లిక్కర్ స్కాంలో కవిత బేలతనాన్ని బయట పెట్టించిన ఆర్కే !

కవితను బిగ్ డిబేట్‌కు ఆహ్వానించిన వేమూరి రాధాకృష్ణ.. ఆమె పై వచ్చిన ఆరోపణలను కవర్ చేస్తారేమో అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. నిజానికి కవితనే చాలెంజ్ చేసి.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్‌కు వచ్చినట్లుగా డిబేట్ జరిగింది. లిక్కర్ స్కాంలో కవిత పేరు రావడంతో కేసీఆర్ మందలించారని ఆంధ్రజ్యోతిలో వచ్చింది. దీనిపై ఆమె ఎక్కువగా ఫీలయినట్లుగా ఉన్నారు. డిబేట్ కు వచ్చిన తర్వాత ఆర్కేతో వాదనకే చాలా సమయం కేటాయించారు. అన్నింటికి ఓపికగానే ఆర్కే సమాధానాలిచ్చారు.

అయితే లిక్కర్ స్కాంకు సంబంధించి ఆర్కే వేసిన అనేక ప్రశ్నలకు కవిత వద్ద సరైన సమాధానం లేదు. కేసీఆర్‌ను టార్గెట్ చేసే తనపై లిక్కర్ స్కాం ఆరోపణలు చేస్తున్నారని కవిత అంటున్నారు. కానీ ఆ లిక్కర్ స్కాంతో అసలెలాంటి సంబంధం లేదని ఆమె ఘంటాపథంగా చెప్పలేకపోయారు. ఆరోపణలు చేయవద్దని.. కోర్టుకెళ్లి స్టే తెచ్చుకోవడంలోనే ఏదో మతలబు ఉందన్న అభిప్రాయాన్ని ఆర్కే తన ఇంటర్యూ ద్వారా పంపేశారు. దీన్ని కవర్ చేసుకోవడం కవిత వల్ల కాలేదు. ఆర్కేపై ఎదురుదాడి చేశానని కవిత అనుకున్నారు కానీ.. అసలు ఏదో విషయాన్ని బయటకు రాకుండా చూసుకున్నారన్న అభిప్రాయం మాత్రం బలపడేలా చేసుకున్నారు.

ఎక్కడో ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏ మాత్రం సంబంధం లేకుండా కవితను ఇరికిస్తారని ఎవరూ అనుకోవడం లేదు. అయితే బీజేపీ నేతల ఆరోపణల వెనుక ఖచ్చితంగా రాజకీయం ఉంది. దర్యాప్తు సంస్థల వద్ద ఉన్న సమాచారం బీజేపీ నేతలకు చేరింది. లేకపోతే బీజేపీ నేతలే దర్యాప్తు సంస్థలకు సమాచారం ఇచ్చి ఉంటారు. ఏం జరిగినా.. ఈ విషయంలో కవితకు లింక్ ఉందనే అనుమానాలు గట్టిగా ఉన్న తరుణంలో.. తనపై ఆరోపణలన్నీ తప్పని ప్రజల్లోకి గట్టిగా సందేశం పంపగలిగే డిబేట్ అవకాశం లభించిన కవి.,. ఆర్కేపై ఎదురుదాడికి దిగి కోల్పోయారు.

కొసమెరుపేమిటంటే.. ఇంత తీవ్రమైన ఆరోపణలు వచ్చినా కేసీఆర్, కేటీఆర్ కవితకు మద్దతుగా ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదనే ఓ ప్రశ్న సంధించి.. కవితలోనూ ఓ ఆందోళన ఆర్కే రేకెత్తించారు. వారు స్పందించాల్సినంత పెద్ద ఇష్యూ కాదని ఆమె కవర్ చేసుకున్నా… మనసులో ఈ ప్రశ్న చాలా ప్రశ్నలకు కారణమయ్యే చాన్స్ ఉంది. కవితతో ఆర్కే డిబేట్ సాదాసీదా ఇంటర్యూలా లేదు.. చాలా మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ క్రిమినాలిటీకి నిలువెత్తు సాక్ష్యం పిన్నెల్లి !

మనుషుల్ని అడ్డంగా నరికేసినా పర్వాలేదు... ఈవీఎంలను ధ్వంసం చేసినా తప్పు లేదు.. ఏం చేసినా సరే అధికారంలోకి రావాలన్నది వైసీపీ స్టైల్. ఈ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఉన్న చోట్ల ఎన్ని...

విజృంభించిన కొల‌కొత్తా.. ఫైన‌ల్‌లో చోటు

తొలి ఫ్లే ఆఫ్ లో హైద‌రాబాద్ నిరాశ ప‌రిచింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్.... ఇలా అన్ని రంగాల్లోనూ ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించిన కొల‌కొత్తా హైద‌రాబాద్ ని ఓడించి, ద‌ర్జాగా ఫైన‌ల్ లో ప్ర‌వేశించింది. తొలుత...

జర భద్రం… ఏపీలో హై అలర్ట్..!!

కౌంటింగ్ రోజున ఏపీలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలింగ్ రోజున చోటు చేసుకున్న ఘర్షణల నేపథ్యంలో కౌంటింగ్ రోజున ఎలాంటి అల్లర్లు జరగకుండా చర్యలు...

అల్లర్లపై సిట్ దూకుడు… వైసీపీ నేతల్లో టెన్షన్.. టెన్షన్..

ఏపీలో అల్లర్లపై సిట్ దూకుడు వైసీపీ నేతలను ఆందోళనకు గురి చేస్తోంది. అల్లర్ల విషయంలో వైసీపీ నేతలు చెప్పినట్లు కిందిస్థాయి పోలీసులు వ్యవహరించడంతోనే పరిస్థితి ప్రమాదకరంగా మారిందని సిట్ ప్రాథమిక నివేదికలో పేర్కొనడంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close