ఆ లెక్కన కేసీఆర్ కూడా ” యాంటీ వైసీపీ గ్యాంగ్‌’లో చేరినట్లేనా సజ్జల !?

తెలంగాణ మంత్రులు వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని.. జగన్ పరిపాలనను అవకాశం దొరికిన ప్రతీ చోటా..ఇంకా చెప్పాలంటే అవకాశం సృష్టించుకుని మరీ విమర్శలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కూడా నేరుగా ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. హరీష్ రావు , ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్, కేటీఆర్ లాంటి వాళ్లు తరచూ అదే పనిగా విమర్శలు చేస్తున్నారు. అయితే సజ్జల మాత్రం .. టీఆర్ఎస్‌తో తమకు ఎలాంటి సమస్యలు లేవని.. తమపై విమర్శలు చేసిన హరీష్‌కు వ్యక్తిగత సమస్యలు ఏమైనా ఉన్నాయేమో తెలియదని చెప్పుకొచ్చారు.
ఓ గ్యాంగ్ చాలా కాలం నుంచి చెబుతున్న దాన్నే హరీష్ రావు చెబుతున్నారని  ఆ గ్యాంగ్ తో జతకట్టి హరీష్ రావు  మాట్లాడినట్టుగా అనిపిస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానం వ్యక్తంచేశారు.  టీఆర్ఎస్ పార్టీగా తమపై విమర్శలు చేయలేదన్నారు.  తెలంగాణలో  సమస్యలు చూసుకోకుండా ఏపీ పై కామెంట్ చేయడం సరైంది కాదని సలహా ఇచ్చారు. ది రెండు రాష్ట్రాల మధ్య అంశం కాదని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. నిజానికి హరీష్ రావును సజ్జల టార్గెట్ చేశారు కానీ..  ఏపీ ప్రభుత్వాన్ని దాదాపుగా ప్రతి టీఆర్ఎస్ నేత విమర్శిస్తున్నారు. కేటీఆర్ .. ఏపీలో జీవనంనరకం అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటాయి.
ఇక మంత్రి ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్…ఏపీ ప్రబుత్వం అడుక్కుని తింటోందంటూ చేసిన వ్యాఖ్యలు కలకలంరేపాయి. సీఎం కేసీఆర్ కూడా ఉచిత విద్యుత్ అంశంపై ఏపీ ప్రబుత్వం ఆరువేల కోట్లకు ఆశపడి.. రైతుల మెడకు ఉరేసిందని విమర్శించారు కూడా.  అయితే ఇవన్నీ సజ్జల పట్టించుకోలేదు. ఒక్క హరీష్ రావును టార్గెట్ చేసి విమర్శలు చేసి.. టీఆర్ఎస్‌తో అంతా బాగుందని చెప్పుకొచ్చారు. కేసీఆర్ జాతీయ పార్టీపై తమనేమీ అడగలేదని.. తమకేమీ సంబంధం లేదని.. తమకు ఏపీ మాత్రమే ముఖ్యమని సజ్జల చెప్పుకొచ్చారు. ఎవరితోనూ పొత్తులు పెట్టుకునేది లేదన్నారు.
మొత్తంగా సజ్జల టీఆర్ఎస్ వైపు నుంచి పెరుగుతున్న దాడితో ఒత్తిడికి గురవుతున్నారు. టీఆర్ఎస్ వ్యూహం ఎలా మారుతోందని ఆయన కూడా అంచనా వేయలేకపోతున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే తమ ప్రభుత్వాన్ని విమర్శించిన వారందర్నీ టీడీపీ ఖాతాలోవేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అలా అయితే.. మొత్తం టీఆర్ఎస్ యాంటీ వైసీపీ గ్యాంగ్‌లో చేరిటన్లవుతుందనే లాజిక్‌ను సజ్జల మర్చిపోతున్నారు

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close