పోలవరం పూర్తి కాదు – హోదా రాదు ! వైసీపీ ఎంపీలకు ఇదేం ఆనందం ?

పోలవరంపై ఏం జరుగుతుందో వైసీపీ ఎంపీలకు స్పష్టంగా తెలుసు. కేంద్రం మొండికేసింది. కనీసం బతిమాలే చాన్స్ కూడా ఇవ్వడం లేదు. అసలు జగన్ అడగడమే మానేశారు. ఇక హోదా గురించి చెప్పాల్సిన పని లేదు. అయినా వీటి గురించి వైసీపీ ఎంపీలు పదే పదే పార్లమెంట్‌లో ప్రశ్నలు అడుగుతున్నారు. లేదు..రాదని చెప్పిస్తున్నారు. తాజాగా.. వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ .. ఈ రెండింటిపైనా రాజ్యసభలో ప్రశ్నించారు. దానికి ఎప్పట్లాగే కేంద్ర మంత్రులు సమాధానం ఇచ్చారు.

నిర్ణీత గడువులోగా పోలవరం పూర్తి కావడం కష్టమని బోస్‌కు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. అంతే కాదు…పోలవరంకు కేంద్రం ఇవ్వాల్సింది కేవలం రూ. 2,441 కోట్లు మాత్రమేనని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ఇటీవలే జగన్ అర్జంట్‌గా పదివేల కోట్లు కావాలని లేఖ రాశారు. దాన్ని మడిచి ఎక్కడ పడేశారో కూడా స్పష్టత లేదు. ఇవ్వాల్సింది అంతేనని తేల్చేశారు. అదే సమయంలో ప్రత్యేకహోదాపైనా పిల్లి బోస్ ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే పన్నుల వాటాను పెంచడమే కాకు.. ఎవరికైనా లోటు ఉంటే భర్తీ చేస్తున్నామని..ఎవరికీ ప్రత్యేకహోదా ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.

అటు పోలవరం పూర్తి కాదు.. హోదా రాదు అని వైసీపీ ఎంపీ మరోసారి కేంద్రం ద్వారా చెప్పించినట్లయింది. ఇలా ఎందుకు చేస్తారో స్పష్టత లేదు కానీ.. మొదటి నుంచి వైసీపీ ఎంపీల తీరు ఇలాగే ఉంది. వాటిపై ఆశలు వదిలేసుకోమని ప్రజలకు సందేశం పంపాలని అనుకుంటారో.. లేకపోతే.. తామే పోరాడుతున్నట్లుగా కలరింగ్ ఇన్నాలనుకుంటారో కానీ.. తమ చేతకాని తనాన్ని ఎలివేట్ చేసే ప్రస్నలే ఎక్కువగా అడుగుతూ ఉంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స్మూత్ గా ఓట్ల బదిలీ ఖాయం – ఫలించిన కూటమి వ్యూహం !

ఏపీలో ఎన్డీఏ కూటమి మధ్య ఓట్ల బదిలీ సాఫీగా సాగిపోయే వాతావరణం కనిపిస్తోది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని అనుకున్నప్పుడు చాలా మంది ఓటు బదిలీపై...

బెట్టింగ్ రాయుళ్ల టార్గెట్ ప‌వ‌న్‌!

ఏపీ మొత్తానికి అత్యంత ఫోక‌స్ తెచ్చుకొన్న నియోజ‌క వ‌ర్గం పిఠాపురం. ప‌వ‌న్ క‌ల్యాణ్ అక్క‌డి నుంచి పోటీ చేయ‌డంతో పిఠాపురం ఒక్క‌సారిగా టాక్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ అయ్యింది. గ‌త ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం,...

ప్రధాని రేసులో ఉన్నా : కేసీఆర్

ముఖ్యమంత్రి పదవి పోతే పోయింది ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడతానని కేసీఆర్ అంటున్నారు. బస్సు యాత్రతో చేసిన ఎన్నికల ప్రచారం ముగియడంతో .. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ...

ఎక్స్ క్లూజీవ్‌: ర‌ణ‌వీర్‌, ప్ర‌శాంత్ వ‌ర్మ‌… ‘బ్ర‌హ్మ‌రాక్ష‌స‌’

'హ‌నుమాన్' త‌రువాత ప్ర‌శాంత్ వ‌ర్మ రేంజ్ పెరిగిపోయింది. ఆయ‌న కోసం బాలీవుడ్ హీరోలు, అక్కడి నిర్మాణ సంస్థ‌లు ఎదురు చూపుల్లో ప‌డిపోయేంత సీన్ క్రియేట్ అయ్యింది. ర‌ణ‌వీర్ సింగ్ తో ప్ర‌శాంత్ వ‌ర్మ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close