‘జనగణమన;.. ఆ సీన్లు వేస్టేనా..?

అన్నీ బాగుంటే ఈపాటికి.. ‘జ‌న‌గ‌ణ‌మ‌న‌’ కొత్త షెడ్యూల్ మొద‌లైపోయేది. విజ‌య్ దేవ‌ర‌కొండ – పూరి జ‌గ‌న్నాథ్… ముంబైలో ‘జ‌న‌గ‌ణ‌మ‌న‌’ షూటింగ్ లో బిజీగా ఉండేవారు. కానీ.. వీళ్ల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ‘లైగ‌ర్‌’ డిజాస్ట‌ర్ అవ్వ‌డంతో ఆ ఎఫెక్ట్ ‘జ‌న‌గ‌ణ‌మ‌న‌’పై ప‌డింది. ఈ సినిమా ఇక సెట్స్‌పై వెళ్లే అవ‌కాశం దాదాపుగా లేన‌ట్టే. అయితే.. ‘లైగ‌ర్‌’పై న‌మ్మ‌కంతో ‘జ‌న‌గ‌ణ‌మ‌న‌’ ఓ షెడ్యూల్ పూర్తి చేశారు. 12 రోజుల పాటు విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై యాక్ష‌న్ సీన్ల‌నీ, హీరోయిన్ పూజా హెగ్డే ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ల‌ని తెర‌కెక్కించారు. అందుకోసం దాదాపుగా 5 కోట్ల వ‌ర‌కూ ఖ‌ర్చ‌యిన‌ట్టు తెలుస్తోంది. అయితే.. ఇప్పుడు ఆ సీన్ల‌న్నీ చెత్త బుట్ట‌లో వేసేయాల్సిందేనా..? అనే ప్ర‌శ్న త‌లెత్త‌క మాన‌దు.

కాక‌పోతే.. పూరి ఇక్క‌డ తెలివిగా చేసిందేంటంటే… విజ‌య్ యాక్ష‌న్ సీన్, పూజా హెగ్డే ఇంట్ర‌డక్ష‌న్ వేర్వేరుగా షూట్ చేశాడు. విజ‌య్ మ‌రో సినిమా చేసుకుంటే.. ఈ యాక్ష‌న్ సీన్ల‌ను యాడ్ చేసుకోవొచ్చు. పూజాతో ఏ సినిమా చేసినా.. ఆ ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ల‌ని వాడుకోవొచ్చు. ఏ క‌మర్షియ‌ల్ సినిమాలో అయినా హీరో ఎంట్రీ ఫైట్ సీన్ తో అయితే ఒకే టెంపోలో సాగుతుంది. హీరోయిన్ ని కూడా బ్యూటీఫుల్ మాంటేజ్‌ల‌లో చూపిస్తుంటారు. ‘జ‌న‌గ‌ణ‌మ‌న‌’లో డైలాగులేం లేకుండా.. ఓ ఫైట్‌, హీరోయిన్ ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్లు తీశాడు పూరి. త‌నెప్పుడైనా విజయ్‌తో గానీ, పూజా తో గానీ సినిమా చేస్తే ఆయా సన్నివేశాలు ప‌నికొస్తాయ‌ట‌. కాబ‌ట్టి.. వేస్టేజీ ఏమీ లేద‌న్న‌ది ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్ ను కలిసిన రోహిత్ వేముల తల్లి..కేసు రీఓపెన్ కు హామీ

హెచ్ సీ యూ విద్యార్ధి రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, ఈ కేసును ఇంతటితో మూసివేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించడంతో తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు రోహిత్...

అనంత శ్రీ‌రామ్ పై బాల‌య్య ఫ్యాన్స్ ఫైర్‌

టాలీవుడ్ లో పేరున్న గీత ర‌చ‌యిత‌... అనంత శ్రీ‌రామ్‌. ఇప్పుడు ఈయ‌న‌కు కూడా రాజ‌కీయం బాగానే వంటబ‌ట్టింద‌నిపిస్తోంది. అప్పుడ‌ప్పుడూ కొన్ని పొలిటిక‌ల్ సెటైర్ల‌తో క‌వ్వించ‌డం అనంత శ్రీ‌రామ్‌కు అల‌వాటే. తాజాగా ఆయ‌న చేసిన...

య‌శ్ స‌ర‌స‌న న‌య‌న‌తార‌

'కేజీఎఫ్`తో య‌శ్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. 'కేజీఎఫ్‌' త‌ర‌వాత య‌శ్ ఎలాంటి సినిమా చేయ‌బోతున్నాడా? అని దేశ‌మంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. ఈ నేప‌థ్యంలో గీతు మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డానికి...

శింగనమల రివ్యూ : కాంగ్రెస్ రేసులో ఉన్న ఒకే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం !

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రేసులో ఉందని చెప్పుకుంటున్న ఒకే ఒక్క నియోజకవర్గం శింగనమల. మాజీ మంత్రి శైలజానాథ్ గతంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close