అన్ స్టాపబుల్ షో పైనా వైసీపీకి ఇంత ఏడుపా ?

ఆహాలో బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షోపైనా వైసీపీకి కడుపు మండిపోతోంది. పవన్ కల్యాణ్ ఎపిసోడ్ షూటింగ్ జరగగానే … పేర్ని నాని మీడియా సమావేశం పెట్టి.. కులం ప్రాతిపదికన తనదైన శైలిలో తిట్లు అందుకున్నారు. అన్ స్టాపబుల్ షో ఎంటర్‌టెయిన్‌మెంట్ షో అని..అక్కడ అందరికీ పేమెంట్ ఉంటుందన్నారు. ఏమేం మాట్లాడాలో కూడా ముందుగా రాసిస్తారని ఆరోపించారు. తర్వాత పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత తిట్లకు దిగారు. ఎపీలో సీఎం జగన్ ను తిట్టటానికి వారం వారం ఒక అడ్డగాడిద వస్తుందని పవన్ ను ఉద్దేశించి పేర్నినాని అన్నారు.

పవన్ వారం వారం వచ్చి జగన్ ను తిట్టి వెళుతున్నారని అలాంటి వ్యక్తి సీఎం అభ్యర్దిగా ఎలా సాద్యం అవుతుందన్నారు.పవన్ చంద్రబాబు కలసే పని చేస్తున్నారనేందుకు అనేకమయిన విషయాలు కనిపిస్తున్నాయని,ఇంక అంతకన్నా సాక్ష్యాలు ఎం కావాలని ప్రశ్నించారు.కాపులు ముఖ్యమంత్రి అవ్వడం తప్పు కాదు..అత్యాశ కాదు కానీ.. ఇప్పటికి కాపుల్లో సీఎం స్థాయి నేత లేరని పేర్ని నాని చెప్పుకొచ్చారు. .సమాజాన్ని ప్రేరేపితం చేసే వ్యక్తి వస్తే ఒకే కానీ అలాంటి లక్షణాలు జగన్ కు మాత్రమే ఉన్నాయన్నారు. కేవలం కాపు కులానికి సంబందించిన వ్యవహరాలు పైనే పని చేస్తే ముఖ్యమంత్రి కాలేరని విమర్శించారు.

కులాల గురించి పేర్ని నాని నేరుగానే మాట్లాడారు. చంద్రబాబు కులం గురించి కూడా గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు కాపులు కాదని ఆయన కమ్మవారు అని పేర్ని నాని వ్యాఖ్యానించారు.కాపుల్లో సీఎం అభ్యర్ది ఎవరు ఉన్నారని ఆయన ప్రశ్నించారు.చంద్రబాబు నాయుడు పేరు లో నాయుడు ఉంది కాబట్టి ఆయన కాపు అనుకుంటున్నారేమో…ఆయన కమ్మవారని పేర్ని వ్యాఖ్యానించారు. కాపు ముఖ్యమంత్రి అంశాన్ని ప్రస్తావిస్తూ పేర్ని నాని ఈ కామెంట్స్ చేశారు. వైసీపీ నేతలు రాను రాను రాజకీయాల్లో పూర్తిగా దిగజారిపోతున్నారు. ప్రజలు అసహ్యించుకుంటారన్న ఆలోచన కూడా చేయడం లేదని.. ఇవాళ పేర్ని నాని మీడియాతో మాట్లాడిన విధానం చూస్తే తెలిసిపోతుందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ : 2019లో కాన్ఫిడెన్స్‌కా బాప్ – ఇప్పుడు సైలెంట్

2019లో ఏపీలో ఎన్నికలు మొదటి విడతలోనే పూర్తయ్యాయి. ఎన్నికలు అయిపోయిన మరుక్షణం వైసీసీ రంగంలోకి దిగిపోయింది. అప్పటికే ఈసీ ద్వారా నియమింప చేసుకున్న ఉన్నతాధికారుల అండతో ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నారు....

రూ. 21వేల కోట్లు – దోచేస్తారా ?

ఏపీ ప్రభుత్వం దగ్గగర ఇప్పుడు ఇరవై ఒక్క వేల కోట్లుకపైగానే నిధులు ఉన్నాయి . పోలింగ్ కు ముందు ప్రజలఖాతాల్లో వేయాల్సిన పధ్నాలుగు వేల కోట్లతో పాటు ఆర్బీఐ నుంచి తాజాగా తెచ్చిన...

పాతబస్తీలో తగ్గిన పోలింగ్… టెన్షన్ లో అసద్..!?

హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో విజయంపై ఎంఐఎం వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇక్కడ కేవలం 46.08శాతం మాత్రమే పోలింగ్ నమోదు కావడంతో మజ్లిస్ కంచుకోటలో బీజేపీ పాగా వేస్తుందా..? అనే చర్చ జరుగుతోంది....

మీడియా వాచ్ : సీఎం రమేష్‌తో డిబేట్‌లో ఓడిపోయిన టీవీ 9

టీవీ చానల్ చేతుల్లో ఉంది. అంతకు మించి సీక్రెట్ బాసులను మెప్పించేందుకు తెరపై చేసే విన్యాసాలకు లెక్కలేనన్ని ఐడియాలు ఉన్నాయి. ఇంత వరకూ అదే చేశారు. కానీ అంతా సీఎం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close