ప్ర‌భాస్‌, చ‌ర‌ణ్ కోసం శ‌ర్వా స్పెష‌ల్ షో

శ‌ర్వానంద్ కు ఇండ‌స్ట్రీ నిండా ఫ్రెండ్సే. అంద‌రితోనూ బాగుంటాడు. అంద‌రూ కావాల‌నుకుంటాడు కాబ‌ట్టి.. అంత ఫ్రెండ్ ఫాలోయింగ్‌. ముఖ్యంగా ప్ర‌భాస్‌, చ‌ర‌ణ్‌ల‌తో శ‌ర్వా చాలా క్లోజ్ గా ఉంటాడు. చ‌ర‌ణ్‌, రానా, శ‌ర్వానంద్ వీళ్లంతా ఒకే స్కూల్ లో చ‌దివారు. కాబ‌ట్టి.. మ‌రింత స్నేహం ఉంది వీళ్ల మ‌ధ్య‌. శ‌ర్వా నటించిన కొత్త సినిమా `ఒకే ఒక జీవితం`. ఈనెల 9న విడుద‌ల అవుతోంది. ఈ సినిమాపై శ‌ర్వా చాలా న‌మ్మ‌కాలు పెట్టుకొన్నాడు. అందుకే గ‌ట్టిగా ప్ర‌మోష‌న్ చేయాల‌ని భావిస్తున్నాడు. ఈ సినిమాని త‌న స్నేహితులైన ప్ర‌భాస్‌, చ‌ర‌ణ్‌, రానాల కోసం ప్ర‌త్యేకంగా ప్ర‌ద‌ర్శించ‌బోతున్నాడ‌ట‌. వాళ్ల ఫీడ్ బ్యాక్ తీసుకొని, ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో త‌న ఫ్రెండ్స్‌ని వాడుకోవాల‌ని చూస్తున్నాడు. ఇప్ప‌టికే శ‌ర్వా త‌న బాల్య స్నేహితులు కొంత‌మందికి ఈ సినిమా చూపించాడు. వాళ్లంద‌రి నుంచీ మంచి ఫీడ్ బ్యాక్ వ‌చ్చింది. ఇప్పుడు ఇండ‌స్ట్రీ ఫ్రెండ్స్ కోసం స్పెష‌ల్ షో వేయ‌బోతున్నాడు. 6,7, 8 తేదీల్లో `ఒకే ఒక జీవితం` స్పెష‌ల్ ప్రీమియ‌ర్స్ ప్లాన్ చేస్తున్నాడు. హైద‌రాబాద్ తో పాటు మిగిలిన ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఈ సినిమాని ప్ర‌త్యేకంగా ప్ర‌ద‌ర్శించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. ఈవారం సినిమాల హ‌డావుడి బాగానే ఉంది. నేను మీకు బాగా కావ‌ల్సిన‌వాడిని, కెప్టెన్‌, బ్ర‌హ్మాస్త్రం చిత్రాలు ఈ వార‌మే విడుద‌ల అవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఐ ప్యాక్ బృందానికి జగన్ రెడ్డి వీడ్కోలు..?

ఏపీ ఎన్నికల్లో అధికార వైసీపీకి సేవలందించిన ఐ ప్యాక్ కార్యాలయానికి జగన్ రెడ్డి ఎన్నికలు ముగిసిన రెండు రోజుల తర్వాత వెళ్తుండటం చర్చనీయాంశం అవుతోంది. వాస్తవానికి పోలింగ్ ముగిసిన తర్వాత ఐ ప్యాక్...

దిల్ రాజు సినిమా మ‌ళ్లీ వాయిదా?

దిల్ రాజు బ్యాన‌ర్‌లో ర‌కూపొందించిన‌ 'ల‌వ్ మీ' మ‌ళ్లీ వాయిదా ప‌డే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. ఎన్నిక‌ల హ‌డావుడి వ‌ల్ల ఈనెల 25కు వాయిదా...

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close