాగా మరోసారి 400సీట్లు అంశాన్ని తెరపైకి తీసుకురావడం ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల్లో బీజేపీ గతం కన్నా ఎక్కువగా సీట్లు...

ఆ విషయంలో మంత్రులు ఫెయిల్..!?

కాంగ్రెస్ సర్కార్ టార్గెట్ గా ప్రతిపక్ష నేతలు దుమ్మెత్తిపోస్తున్నా ఒకరిద్దరూ మంత్రులు మినహా మిగతా వారెవరూ పెద్దగా స్పందించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. వీటన్నింటికి రేవంత్ ఒక్కడే కౌంటర్ ఇస్తున్నారు తప్పితే మంత్రివర్గం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close