ఆమ్ ఆద్మీలా బీఆర్ఎస్ జాతీయ స్థాయికి వెళ్లగలదా !?

గుజరాత్‌లో ఐదు అసెంబ్లీ సీట్లను సాధించిన ఆమ్ ఆద్మీకి జాతీయ పార్టీ గుర్తింపు లభించింది. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్ లలో అధికారంలో ఉంది. గుజరాత్‌లో ఆరు కన్నా ఎక్కువ శాతం ఓట్లు తెచ్చుకుంది. దీంతో జాతీయ పార్టీ హోదా గుర్తింపు వచ్చేస్తుంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న చాలా రాష్ట్రాల్లో ఒక శాతం కన్నా ఎక్కువ ఓట్లు రావడం లేదు. కానీ కొన్ని రాష్ట్రాల్లో బలంగా అడుగేస్తోంది. ఈ కారణంగా జాతీయ హోదా వచ్చేసింది.

ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో బీజేపీని ఢీ కొట్టడానికి కాంగ్రెస్ పార్టీకి తోడు జాతీయ పార్టీగా ఆమ్ ఆద్మీ ఉంది. ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో మరో జాతీయ పార్టీని పెట్టారు. కానీ ఈసీ పేరు మార్చింది కానీ.. జాతీయ పార్టీగా గుర్తించదు. అలా గుర్తించాలంటే బీఆర్ఎస్ రాజకీయంగా కొన్ని విజయాలు సాధించాల్సి ఉంటుంది. పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానాల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో అభ్యర్థులు పోటీ చేయాలి. ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధించాలి. ఏదైనా ఒక రాష్ట్రం లేదా రాష్ట్రాల నుంచి కనీసం నలుగురు అభ్యర్థులు ఎంపీలుగా ఎన్నికవ్వాలి. కనీసం నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలి. గెలుపొందిన అభ్యర్థులు మూడు రాష్ట్రాల నుంచి ఎన్నికవ్వాలి.

ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికి ఈ ఫీట్‌ను సాధించింది. అందుకే జాతీయగుర్తింపు వస్తోంది. కేసీఆర్ ప్రారంభించిన బీఆర్ఎస్ కు కూడా ఇప్పుడు జాతీయ పార్టీ హోదా కీలకం. అందుకే ఆయన ఇతర రాష్ట్రాల్లోనూ పోటీ చేయాల్సి ఉంటుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయరని తమకు మద్దతిస్తారని జేడీఎస్ ఇప్పటికే ప్రకటించింది. అంటే.. పార్లమెంట్ ఎన్నికల్లోపు ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పోటీ చేసే చాన్స్ లేదని అనుకోవచ్చు. ఏ విధంగా చూసినా ఇప్పుడు .. కేసీఆర్ ఎదుట అతి పెద్ద సవాల్ ఉంది. తేడా వస్తే.. మొదటికే మోసం వస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవారం బాక్సాఫీస్‌: ఎన్నిక‌ల‌కు ముందూ త‌గ్గేదే లే!

మే 13న ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. నెల రోజుల ముందు నుంచే ఈ ఎల‌క్ష‌న్ ఫీవ‌ర్ టాలీవుడ్ ని తాకింది. ఆ ఎఫెక్ట్ వ‌సూళ్ల‌పై తీవ్రంగా క‌నిపిస్తోంది. వారానికి రెండు మూడు సినిమాలొస్తున్నా...

మారుతి సినిమాకి ‘భ‌లే’ బేరం!

ఈమ‌ధ్య ఓటీటీ రైట్స్ విష‌యంలో నిర్మాత‌లు తెగ బెంగ ప‌డిపోతున్నారు. ఓటీటీలు సినిమాల్ని కొన‌డం లేద‌ని, మ‌రీ గీచి గీచి బేరాలు ఆడుతున్నార‌ని వాపోతున్నారు. అయితే కొన్ని సినిమాలు మాత్రం గ‌ప్ చుప్‌గా...

జైలు నుండే సీఎం రేవంత్ కు క్రిశాంక్ సవాల్

ఉస్మానియా వర్సిటీ పేరుతో సర్క్యూలర్‌ను మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నేత క్రిశాంక్ జైలు నుండే సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు. తాను...

ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పై వైసీపీ కంగారుతో ప్రజల్లో మరింత అనుమానాలు !

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా ప్రచారం అవుతోంది. ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది. దీన్ని ఆపాలని జగన్ రెడ్డి పోలీసుల్ని పురమాయిస్తున్నాయి. సీఐడీ కేసునూ పెట్టించగలిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close