కొవ్విరెడ్డి శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ – ఎవరీయన ?

ఢిల్లీలోని తమిళనాడు భవన్‌లో హఠాత్తుగా సీబీఐ అధికారులు రెయిడ్ చేసి… కొవ్విరెడ్డి శ్రీనివాస్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే.. ఆయనకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేయాలని.. హైదరాబాద్, విశాఖ సీబీఐ కార్యాలయాలకు సమాచారం ఇచ్చారు. ఆ సోదాలు చేసిన తర్వాత సీబీఐ ప్రకటన చేసింది. నకిలీ సీబీఐ అధికారి అయిన కొవ్విరెడ్డి శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశామని ప్రకటించింది.

అయితే ఈ కొవ్విరెడ్డి శ్రీనివాస్ ఎవరు ? సీబీఐ ఆఫీసర్ పేరుతో ఎవరిని మోసం చేశారు ? ఎవరు ఫిర్యాదు చేశారు ? అన్న అంశాలపై క్లారిటీ లేదు. గుట్టుగా మొత్తం విచారణ జరిపి కీలకమైన విషయాలు ఉండటంతోనే అరెస్ట్ చేశారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కొవ్విరెడ్డి శ్రీనివాస్.. ఇటీవల ఈడీ, సీబీఐ కేసుల వ్యవహారాల్లో ప్రముఖుల్ని బయట పడేస్తానని.., వారి పేర్లు బయటకు రాకుండా చేస్తానని చెప్పి.. రూ. కోట్లతో ఒప్పందాలు చేసుకుని ఢిల్లీకి వచ్చినట్లుగా అనుమానిస్తున్నారు. ఆయన దగ్గర బంగారంతో పాటు రూ. 21 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

కొవ్విరెడ్డి శ్రీనివాస్ దగ్గర ఉన్న ఫోన్,ల్యాప్‌ ట్యాప్‌లలో పూర్తి సమాచారాన్ని సేకరించారు. వాటి నుంచి మరిన్ని వివరాలు తెలుసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంలో చాలా మంది గుట్టు ఉంటుందని భావిస్తున్నారు. తమిళనాడు భవన్‌లో దొరికిన ఈ కొవ్విరెడ్డి శ్రీనివాస్ తమిళనాడు కు చెందిన వ్యక్తి కాదు. విశాఖకు చెందిన వ్యక్తే. అసలు ఎలా లాబీయింగ్‌కు వచ్చాడన్నది సీబీఐ అధికారులు తేల్చనున్నారు. ఇప్పటికైతే.. నకిలీ సీబీఐ అధికారి అని చెలామణి అవుతున్నారని కేసు పెట్టారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జ‌మున బ‌యోపిక్‌లో త‌మ‌న్నా?

ఓ అగ్ర తార చ‌నిపోయిన మ‌రుక్ష‌ణం.. బ‌యోపిక్ తీస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచ‌న వ‌స్తుందేమో..? ఈమ‌ధ్య అలానే జ‌రిగింది. ఇప్పుడు జమున విష‌యంలోనూ ఇలానే ఆలోచిస్తోంది చిత్ర‌సీమ‌. దాదాపు 200...

బాల‌య్య సినిమా చూసిన బ‌న్నీ

అల్లు కుటుంబానికీ బాల‌య్య‌కూ అనుబంధం ఈమ‌ధ్య బాగా బ‌ల‌ప‌డింది. ఆహాలో.. అన్ స్టాప‌బుల్ కి బాల‌య్య హౌస్ట్ గా రావ‌డం ద‌గ్గ‌ర్నుంచి ఈ బాండింగ్ స్ట్రాంగ్ అవ్వ‌డం మొద‌లైంది. అఖండ ప్రీ రిలీజ్‌కి...

‘ఖుషి’…. మ‌ళ్లీ మొద‌లు

స‌మంత అనారోగ్యంతో... `ఖుషి` సినిమాకి బ్రేకులు ప‌డిన సంగ‌తి తెలిసిందే. విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న సినిమా ఇది. డిసెంబ‌రులో విడుదల కావాల్సింది. అయితే.. స‌మంత అనారోగ్యంతో షూటింగ్...

హిండెన్‌బర్గ్ రిపోర్ట్ దేశంపై దాడేనంటున్న అదానీ !

అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రిపోర్టుపై అదానీ గ్రూప్ చాలా ఆలస్యంగా అయినా ఎదురుదాడి ప్రారంభించింది. తాము వెల్లడించిన విషయాలు తప్పు అయితే తమపై దావా వేయాలని సవాల్ చేస్తున్నా... మూడు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close