‘పుష్ప 2’ … టీజ‌ర్‌కే రూ.3 కోట్లు

పుష్ప సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డంతో పుష్ప 2పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. సుకుమార్ కూడా దానికి త‌గ్గ‌ట్టుగానే అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లూ తీసుకొంటున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇంకా మొద‌లు కానేలేదు. అప్పుడే హైప్ పెరిగిపోయింది. సుకుమార్ కూడా.. ప్యాన్స్‌ని ఊరిస్తూనే ఉన్నాడు. పుష్ప 2లో మ‌రిన్ని స్పెష‌లాఫ్ అట్రాక్ష్‌న్స్ చేర్చే ప‌నిలో ఉన్నాడు. ఇప్పుడు ఓ బుల్లి టీజ‌ర్ కూడా రాబోతోంది. ఈనెల 16న అవ‌తార్ 2 ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాతో పాటుగా పుష్ప గ్లిమ్స్ ని కూడా విడుద‌ల చేయ‌బోతున్నారు. టీజ‌ర్ కు సంబంధించిన స్పెష‌ల్ షూట్ కూడా పూర్త‌యిపోయింది. దీనికి ఏకంగా రూ.3 కోట్ల వ‌ర‌కూ ఖ‌ర్చు చేశార‌ని టాక్‌. సాధార‌ణంగా సినిమా అంతా పూర్త‌య్యాక‌.. అందులో కొంత భాగాన్ని టీజ‌ర్ షాట్స్ రూపంలో క‌ట్ చేస్తారు. `పుష్ప 2` గ్లిమ్స్ మాత్రం అలా కాదు. కేవ‌లం గ్లిమ్స్ కోసమే ప్ర‌త్యేకంగా షూట్ చేశారు. దానికి సంబంధించిన డ‌బ్బింగ్‌, ఆర్‌.ఆర్ కార్య‌క్ర‌మాలు కూడా పూర్త‌య్యాయి. 16న అవ‌తార్ 2 ఆడుతున్న‌ థియేట‌ర్ల‌లో విడుద‌ల చేసి, 17న సోష‌ల్ మీడియాలో వ‌దిలేసే ఆలోచ‌న‌లో చిత్ర బృందం ఉన్న‌ట్టు స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close