ప్ర‌భాస్ కి ఓ పాన్ ఇండియా టైటిల్ కావ‌లెను!

ప్ర‌భాస్ – మారుతి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. చాలా కాలంగా మారుతి ఈ స్క్రిప్టుతోనే కుస్తీ ప‌డుతున్నాడు. ఎట్ట‌కేల‌కు స్క్రిప్టు ఫైన‌ల్ స్టేజీకి చేరుకొంది. స్క్రిప్టు పూర్తి సంతృప్తిక‌రంగా వ‌చ్చింద‌ని టాక్‌. ఇప్పుడు త‌న దృష్టి టైటిల్ పై ప‌డింది. `రాజా డీలెక్స్‌` అనే పేరు బ‌య‌ట‌కు వ‌చ్చినా… అది టైటిల్ కాదు. ఇంకో ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్ కోసం మారుతి అన్వేషిస్తున్నాడు. నాలుగైదు టైటిళ్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. అయితే ఇది పాన్ ఇండియా సినిమా కాబ‌ట్టి.. టైటిల్ యూనివ‌ర్స‌ల్ గా ఉండాలి. అన్నిభాష‌ల్లోనూ ఒకే టైటిల్ తో సినిమా విడుద‌ల చేయాలి. అందుకే అంద‌రికీ అర్థ‌మ‌య్యే టైటిల్ కోసం చూస్తున్నాడు మారుతి. ఇదో థియేట‌ర్ నేప‌థ్యంలో సాగే క‌థ‌. హార‌ర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. బొమ‌న్ ఇరానీని ఓ కీల‌క పాత్ర కోసం ఎంచుకొన్న‌ట్టు స‌మాచారం. తాత‌ల నాటి ఆస్తి కోసం హీరో చేసే ప్ర‌య‌త్నాల నేప‌థ్యంలో క‌థ సాగుతుంది. న‌వంబ‌రు నుంచి ఈ సినిమా కోసం ప్ర‌భాస్ డేట్లు కేటాయించాడ‌ని తెలుస్తోంది. ఈలోగా క‌థ‌ని పూర్తి స్థాయిలో సిద్ధం చేసి, ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్ని పూర్తి చేయ‌నున్నాడు మారుతి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close