ఫిల్మ్ ఛాంబ‌ర్‌లోనే.. ‘మా’ బిల్డింగ్ : మంచు విష్ణు

‘మా బిల్డింగ్ నేనే క‌ట్టిస్తా’ అనే ప్ర‌తిపాద‌న‌తోనే ‘మా’ అధ్య‌క్షుడు అయ్యాడు మంచు విష్ణు. ఆయ‌న ‘మా’ అధ్య‌క్షుడిగా ఎన్నికై.. యేడాది అయ్యింది. ఈ సంద‌ర్భంగా ‘మా’ బిల్డింగ్‌పై ఓ కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకొన్నారు. హైద‌రాబాద్ లోని ఫిల్మ్ ఛాంబ‌ర్ ని త్వ‌ర‌లో రీ మోడ‌లింగ్ చేయ‌బోతున్నారు. ప్ర‌స్తుతం ఉన్న పాత భ‌వ‌నాన్ని తొల‌గించి.. కొత్త బిల్డింగ్ నిర్మించ‌న్నారు. అందులోనే ‘మా’ బిల్డింగ్ కి స్పేస్ తీసుకొంటాన‌ని, అందుకోసం ఎంత ఖ‌ర్చ‌యినా తానే భ‌రిస్తాన‌ని `మా` స‌భ్యుల‌కు మాటిచ్చాడు విష్ణు. ”మా బిల్డింగ్ విష‌యంలో నా ద‌గ్గ‌ర రెండు ప్ర‌తిపాద‌న‌లు ఉన్నాయి. ఇప్పుడున్న ఫిల్మ్ ఛాంబ‌ర్‌కి 30 నిమిషాల ప్ర‌యాణం చేస్తే.. ఓ స్థ‌లం ఉంది. అక్క‌డ బిల్డింగ్ ఏర్పాటు చేయ‌డానికి ఓ ఆరు నెల‌ల స‌మ‌యం ప‌డుతుంది. రెండో ఆప్ష‌న్ కూడా ఉంది. ఇప్పుడున్న ఫిల్మ్ ఛాంబ‌ర్‌ని ప‌డ‌గొట్టి.. కొత్త‌గా ఓ బిల్డింగ్ నిర్మించ‌నున్నారు. అక్క‌డ `మా` కోసం కొంత స్పేస్ నా డ‌బ్బుల‌తో కొంటా. ఈ రెండు ప్ర‌తిపాద‌న‌ల్ని మా స‌భ్యుల ముందు ఉంచితే… రెండో దానికే అంతా ఓటేశారు. కాక‌పోతే… ‘మా’ కొత్త ఛాంబ‌ర్ రావ‌డానికి క‌నీసం మూడు నాలుగేళ్ల స‌మ‌యం ప‌డుతుంది” అని చెప్పుకొచ్చాడు విష్ణు.

ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆవ‌ర‌ణ‌లో.. ఇప్ప‌టికీ ‘మా’కు కొంత స్పేస్ ఉంది. అది చిన్న ఆఫీస్ అంతే. అది స‌రిపోవ‌డం లేద‌నే.. ‘మా’ కోసం ఓ బిల్డింగ్ కావాల‌ని అంతా ప‌ట్టుప‌ట్టారు. అదే ఛాంబ‌ర్ ని కొత్త‌గా నిర్మిస్తే… ఓ ఫ్లోరు మొత్తం.. ‘మా’ కోసం తీసుకోవాల‌న్న‌ది విష్ణు ఆలోచ‌న‌. మ‌రి..`మా` కోసం స్పేస్ అమ్మ‌డానికి ఛాంబ‌ర్ ఒప్పుకొంటుందా? అనేది ఇంకో పెద్ద డిబేటు. బిల్డింగ్ మొత్తం త‌న సొంత డ‌బ్బుతో క‌ట్టిస్తా అంటే.. అప్పుడు ఛాంబ‌ర్ ఒప్పుకోవొచ్చు. దానికి క‌నీసం రూ.2 నుంచి 3 కోట్ల రూపాయ‌లైనా ఖ‌ర్చువుతుంది. కాక‌పోతే. ఇది మూడేళ్ల త‌ర‌వాతి మాట‌. అప్ప‌టిలోగా ఇంకెన్ని రాజ‌కీయాలు జ‌రుగుతాయో..? ఇంకెన్ని మార్పులూ చేర్పులూ వ‌స్తాయో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

మోనిఫెస్టో మోసాలు : కొత్తది సరే పాతదాంట్లో ఎగ్గొట్టిన వాటికి సమాధానం చెప్పాలి కదా !

వైసీపీ చీఫ్ జగన్ కొత్త మేనిఫెస్టో విడుదల చేశారు. పాత దాంట్లో అమలు చేయనివి తీసేసి కొత్తగా ప్రింట్ చేసి ఇచ్చారు. కాస్త డబ్బులు ఎక్కువ ఇస్తానని ఆశ పెట్టే ప్రయత్నం...

పిఠాపురంలో పవన్‌పై పుకార్ల కుట్రలు !

పవన్ కల్యాణ్ గెలిస్తే అసెంబ్లీలో అడుగుపెడితే తాము చూస్తూ బతకలేమని చస్తూ బతకాలని అనుకుంటున్నారేమో కానీ వైసీపీ నేతలు ప్రతి అడ్డమైన వ్యూహాన్ని పాటిస్తున్నారు. రాత్రికి రాత్రి పిఠాపురం వర్మ వైసీపీలోకి...

ఆర్కే పలుకు : జగన్‌ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కూ ఉంది !

జగన్ ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కు ఉందా ?. ముందు తెలంగాణలో పార్లమెంట్ సీట్లను గెలిపించుకోవాల్సిన అవసరం మాత్రం రేవంత్ కు ఉంది. అందుకే ఆయన కిందా మీదా పడుతున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close