వైసీపీ నేత విడదల రజనీ వైసీపీ ఆఫీసులో ప్రెస్మీట్ పెట్టి వైసీపీని గొడ్డలి పార్టీ అని ఎందుకంటున్నారని అసహనంతో కూడిన ఆవేదనతో వచ్చిన ఓ రకమైన గద్గగ స్వరంతో మీడియా ముందు టీడీపీని అడిగారు. దీనికి కారణం చంద్రబాబు, లోకేష్ సహా టీడీపీ నేతలంతా తరచూ గొడ్డలి పార్టీ అని విమర్శలు చేస్తున్నారు. అవి ప్రజల్లోకి వెళ్తున్నాయి. తమ సొంత వాళ్లను దారుణంగా చంపి.. వారిని ఏమీ తెలియనట్లుగా పరామర్శించి.. ఆ నిందను టీడీపీపై వేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే గొడ్డలి పార్టీ అంటూ ఉంటారు. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ ఆమె ఆ ప్రెస్మీట్ లో ఏమీ తెలియనట్లుగా ఆవేదనపూర్వకంగా మాట్లాడారు.
విడదల రజని ప్రెస్ మీట్ పెట్టిన తీరు , అప్పుడెప్పుడో జరిగిన బాబాయ్ హత్యోదంతం.. అందులో వాడిన ఆయుధం గురించి ఆమెకు అసలు తెలియనట్లుగా ఉంది. గద్గద స్వరంతో, కళ్లలో నీళ్లు తిరుగుతున్నట్లుగా నటిస్తూ.. మమ్మల్ని గొడ్డలి పార్టీ అని ఎందుకు అంటున్నారు అని ఆమె అడిగిన ప్రశ్న వింటుంటే, పక్కన ఉన్న విలేకరులు కూడా ఆశ్చర్యంతో చూస్తూండిపోయారు. గత ఐదేళ్లుగా రాష్ట్రమంతా మార్మోగుతున్న ఆ గొడ్డలి కథ ఆమెకు మాత్రం కొత్తగా అనిపించింది.
చంద్రబాబు, లోకేష్ సహా టీడీపీ నేతలంతా వైసీపీని టార్గెట్ చేస్తూ గొడ్డలి పార్టీ అని పిలవడం ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయింది. సొంత చిన్నాన్ననే దారుణంగా చంపి, ఆ నిందను ఇతరులపైకి నెట్టేసి, ఏమీ తెలియనట్లు పరామర్శించే రాజకీయ చతురత గురించి రజని ఇప్పుడు అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. అయినా గొడ్డలికి, మాకు సంబంధం ఏంటి అన్నట్లు ఆమె ఇచ్చిన బిల్డప్ చూసి నెటిజన్లు, స్క్రిప్ట్ బాగానే ఉంది కానీ, సీన్ పండలేదు అంటూ ట్రోల్ చేస్తున్నారు.
రాష్ట్ర ప్రజలందరికీ గొడ్డలి పార్టీ అనే పేరు ఎందుకు వచ్చిందో స్పష్టంగా తెలుసు. రాజకీయ హత్యలు, రక్త చరిత్ర నేపథ్యంలో వచ్చిన ఆ ముద్రను చెరిపేసుకోలేక, ఇలా ప్రెస్ మీట్లలో ఆవేదన ప్రదర్శించి సానుభూతి పొందాలని చూడటం హాస్యాస్పదంగా ఉందని భావిస్తున్నారు. తప్పు చేసినప్పుడు లేదా అపవాదు వచ్చినప్పుడు మౌనంగా ఉండటం లేదా నిజం చెప్పడం కంటే.. ఇలా ఏమీ తెలియనట్లు ఆవేదన నటించడం రాజకీయాల్లో రివర్స్ అవుతుందని విడదల రజని నిరూపిస్తున్నారు.


