రివ్యూ : మీట్ క్యూట్ ( వెబ్ సిరిస్)

నాని మంచి అభిరుచి గల నిర్మాత. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై అ, హిట్ లాంటి వైవిధ్యమైన చిత్రాలని నిర్మించారు. ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టారు. నాని వాల్ పోస్టర్ సినిమాపై ‘మీట్ క్యూట్’ ఎంథాలజీ రూపొందింది. నాని సోదరి దీప్తి గంటా ఈ సిరిస్ తో దర్శకురాలిగా పరిచయమైయింది. సోనీ లీవ్ లో విడుదలైన మీట్ క్యూట్ లో మొత్తం ఐదు కథలు వున్నాయి. ఈ కథలని రాసింది కూడా దీప్తినే. ఈ ఐదు కథలు ప్రేక్షకులు ఎలాంటి అనుభూతిని ఇచ్చాయి? దర్శక, రచయితగా దీప్తి ఏ మేరకు ఆకట్టుకున్నారు ?

మీట్ ది బాయ్:

స్వాతి (వర్ష బొల్లమ్మ) ఓ కంపెనీలో మేనేజర్. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. అప్పటికే పది సంబంధాలు రిజక్ట్ చేసుంటుంది స్వాతి. అభి(అశ్విన్ కుమార్) ఓ కంపెనీలో కన్సల్టెంట్. స్వాతి ప్రొఫైల్ కి తగిన విధంగా తన ప్రొఫైల్, జన్మ నక్షిత్రం మార్చుకొని స్వాతిని పెళ్లి చూపులు చూసుకోవ‌డానికి వ‌స్తాడు. ఇద్దరూ ఒక రెస్టారెంట్ లో కలుస్తారు. మాట్లాడుకుంటారు. స్వాతికి సంబంధించి ఓ క్యూట్ మీటింగ్ గురించి చెబుతాడు అభి. అది విన్న స్వాతి ఎలా రియాక్ట్ అయ్యింది? ఇంతకిముందు వీరిద్దరూ ఎక్కడ కలిశారు ? అసలు స్వాతి తన లైఫ్ పార్టనర్ నుండి ఏం కావాలి ? అనేది మీట్ ది బాయ్.

తన భాగస్వామి నుండి ప్రేమ, గౌరవం, సంతోషం కోరుకునే ఓ అమ్మాయి కథ ఇది. అయితే దీన్ని కథలా కాకుండా ఒక సంభాషణలా డీల్ చేశారు. ఇద్దరూ అలా వాళ్ళకి నచ్చినట్లు మాట్లాడుతూనే వుంటారు. వారి మధ్య పెద్ద సంఘర్షణ కూడా కనిపించదు. స్వాతి చెప్పిన మాటలనే అభి రిపీట్ చేయడంతో కథ ముగిసిపోతుంది. చాలా నిదానంగా సాగే కథ ఇది. సన్నివేశాలు కాకుండా కేవలం మాటలే వినబడుతుంటాయి. ఓ క్షణానికి పాడ్ కాస్ట్ వింటున్నామా? అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. వర్ష మంచి నటి. అయితే ఈ కథలో నటించే అవకాశం తక్కువ. అశ్విన్ కుమార్ ఓకే అనిపిస్తాడు. అతని పాత్ర చాలా సింపుల్ గా వుంటుంది. పెళ్లి చూపులు నేపధ్యం ఇది వరకూ చాల సార్లు చూసిందే. ఇద్దరు కలవడం, మాట్లాడుకోవడం, ఆ మాటల్లోనే ఒకరినొకరు అర్ధం చేసుకునట్లు నవ్వుకోవడం తప్పితే కొత్తగా అనుభూతిని పంచలేకపోయింది మీట్ ది బాయ్.

ఓల్డ్ ఈజ్ గోల్డ్ :

సరు (రుహాని శర్మ) జై (రాజా) భార్య భర్తలు. సరు తన స్నేహితుల‌తో కలసి పారిస్ ట్రిప్ కి వెళ్లాని ఫిక్స్ అవుతుంది. కానీ ఈ ట్రిప్ జైకి ఇష్టం వుండదు. అలా అని వెళ్లొద్దని నేరుగా చెప్పడు. అలుగుతుంటాడు. చిరాకు పడుతుంటాడు. మోహన్ రావు( సత్యరాజ్) రిటైర్డ్ జర్నలిస్ట్. తన భార్య కోసం స్విజ్జర్లాండ్ ట్రిప్ ని ప్లాన్ చేస్తాడు. అదే పనిమీద యూరప్ కాన్సోలేట్ వచ్చిన మోహన్ రావుని సరు పలకరిస్తుంది. వారి మాటల మధ్య జై టాపిక్ వస్తుంది. జై అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో తన అనుభవంతో ఒక సంఘటనని పంచుకుంటాడు. ఇది సరులో ఎలాంటి మార్పుని తీసుకొచ్చిందనేది ఓల్డ్ ఈజ్ గోల్డ్ కథ.

మీట్ ది బాయ్ పోల్చుకుంటే ఇది కొంచెం బెటర్ కథ. సత్యరాజ్ చెప్పిన గతం హృద‌యాన్ని హ‌త్తుకొనేలా వుంటుంది. ఈ కథ కూడా సన్నివేశ బలం లేదు కానీ సత్యరాజ్ నటన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రుహాని, రాజా పాత్రల మధ్య ఇంకాస్త సంఘర్షణ ఉండాల్సింది. రుహాని, రాజాల నటన పరిధిమేర వుంటుంది.

ఇన్ లా :

పూజా (ఆకాంక్ష సింగ్), సిద్దార్ద్ ( దీక్షిత్ శెట్టి) ప్రేమలో వుంటారు. సిద్దు, పూజా కలసి తిరగడం చూసిన సిద్దు తల్లి పద్మ (రోహాని) ఒక పరిచయం లేని వ్యక్తిగా పూజాని కలుస్తుంది. వారి మధ్య వున్న రిలేషన్ గురించి తెలుసుకుంటుంది. అంతేకాదు పూజాకి ఇదివరకే పెళ్ళయిందనే నిజం కూడా పద్మకి తెలుస్తుంది. తర్వాత ఏం జరిగింది ? పూజా విడాకులకు కారణం ఏమిటి ? పద్మ ఎలా రియాక్ట్ అయ్యిందనేది కథ.
రిలేషన్ షిప్ లో ఉంటూ కూడా వంటరి తనం అనుభవించిన ఓ అమ్మాయి.. తనకు కావాల్సిన తోడుని వెతుక్కునే కథ ఇది. ఒక సినిమాకి సరపడే లైన్ ఇది. అయితే దిన్ని కూడా కేవలం మాటలోనే సరిపెట్టారు. పూజా చెప్పుకునే గతంలో పెయిన్ వుంటుంది. అలాగే సింగల్ పేరెంట్ గా వంటరి తనం బాధ ఏమిటో పద్మకి తెలుసు. ఆ రెండు పాత్రలలో ఒక కామన్ పాయింట్ వుండటంతో పెద్ద సంఘర్షణ లేకుండానే కథ ముగుస్తుంది. రోహిణికి అలవాటైన పాత్రే ఇది. ఆకాంక్ష నటన ఆకట్టుకుంటుంది. దీక్షిత్ శెట్టి నటన కూడా డీసెంట్ గా చేశాడు.

స్టార్స్ టక్ :

శాలిని( అదా శర్మ) పెద్ద హీరోయిన్. ఓ వర్షం కురుస్తున్న రాత్రి తను ప్రయాణిస్తున్న కారు బ్రేక్ డౌన్ అవుతుంది. అదే దారిలో వస్తున్న డాక్టర్ అమన్ (శివ కందుకూరి) లిఫ్ట్ ఇస్తాడు. అయితే అమన్ కి శాలిని హీరోయిన్ అనే సంగతి తెలీదు. వర్షంలో ప్రయాణం కష్టమౌతుందని చెప్పి తన అపార్ట్మెంట్ కి రమ్మని ఆహ్వానిస్తాడు. శాలిని అమన్ అపార్ట్మెంట్ కి వెళుతుంది. ఇద్దరూ కలసి మాట్లాడుకుంటారు. అభిరుచులు పంచుకుంటారు. జీవితంలో వారికి ఏం కావాలి ? ఎలాంటి సహచర్యం కోరుకుంటున్నారు ? అమన్ , శాలిని హీరోయిన్ అనే సంగతి తెలుసుకున్నాడా ? అనేది మిగతా కథ.

ఒక స్టార్ హీరోయిన్ కూడా అమ్మాయే. తనకీ మాములుగా అందరిలా వుండాలని వుంటుంది. కానీ ఇమేజ్ అలా వుండనివ్వదు. హీరోయిన్ అనగానే విపరీతమైన అంచనాలు వుంటాయి. అయితే తాను ఎవరో తెలియని వ్యక్తిని కలిసినపుడు ఎంత సహజంగా వుండాలని కోరుకుంటుందనే కోణాన్ని ఇందులో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. అయితే ఈ కథని ప్రెజంట్ చేయడం లో కొంత స్పష్టత లోపించినట్లుగా అనిపిస్తుంది. పాయింట్ చుట్టూ కాకుండా ఏవేవో మాటలు వినిపిస్తుంటాయి. శాలిని, అమన్ పాత్రని క్లూలెస్ గా డిజైన్ చేసిన భావన కలుగుతుంది. ఇందులో ఒక పాట కూడా పెట్టారు. కూర్చున్న సోఫాలో స్లో మోషన్ లో మూడు నిమిషాలు పాట తీయడం దీని స్పెషాలిటీ. హీరోయిన్ శాలిని లాంటి పాత్ర ఇదివరకూ చాలా చోట్ల చూసిందే. సంభాషణలు కూడా అంత ఆసక్తికరంగా వుండవు. అదా శర్మ, శివ కందుకూరిలా నటన ఓకే అనిపిస్తుంది కానీ కథని ముగించిన తీరు మాత్రం ఆకట్టుకోదు.

ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ :

అంజన (సంచిత) అజయ్ ( గోవింద్ పద్మసూర్య) ఇద్దరూ పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారు. పెళ్లయిన తర్వాత కూడా అంజనాకి అంజయ్ అంటే ఒక అపరిచితుడి ఫీలింగే. తామిద్దరం భిన్నద్రువాలమని తమకి పోసగదని ఫీలౌతుంటుంది. ఒక దశలో విడిపోవాలని కూడా నిర్ణయించుకుంటుంది. అయితే కిరణ్ (సునయన) అంజనాని కలిసి అజయ్ గురించి కొన్ని నిజాలు చెబుతుంది. ఇంతకీ కిరణ్ ఎవరు ? అజయ్ గురించి నిజాలు తెలిసిన తర్వాత అంజనలో ఎలాంటి మార్పు వచ్చింది.? అనేది కథ.

తాను ప్రేమించిన అమ్మాయిని కోల్పోవడంతో ఆ అమ్మాయి కోరుకునట్లు లైఫ్ స్టయిల్ ని మార్చుకున్న ఓ వ్యక్తి కథ ఇది. చెప్పుకోవడానికి లైన్ బావున్నా.. దాన్ని ప్రజంట్ చేయడంలో మాత్రం చాలా సాగదీత క‌నిపిస్తుంది. పాడ్ కాస్ట్ లాంటి డైలాగులు సహనానికి పరీక్ష పెడతాయి. ఇందులో కూడా పాత్రల మధ్య సంఘర్షణని రాబట్టుకోలేకపోయారు. సునయన పాత్రలో ఒక ట్విస్ట్ వుంది. ఆ ట్విస్ట్ కొత్తది కాకపోయినా ఆ కథ ముగించడానికి అంతకంటే మరోదారి లేదనే ఫీలింగ్ కలుగుతుంది.

ఐదు కథల్లో నిర్మాణ విలువలు డీసెంట్ గా వున్నాయి. విజయ్ నేపధ్య సంగీతం, వసంత్ కెమెరాపనితనం, అవినాష్ కొల్లా ఆర్ట్ వర్క్ ఆకట్టుకుంటాయి. అన్నీ అర్బన్ కథలే. రిచ్ లోకేషన్స్ తీసుకున్నారు. ప్రొడక్షన్ డిజైన్ బావుంది. కేవలం సంభాషణలు ఆధారంగా కథలు తీస్తున్నపుడు మాటల్లో కొత్తదనంతో పాటు చురుకుదనం ఉండేలా చూసుకోవాలి. అయితే ఇందులో ఆ రెండూ కనిపించలేదు. పేజీల పేజీల మాటలు రాసినా గుర్తుపెట్టుకునే మాట ఒక్కటీ వినిపించలేదు. అన్నీ సాదారణమైన మాటలు. అయితే వాటినే చాలా వరకూ ఇంగ్లీష్ లో రాసేశారు. మిరపకాయని చిల్లీ అన్నమాత్రనా దాని రుచి తీయ్యగా మారిపోదు కదా. పైగా చాలా రిపీట్ డైలాగ్స్ వున్నాయి. ఒక వాక్యానికి సంబంధించిన భావం వ్యక్తపరచడానికి పేజీ డైలాగులు తీసుకున్న చాలా సీన్స్ వున్నాయిందులో.

ఒక కథ ఇలానే ఉండాలనే రూల్ లేదు. అయితే దృశ్య రూపంలో ఒక పాయింట్ ని చెబుతున్నపుడు.. దృశ్యం, ఉద్వేగం, ఉత్సాహం, సంఘర్షణ ఇలా ఎదో ఒక అంశం చూపుల్ని ఆకర్షించాలి. మీట్ ది క్యూట్ లో అదే కొరవడింది. ఒక కథ అనుకున్నపుడు ప్రారంభం, మలుపు, ముగింపు వుండాలి. ఇందులో కొన్ని కథలు ఎలాంటి మలుపు, ముగింపు లేకుండా వుంటాయి. ఎంత విలక్షణమైన కథ వున్నా.. చిత్రీకరించాలంటే దాన్ని సన్నివేశ రూపంలోకి మార్చాలి. సృజనాత్మకమైన కథనం రాసుకోవాలి. దానికి దృశ్య రూపం ఇవ్వాలి. అప్పుడే కథ ప్రేక్షకుడి దృష్టిని ఆకర్షిస్తుంది. అయితే మీట్ క్యూట్ మాత్రం కంటికి కాకుండా చెవికి పని చెప్పే సిరిస్. మంచి శ్రోతలకు కొంతలో కొంత ఈ కథలు అర్ధమయ్యే ఛాన్స్ వుంది. అదీకూడా కొన్ని సార్లు రివైండ్ చేసి మాటలని ఫాలో అవ్వగలిగే ఓపిక వుండాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close