విక్ర‌మ్ మ‌ళ్లీ అదే త‌ప్పు చేస్తున్నాడా?

ద‌క్షిణాదిలో ఉన్న అత్యంత ప్ర‌తిభావంతులైన న‌టుల జాబితాలో విక్ర‌మ్‌కి స్థానం ఉంటుంది. ఈత‌రం హీరోల్లో విక్ర‌మ్ చేసిన‌న్ని ప్ర‌యోగాలు ఎవరూ చేయ‌లేదు. విక్ర‌మ్ వేసిన‌న్ని గెట‌ప్పులూ ఎవ‌రూ వేయ‌లేదు. అప‌రిచితుడు త‌న‌ని స్టార్‌గా మార్చేసింది. అయితే.. ఆ త‌ర‌వాత హిట్టు కొట్ట‌డానికి ఆప‌సోపాలు ప‌డుతూ వ‌చ్చాడు విక్ర‌మ్. గ‌త ప‌దేళ్ల‌లో విక్ర‌మ్ నుంచి ఒక్క సాలీడ్ హిట్ కూడా ప‌డ‌లేదు. కథ కంటే గెట‌ప్పుల్నే ఎక్కువ న‌మ్ముకోవ‌డం, ప్ర‌యోగాల‌లో `అతి`… ఇవ‌న్నీ విక్ర‌మ్ కెరీర్‌తో ఆడుకొన్నాయి. ప్రతి సినిమాలోనూ క‌నీసం రెండు మూడు గెట‌ప్పుల్లో క‌నిపించ‌డం సాధార‌ణ‌మైపోయింది. గెట‌ప్పుల‌పై పెట్టిన శ్ర‌ద్ధ క‌థ‌పై పెట్డడం లేద‌న్న విమ‌ర్శ‌ను ప్ర‌తీసారీ ఎదుర్కొంటూనే వ‌చ్చాడు విక్ర‌మ్‌. ఇప్పుడు త‌న నుంచి మ‌రో సినిమా వ‌స్తోంది. అదే.. `కోబ్రా`. ఇందులోనూ గెట‌ప్పుల గోలే. ఈసారి ఏడెనిమిది వేషాల్లో ద‌ర్శ‌న‌మిస్తున్నాడు విక్ర‌మ్‌. ట్రైల‌ర్ క‌ట్ చేస్తే… ఆ ట్రైల‌ర్ అంతా.. విక్ర‌మ్ వేసిన గెట‌ప్పుల్ని చూపించ‌డానికే స‌రిపోయింది.

ఆయా పాత్ర‌ల కోసం విక్ర‌మ్ చాలా క‌ష్ట‌ప‌డ‌తాడు. ఒక్కో గెట‌ప్ కోసం మేక‌ప్ కే గంట‌ల స‌మ‌యం వెచ్చిస్తాడు. పాత్ర‌కు త‌గిన‌ట్టు త‌న‌ని తాను మార్చుకొంటాడు. శ‌రీరాన్ని క‌ష్ట‌పెడ‌తాడు. ఈ విష‌యాల్లో ఎలాంటి అనుమానం లేదు. కానీ.. `అప‌రిచితుడు` త‌ర‌వాత‌.. త‌న‌కు హిట్ ఏది? ఈలోగా ఎన్ని సినిమాల్లో, ఎన్ని గెట‌ప్పులు వేసుంటాడు? అవ‌న్నీ విక్ర‌మ్‌కి కాపాడ‌లేక‌పోయాయి. ఎవ‌రైనా గెట‌ప్ వేస్తే వెరైటీ. కానీ విక్ర‌మ్ కి మాత్రం అది ప‌ర‌మ రొటీన్ వ్య‌వ‌హారం. త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల్ని విక్ర‌మ్ ఈసారీ ప‌క్క‌న పెట్ట‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. `కోబ్రా` కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాడు విక్ర‌మ్‌. కాక‌పోతే… ఆ క‌ష్టానికి త‌గిన ప్ర‌తిఫ‌లం వ‌స్తుందా, రాదా? అనేది పెద్ద డౌట్‌. ఈనెల 31న ఈ సినిమా వ‌స్తోంది. ఇది ఓర‌కంగా విక్ర‌మ్ కి డూ – ఆర్ డై సెట్యువేష‌న్‌. ఈసారి కూడా విక్ర‌మ్ కి మొండిచేయి ఎదురైతే.. ఇంకెప్పుడూ గెట‌ప్పుల జోలికి పోడేమో…? హిట్ట‌యితే గ‌నుక‌.. ఇక ప్ర‌తీసారీ ఈ విశ్వ‌రూపం త‌ప్ప‌దు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close