హ‌నుమాన్‌.. ‘జి’గేల్ మ‌నే ఆఫ‌ర్‌!

ఒక్క టీజ‌ర్‌తోనే టాలీవుడ్ దృష్టినంత‌టినీ త‌న‌వైపుకు తిప్పుకొన్న సినిమా ‘హ‌నుమాన్‌’. ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకొన్న సినిమా ఇది. టీజ‌ర్లోని విజువ‌ల్స్ చూసి… అంతా షాక్‌కి గుర‌య్యారు. కొంత‌మందైతే.. వంద‌ల కోట్ల‌తో తీస్తున్న ‘ఆదిపురుష్‌’తో పోలిస్తే… ‘హ‌నుమాన్’ వంద‌రెట్లు న‌యం అంటూ పోలిక‌లు కూడా తీస్తున్నారు. ప్ర‌శాంత్ వ‌ర్మ‌ని జూనియ‌న్ రాజ‌మౌళి అంటూ అభివ‌ర్ణిస్తున్నారు. ఎప్పుడైతే టీజ‌ర్ సూప‌ర్ హిట్ అయిపోయిందో, అప్పుడే ‘హ‌నుమాన్’ సినిమాకి మంచి గిరాకీ ఏర్ప‌డిపోయింది. ఈ సినిమాకి సంబంధించిన నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ గురించి గ‌ట్టి పోటీ మొద‌లైంది. జీ సంస్థ ఈ సినిమా డిజిట‌ల్‌, శాటిలైట్ హ‌క్కుల కోసం భారీ రేటు కోడ్ చేసిన‌ట్టు స‌మాచారం. ఆ రెండు రైట్స్ రూపంలోనే.. ‘హ‌నుమాన్‌’ బ‌డ్జెట్ మొత్తం తిరిగి వ‌చ్చేస్తోంద‌ని తెలుస్తోంది. థియేట్రిక‌ల్ రైట్స్ రూపంలో వ‌చ్చేదంతా ఇక లాభ‌మే అనుకోవాలి. హిందీ రైట్స్ కోసం కూడా గ‌ట్టి పోటీ ఏర్ప‌డింద‌ని టాక్‌. ఓ ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ‌.. ఈ చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేయ‌డానికి ముందుకొచ్చింది. అక్క‌డి నుంచి కూడా మంచి మొత్తం రాబ‌ట్టే అవ‌కాశాలున్నాయి. ‘హ‌నుమాన్‌’కి దాదాపుగా రూ.25 నుంచి రూ.30 కోట్ల వ‌ర‌కూ బ‌డ్జెట్ అయ్యింది. తేజా స‌జ్జాని న‌మ్ముకొని ఇంత భారీ మొత్తం పెట్టుబ‌డి ఎందుకు పెట్టారా? అని అప్ప‌ట్లో అనుమానాలు వ్య‌క్తం చేశారు. ఆ సొమ్మంతా ఇప్పుడు నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ రూపంలోనే వ‌చ్చేస్తున్నాయి. ఎటు చూసినా.. `హ‌నుమాన్‌`కి భారీ లాభాలు రావ‌డం ఖాయ‌మ‌నే టాక్ వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అదానీ యాపారం : కూలుతున్న సామ్రాజ్యం ఓ వైపు రూ. 20వేల కోట్ల ఎఫ్‌పీవో మరో వైపు !

గత వారం రోజులుగా దేశంలో అదానీ గ్రూపు కంపెనీలు రేపుతున్న దుమారం అంతా ఇంతా కాదు. ఆ కంపెనీలన్నీ గాలి మేడలని అమెరికాకు చెందిన హిండెన్‌బెర్గ్ రీసెర్చ్ ప్రకటించిన తర్వాత...

హైకోర్టుకు చేరనున్న కేసీఆర్ వర్సెస్ గవర్నర్ పోరు !

తెలంగాణ గవర్నర్ ను గుర్తించడానికి కూడా ఇష్టపడని తెలంగాణ సీఎం కేసీఆర్ కు .. కొన్ని పరిస్థితుల్లో ఆమె సంతకాలు రాజ్యాంగ పరంగా తప్పని సరి అవుతున్నాయి. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లలకు...

చైతన్య : వైసీపీ నేతలే కావొచ్చు కానీ మీరు మనుషులయ్యా.. గుర్తుంచుకోండి !

గుండెపోటు వచ్చిన ఓ మనిషి చావు బతుకుల్లో ఉంటే అతనిపై మాజీ మంత్రి అనిల్ కుమార్ మాట్లాడిన వీడియో చూసిన తరవాత ఎవరికైనా మనం మనుషులం అనే సంగతిని మార్చిపోతున్నామా అని...

ఏపీ ఆలయాల్లో దేవుడ్నే లెక్క చేయడం లేదంటున్న రమణదీక్షితలు !

టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు ఏపీలో ఆలయాల పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పీలోని ఆలయాల్లో ఆగమ శాస్త్రాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారని.. ఆలయ అధికారులు వారి ప్రణాళికలు, వారి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close