హిందీ ‘ఛ‌త్ర‌ప‌తి’.. ఆగ‌లేదు.. అయిపోయింది!

రాజ‌మౌళి ‘ఛ‌త్ర‌ప‌తి’ ప్ర‌భాస్ కెరీర్‌లో ఓ మైల్ స్టోన్‌. ఇప్పుడు ఇదే క‌థ‌తో బెల్లంకొండ శ్రీ‌నివాస్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌కుడు. చాలా కాలం క్రింద‌టే ఈ సినిమా మొద‌లైంది. అయితే ఎలాంటి అప్ డేటూ లేదు. దాంతో ఈ సినిమా ఆగిపోయింద‌ని ప్ర‌చారం మొద‌లైంది. ఈ రీమేక్ సంతృప్తిక‌రంగా రాలేద‌ని, చాలాసార్లు రీషూట్లు చేశార‌ని, అయినా ఫ‌లితం క‌నిపించ‌క‌పోవ‌డంతో ప‌క్క‌న పెట్టార‌ని గాసిప్పులు వ‌స్తున్నాయి. దీనిపై చిత్ర బృందం తో తెలుగు 360 ట‌చ్‌లోకి వెళ్లింది. ”అస‌లు ఈ సినిమా ఆగిపోయింది అనే వార్తలో ఎలాంటి నిజం లేదు. సినిమా షూటింగ్ ఎప్ప‌డో పూర్త‌యింది. ఫ‌స్ట్ లుక్ కూడా రెడీ చేస్తున్నాం. కొంత‌మంది బాలీవుడ్ ప్ర‌ముఖుల‌కూ ఈ సినిమా చూపించాం. వాళ్లంతా పూర్తి సంతృప్తిని వ్య‌క్తం చేశార‌”ని చెప్పుకొచ్చారు.

ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌కు ఒక‌టే ఒక స‌మ‌స్య ఉంది. ఈ సినిమా టైటిల్ ఇంకా ఖ‌రారు కాలేదు. ‘ఛ‌త్ర‌పతి’ అంటూ ఒరిజిన‌ల్ టైటిలే ఫిక్స్ చేద్దామ‌నే ఆలోచ‌న ఉంది. అయితే ఈ టైటిల్ బాలీవుడ్ లో ఇప్ప‌టికే రిజిస్ట‌ర్ అయి ఉంది. అందుకే మ‌రో టైటిట్ కోసం అన్వేషిస్తున్నారు. ఆ టైటిల్ ఖ‌రారు కాగానే.. టైటిల్ లోగోతో పాటుగా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం భావిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఐ అంజూ యాదవ్‌నూ సాగనంపారు !

తిరుపతిలో అత్యంత వివాదాస్పదమైన మహిళా సీఐ అంజూ యాదవ్ ను కూడా ఈసీ సాగనంపింది. పోలింగ్ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో ఉండకూదని ఆర్థరాత్రే బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు...

అల్లు అర్జున్ టూర్ : నంద్యాల ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై ఈసీ చార్జ్‌షీట్

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులపై కూడా కేసులు నమోదయ్యేలా చేసింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు పోలీసులు అనుమతి తీసుకోలేదు. మామూలుగా అయితే పెద్దగా మ్యాటర్ కాదు....

వారణాశిలో మోడీ నామినేషన్‌కు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును వారణాశిలో తన నామినేషన్ కు రావాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానించారు. మంగళవారం ప్రధాని మోద ీనామినేషన్ వేయనున్నారు. వారణాశిలో ఎన్నికలు చివరి విడతలో జరగున్నాయి. పదమూడో తేదీన...

మిత్రుడు దంతులూరి కృష్ణ కూడా జగన్‌కు వ్యతిరేకమే !

జగన్మోహన్ రెడ్డికి అధికారం అందిన తర్వాత ఆ అధికారం నెత్తికెక్కడంతో దూరం చేసుకున్న వారిలో తల్లి, చెల్లి మాత్రమే కాదు స్నేహితులు కూడా ఉన్నారు. చిన్న తనం నుంచి అంటే 35...

HOT NEWS

css.php
[X] Close
[X] Close