కృష్ణ మెమోరియ‌ల్‌…మాటిచ్చిన కేసీఆర్‌, జ‌గ‌న్‌

సూప‌ర్ స్టార్ కృష్ణ అంత్య‌క్రియ‌లు హైద‌రాబాద్ లోని మ‌హాప్ర‌స్థానంలో అని తెలిసిన ద‌గ్గ‌ర్నుంచి అంద‌రి నోటా… ఒక‌టే చ‌ర్చ‌.. కృష్ణ మెమోరియ‌ల్ ఎక్క‌డ ఏర్పాటు చేస్తార‌ని? సాధార‌ణంగా సినీ తార‌లు చ‌నిపోయిన‌ప్పుడు వాళ్ల అంతిమ సంస్కారాల‌న్ని ప్రైవేటు ఫామ్ హౌస్‌ల‌లో నిర్వ‌హిస్తుంటారు. ఎందుకంటే… ఆ స‌మాధి చుట్టుప‌క్క‌ల ప్రాంతం ఓ జ్ఞాప‌కంగా మిగిలిపోవాల‌ని. కానీ.. కృష్ణ అంత్య క్రియ‌లు మాత్రం మ‌హాప్ర‌స్థానంలో జ‌రిగిపోయాయి. దాంతో.. కృష్ణ స్మార‌క చిహ్నం ఉంటుందా, లేదా? అనే అనుమానాలు త‌లెత్తాయి. అయితే వీటికి సంబంధించిన ఏర్పాట్లు, వాటి ప్ర‌ణాళిక‌ల‌పై.. కృష్ణ కుటుంబం ఇప్ప‌టికే ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేసిన‌ట్టు టాక్‌. హైద‌రాబాద్ లోని ప‌ద్మాల‌యా స్టూడియోస్‌లో.. కృష్ణ స్మార‌క చిహ్నం ఏర్పాటు చేయాల‌న్న ఆలోచ‌న ఉంది. మ‌రోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌లు కూడా… త‌మ వంతు సాయం చేస్తామ‌ని మాట ఇచ్చార‌ట‌. ఈ విష‌యాన్ని కృష్ణ సోద‌రుడు ఆది శేష‌గిరిరావు ప్ర‌స్తావించ‌డం విశేషం. కృష్ణ‌ను ఏపీ, తెలంగాణ అంటూ వేరు చేయ‌లేం. తెలుగువారి అభిమాన పాత్రుడు కృష్ణ‌. అందుకే రెండు ప్ర‌భుత్వాలూ స‌రైన రీతిలో గౌర‌వించాల‌ని భావిస్తున్నాయి. తెలంగాణ‌లో కృష్ణ స్మార‌క చిహ్నం ఏర్పాటుకు కొంత భూమి ఇచ్చే అవ‌కాశం ఉంది. ఏపీ వ‌ర‌కూ వ‌స్తే.. కృష్ణ స్వ‌గ్రామం బుర్రిపాలెంలో ప్ర‌భుత్వం స్థ‌లం కేటాయించే అవ‌కాశం ఉంది. రెండు చోట్లా.. సూప‌ర్ స్టార్ కు గుర్తుగా స్మారక చిహ్నాలు ఏర్పాటు చేసే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. రెండు చోట్లా.. కృష్ణ కాంస్య విగ్ర‌హాల్ని, లేదా మైన‌పు విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టించేలా ఆలోచిస్తున్నామ‌ని ఆదిశేష‌గిరిరావు తెలిపారు. అంతేకాదు.. ఓ ఛారిట‌బుల్ ట్ర‌స్ట్ ఏర్పాటు చేసి, దాని ద్వారా సేవా కార్య‌క్ర‌మాలు జ‌ర‌పాల‌ని, అందుకోసం ఓ నిధిని ఏర్పాటు చేసే ఆలోచ‌న‌లో కూడా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఐ అంజూ యాదవ్‌నూ సాగనంపారు !

తిరుపతిలో అత్యంత వివాదాస్పదమైన మహిళా సీఐ అంజూ యాదవ్ ను కూడా ఈసీ సాగనంపింది. పోలింగ్ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో ఉండకూదని ఆర్థరాత్రే బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు...

అల్లు అర్జున్ టూర్ : నంద్యాల ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై ఈసీ చార్జ్‌షీట్

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులపై కూడా కేసులు నమోదయ్యేలా చేసింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు పోలీసులు అనుమతి తీసుకోలేదు. మామూలుగా అయితే పెద్దగా మ్యాటర్ కాదు....

వారణాశిలో మోడీ నామినేషన్‌కు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును వారణాశిలో తన నామినేషన్ కు రావాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానించారు. మంగళవారం ప్రధాని మోద ీనామినేషన్ వేయనున్నారు. వారణాశిలో ఎన్నికలు చివరి విడతలో జరగున్నాయి. పదమూడో తేదీన...

మిత్రుడు దంతులూరి కృష్ణ కూడా జగన్‌కు వ్యతిరేకమే !

జగన్మోహన్ రెడ్డికి అధికారం అందిన తర్వాత ఆ అధికారం నెత్తికెక్కడంతో దూరం చేసుకున్న వారిలో తల్లి, చెల్లి మాత్రమే కాదు స్నేహితులు కూడా ఉన్నారు. చిన్న తనం నుంచి అంటే 35...

HOT NEWS

css.php
[X] Close
[X] Close