మీడియాలను బ్యాన్ చేసుకుంటున్న పార్టీలు!

రాజకీయపార్టీలు మీడియాలను బ్యాన్ చేసుకుంటున్నాయి. మా ప్రెస్‌మీట్లలో ఉండొద్దని మొహం మీదే చెప్పి పంపిచేస్తున్న సందర్భాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ కోసం అందరూ వచ్చారు. వారితో పాటు టీ న్యూస్, నమస్తే తెలంగాణ వారు కూడా వచ్చారు. అయితే ప్రెస్ మీట్ ప్రారంభానికి ఐదు నిమిషాల ముందు బీజేపీ నేతలు వచ్చి ఆరెండు మీడియా రిపోర్టర్లను బయటకు పంపేశారు. ఓ రకంగా గెంటేశారని అనుకోవచ్చు. అంటే ఆ మీడియాను తెలంగాణ బీజేపీ బ్యాన్ చేసింందనుకోవచ్చు.

నమస్తే తెలంగాణ, టీ న్యూస్ టీఆర్ఎస్ పార్టీ సొంతానివి. అవి వారి రాజకీయ ప్రయోజనాల కోసమే పని చేస్తాయి. బీజేపీకి సానుకూలంగా అసలు రాయనే రాయవు. అలాగే ఏపీలోని సాక్షి కూడా అంతే. అయతే.. ఏపీలో ఎన్డీవీ, టీవీ నైన్ కూడా సాక్షి మాదిరే అధికార పక్షాన్ని మోస్తూ.. ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తూ ప్రసారాలు చేస్తున్నాయి. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు నేరుగా కులం పేర్లు పెట్టి చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ విషయంపై క్లారిటీ ఉండటంతో.. టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆ రెండు మీడియాలను బ్యాన్ చేయాలని పిలుపునిచ్చారు. చేస్తారో లేదో తర్వాత సంగతి కానీ.. అవి రెండు పూర్తి బయాస్ న్యూస్ ఇస్తున్నాయన్న సందేశాన్ని మాత్రం ప్రజల్లోకి పంపినట్లయింది.

ఇక ఏపీ అధికార పార్టీ కూడా ఎప్పుడో సాక్షి మినహా మిగిలిన మీడియాను నిషేధించింది. జగన్ ఎప్పుడూ చెప్పే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లకు అసలు అధికారిక కార్యక్రమాల్లోకి కూడా ఎంట్రీ ఉండదు. విచిత్రంగా ఇప్పుడు ఎన్టీవీ, టీవీ9లకు కూడా అవసరమనుకుంటే తప్ప రానివ్వడం లేదు. ఐ అండ్ పీఆర్ ఇచ్చేదే ఫీడ్. ఇలా మీడియాలను రాజకీయ పార్టీలు బ్యాన్ చేసుకుంటున్నాయి. తర్వాత వచ్చేపార్టీలు కూడా అదే ఫాలోఅవుతాయి. అంటే మీడియాలను అనుకూలం.. వ్యతిరేకంగా వర్గీకరించుకుని రాజకీయ పార్టీలు రాజకీయాలు చేసేస్తున్నాయన్నమాట.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close