అందరికీ ఇచ్చే పథకాలు తప్ప బీసీలకు ఏం చేశారు !?

అందరికీ ఇచ్చే పథకాలను కులాల వారీగా విడదీసి మీకింత మేలు చేస్తున్నామని లెక్కలు చెప్పడం తప్ప.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీలకు చేసిన మేలే లేదు. అమ్మఒడి, రైతు భరోసా పేరుతో ఇచ్చే్ పథకాల నిధులు తప్ప.. మరో ప్రయోజనం కల్పించలేదు. ఈ లెక్కలన్నీ స్పష్టంగా ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికిప్పుడు తాము చేసిన మేలేంటో చెప్పాలంటే..కేవలం అందరికీ ఇచ్చే ఈ పథకాల గురించి చెబుతుంది కానీ ఇంకేమీ చెప్పలేదు. కానీ మసి పూసి మారేడు కాయ అన్నట్లుగా.. సభలు పెట్టి చంద్రబాబును తిట్టి రాజకీయం చేసేసుకుని బీసీల కడుపు నింపేశామని కథలు చెప్పడానికి రెడీగా ఉంటారు.

ఆఫీసులు కూడా లేని బీసీ కార్పొరే్షన్లు !

కులానికో కార్పొరేషన్ పెడతానని జగన్ ప్రకటిస్తే.. గత ప్రభుత్వం కార్పొరేషన్లు పెట్టి.. రూ. వెయ్యి కోట్లు డబ్బులు నేరుగా కేటాయించినట్లుగా కేటాయిస్తారేమోనని బీసీ కులాలు అనుకున్నాయి. జగన్ అన్నట్లుగానే కార్పొరేషన్లు యాభైకి పైగానే ఏర్పాటు చేశారు.. సొంత పార్టీ నేతలకు పదవులు ఇచ్చారు కానీ.. ఆ కార్పొరేషన్లకు పైసా నిధులు కేటాయించలేదు. మరెందుకు అవి అంటే… పథకాల డబ్బులను ఆ కార్పొరేషన్‌కు కేటాయించినట్లుగా చూపి… వాటినే పంపిణీ చేస్తున్నారు. అంటే.. లెక్కల్లో రాస్తున్నారన్నాట. ఇది ఓ రకంగా మళ్లింపే. గతంలో బీసీ కార్పొరేషన్ ద్వారా పెద్ద ఎత్తున యువతకు స్వయం ఉపాధి కల్పించేవారు. ఇప్పుడు పైసా కూజా వారికి ఉపాధి కల్పించేందుకు కేటాయించడం లేదు.

బీసీలకు రాజకీయాధికారం లేని పదవులు !

ఏపీ మంత్రివర్గంలో బీసీ మంత్రులు ఎంత మంది ఉన్నారో చటుక్కున చెప్పడం కష్టం. అసలు మంత్రులు ఎవరెవరు అన్నది కూడా గుర్తుండదు. ఏ బీసీ మంత్రి అయినా రాజకీయాధికారం చెలాయిస్తున్నాడా అని తరచి చూస్తే.. కనీసం తన శాఖ పై సమీక్షను కూడా నేరుగా చేయలేని దుస్థితి వారిది. మంత్రులు ఎప్పుడూ సచివాలయంలో కనిపించరు. వారి శాఖల గురించి పట్టించుకోరు. మొత్తం సకల శాఖా మంత్రి చూసుకుంటారు. వారు కేవలం.. చంద్రబాబును.. టీడీపీని తిట్టడానికి ఉపయోగపడతారు. బీసీ రాజకీయ నేతల్ని ఇంత దారుణంగా ఉపయోగించుకునే రాజకీయ పార్టీ గతంలో ఎప్పుడూ లేదు.

గత ప్రభుత్వ పథకాలన్నీ రద్దుతో కులవృత్తుల వారికీ ఇబ్బందులు !

గతంలో ఆదరణ వంటి పథకం పెట్టి.. కులవృత్తులు చేసుకుని ఉపాధి పొందుతున్న బీసీల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. కానీ ఈ ప్రభుత్వం మొత్తం రద్దు చేసేసింది. బీసీల కోసం ఫలానాది చేశామని చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయింది. బీసీల్లో అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది కాబట్టే.. జయహో బీసీ పేరుతో కొత్త ప్రచారం ప్రారంభించుకున్నారు. ఇది బీసీ వర్గాల పుండు మీద కారం చల్లినట్లవుతోందనే సంగతిని వైసీపీ వర్గాలు గుర్తించలేకపోతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close