నేనే వాళ్ల‌కు పోటీ: చిరంజీవి

చిరంజీవి సాధించిన అవార్డుల జాబితాలో మ‌రోటి చేరింది. ఇండియ‌న్ ఫిల్మ్ ప‌ర్స‌నాటిలీ ఆఫ్ ది ఇయ‌ర్ 2022 అవార్డుని చిరంజీవికి ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. గోవాలో జ‌రుగుతున్న అంత‌ర్జాతీయ చల‌న చిత్రోత్స‌వాల్లో భాగంగా ఈ రోజు జ‌రిగిన కార్య‌క్ర‌మంలో చిరంజీవి ఈ అవార్డుని అందుకొన్నారు. ”ఈ అవార్డు నాకు చాలా ప్ర‌త్యేకం. మూడు ద‌శాబ్దాల నుంచి ఇలాంటి త‌రుణం కోసం ఎదురు చూస్తున్నా. ఈ అవార్డు నాకే కాదు.. నా అభిమానుల్లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపింద‌”న్నారు చిరంజీవి. ఈ సంద‌ర్భంగా త‌న‌కు అవార్డు అందించినందుకు కేంద్ర ప్ర‌భుత్వానికి కృతజ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.

”45 ఏళ్ల‌కుపైగా చిత్ర‌సీమ‌లో ఉన్నా. మ‌ధ్య‌లో రాజ‌కీయాల్లోకి వెళ్లా. కొంత గ్యాప్ వ‌చ్చింది. అయితే రాజ‌కీయాల వ‌ల్లే… చిత్ర‌సీమ విలువేంటో నాకు మ‌రోసారి స్ప‌ష్టంగా తెలిసొచ్చింది. ఎలాంటి అవినీతి లేని ప‌రిశ్ర‌మ ఏదైనా ఉందంటే.. అది చిత్ర‌సీమ ఒక్క‌టే. తొమ్మిదేళ్ల త‌ర‌వాత‌.. నా రీ ఎంట్రీ స‌మ‌యంలో అభిమానులు న‌న్ను ఎలా రిసీవ్ చేసుకొంటారో అనుకొనేవాడ్ని. వాళ్లు నాపై ఎన‌లేని ప్రేమ చూపించారు. ఇక జీవితాంతం చిత్ర‌సీమ‌లోనే ఉంటాను. నాకు యువ హీరోలు పోటీ కాదు. నేనే వాళ్ల‌కు పోటీ” అన్నారు చిరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close