రివ్యూ: టాప్‌గేర్‌

సక్సెస్ రేటు పక్కన పెడితే టాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేస్తున్న యువ హీరో… ఆది సాయికుమార్‌. విరామం లేకుండా ఆది నుంచి వ‌రుస‌గా సినిమాలు వస్తూనే వున్నాయి. రెండు నెలల క్రితమే ‘క్రేజీ ఫెలో` తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆది .. ఇప్పుడు దానికి పూర్తి భిన్నంగా ‘టాప్‌గేర్‌’ అనే డార్క్ క్రైమ్ థ్రిల్లర్ చేశాడు. కె.శశికాంత్‌ దర్శకత్వం వచించిన ఈ చిత్రం టీజర్ ట్రైలర్ ప్రామిసింగ్ గా అనిపించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. సరైన విజయం కోసం జోనర్లు మారుస్తూ వస్తున్న ఆదికి టాప్‌గేర్‌ ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది. ఆది కెరీర్ కి ‘టాప్‌గేర్‌’ పడిందా?

అర్జున్ (ఆది సాయికుమార్‌) ఓ క్యాబ్ డ్రైవర్. అర్జున్ భార్య ఆద్య (రియా సుమన్). ఇద్దరూ ఎంతో అనోన్యంగా వుంటారు. ఉద్యోగం, భార్య తప్పితే అర్జున్ కి మరో ప్రపంచం లేదు. సిద్దార్థ్ (మైమ్ గోపి) పెద్ద డ్రగ్ డీలర్. అతని కోసం హైదరాబాద్ పోలీసులు గాలిస్తుంటారు. సుబ్బారావు (నర్రా శ్రీనివాస్) సిద్దార్థ్ గ్యాంగ్ లో పని చేస్తుంటాడు. సుబ్బారావు దగ్గర కోట్ల రూపాయిలు విలువ చేసే డ్రగ్ బ్యాగ్ వుంటుంది. ఆ బ్యాగ్ తీసుకురావడానికి బ్రహ్మాజీ, రాజేష్ లని పంపిస్తాడు సిద్దార్థ్. సుబ్బారావు దగ్గరికి వెళ్ళడానికి అర్జున్ క్యాబ్ ఎక్కుతారు బ్రహ్మాజీ, రాజేష్. బ్యాగ్ ని తీసుకొచ్చే క్రమంలో అనుకోని కారణాల వలన సుబ్బారావుని చంపేస్తారు. తిరుగు ప్రయాణంలో రాజేష్, బ్రహ్మాజీ కూడా చనిపోతారు. ఈ ప్రయాణంలో డ్రగ్స్ వున్న బ్యాగ్ చేతులు మారిపోతుంది. చివరిగా బ్యాగ్ చేరింది డేవిడ్ గ్యాంగ్ దగ్గరికి. ఈ సంగతి తెలుసుకున్న సిద్దార్థ్, అర్జున్ భార్య ఆద్యని కిడ్నాప్ చేసి.. డేవిడ్ దగ్గర వున్న డ్రగ్ బ్యాగ్ తీసుకొచ్చి భార్యని తీసుకెళ్లమని అర్జున్ ని బెదిరిస్తాడు. బ్రహ్మాజీ, రాజేష్, సుబ్బారావు చావులకి కారణం ఏమిటి ? అసలు డేవిడ్ ఎవరు ? డ్రగ్స్ బ్యాగ్ ఎవరిదీ దగ్గర వుంది ? అర్జున్ తన భార్యని కాపాడుకున్నాడా ? సిద్దార్థ్ పోలీసులకు చిక్కాడా ? అనేది మిగతా కథ.

ఇది ఒక క్యాబ్ డ్రైవర్ కి, డ్రగ్స్ ముఠాలకి మధ్య ఓ రాత్రిలో జరిగిన కథ. డ్రగ్ డీలర్ సిద్దార్థ్ కోసం పోలీసుల గాలింపుతో కథ మొదలౌతుంది. కథ కీలక మలుపు తీసుకోవడానికి దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడు. సిద్దార్థ్ క్రూరత్వాన్ని తెలియజేయడానికి చిత్రీకరించిన సన్నివేశాలు ఆసక్తిరేకెత్తిస్తాయి. తన పాత్రకి భారీ ఎలివేషన్ ఇచ్చారు. అయితే డ్రగ్స్ బ్యాగ్ చుట్టూ కథ నడపాలనుకున్నప్పుడు.. ఈ ఎపిసోడ్ ని కథలోకి త్వరగా తీసుకురావాల్సింది. కానీ విరామం వరకూ వేచి చూడటం సాగదీత అనిపిస్తుంది. ఇలాంటి కథలకు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అవసరం. థ్రిల్లర్ సినిమాలకి కూడా ప్రధానమైన పాత్రల చుట్టూ ఒక ఎమోషన్ ని క్రియేట్ చేయాలి. అప్పుడే ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు. కానీ టాప్ గేర్ లో మాత్రం పాత్రల మధ్య ఎమోషనల్ కనెక్షన్ వుండదు. ఒక రాత్రిలో జరిగే కథ ఇది. లోకేష్ కనకరాజ్ తీసిన ఖైదీ కూడా ఒక రాత్రి కథే. లోతుగా ఆలోచిస్తే.. ‘టాప్‌గేర్‌’ లో కూడా లోకేష్ కనకరాజ్ మ్యాజిక్ ని క్రియేట్ చేద్దామని దర్శకుడు భావించినట్లు అర్ధమౌతుంది. డ్రగ్స్… దానికి కోసం ఆశపడే పోలీసులు, గ్యాంగ్ స్టార్లు, భర్త కోసం ఎదురుచూసే భార్య.. ఇవన్నీ లోకేష్ స్కూల్ ని గుర్తు చేస్తాయి. అయితే ఈ ఎమోషన్లు సరిగ్గా పండలేదు. ఇందులో కేవ‌లం ఒకే ఒక‌ డైలాగ్ కి పరిమితమైన చాలా పాత్రలు వున్నాయి. కొన్ని పాత్రలు సరిగ్గా రిజిస్టర్ కూడా కావు.

‘మిషన్ డేవిడ్’ అంటూ విరామం ఇచ్చాడు దర్శకుడు. సెకండ్ హాఫ్ లో అసలు మిషన్ వుంటుందని మళ్ళీ సీట్లో కూర్చుకున్న ప్రేక్షకుడి నిరాశే మిగులుతుంది. తొలిసగంలో కథలోకి వెళ్ళిన దర్శకుడు.. తర్వాత చెప్పడానికి కథలేక ఏం డైరెక్షన్ చేయాలో అర్ధం కాక అర్జున్ పాత్రని ఏ డైరెక్షన్ లేక రోడ్ల మీద తిప్పుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇలాంటి కథలకు స్క్రీన్ ప్లే లో మ్యాజిక్ వుండాలి. హీరో చాలా వరకూ కారు డ్రైవింగ్ సీట్ లోనే కూర్చుని వుంటాడు. అతను ఏ లీడ్ తో డేవిడ్ గ్యాంగ్ ని చేరాలో.. ఇంకాస్త ఆసక్తికరంగా రాసి వుంటే బావుండేది. డేవిడ్ గ్యాంగ్ ని హీరో చేరుకునే క్రమం చాలా సాగదీత అనిపిస్తుంది. దర్శకుడు అనుకున్న రెండు ట్విస్ట్ లు బావున్నాయి. అయితే ఆ రెండూ సరిపోలేదు. సెకండ్ హాఫ్ లో ఇంలాంటి ట్విస్ట్ లు ఇంకొన్ని ఉండాల్సింది. హీరో పాత్రని ఇంకాస్త తెలివిగా డిజైన్ చేయాల్సింది. డ్రగ్స్ గ్యాంగ్ కి హీరోకి మధ్య జరిగీ సీక్వెన్స్ లు నిరుత్సాహంగా సాగుతాయి. ఆధ్యా కిడ్నాప్ రూపంలో కథలో టెన్షన్, ఎమోషన్ ని క్రియేట్ చేయాలనుకున్నారు. అయితే అది పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఐతే సినిమా నిడివి తక్కువ వుండటం కలిసొచ్చే అంశం. పాటల జోలికి వెళ్ళకుండా , కథలో ఎలాంటి డైవర్స్ తీసుకోకుండా నిజాయితీగా ఒక థ్రిల్లర్ ని ప్రజంట్ చేసే ప్రయత్నం అయితే జరిగింది. పాత్రలని, ట్విస్ట్ లని మరికాస్త బలంగా రాసుకొని వుంటే ఫలితం ఇంకాస్త మెరుగ్గా వుండేది.

ఆది జోనర్లు మారుస్తూ కొత్తకొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. ఇలాంటి జోనర్ లో కనిపించడం ఇదే తొలిసారి. అర్జున్ పాత్రని చాలా సహజంగా చేశాడు. హీరోయిజం జోలికి పోకుండా ఒక మామూలు క్యాబ్ డ్రైవర్ లా కనిపించడం ఆకట్టుకుంది. రియా సుమన్ అందంగా వుంది. మైమ్ గోపికి మంచి పాత్ర దక్కింది. భారీ గ్యాంగ్ స్టార్ లా అతని పాత్రకు ఎలివేషన్ వుంటుంది. అయితే సెకండ్ హాఫ్ అంతా ఓ అంబులెన్స్ కే పరిమితమైయింది. బ్రహ్మజీ, సత్యరాజేష్, నర్రా శ్రీనివాస్ కనిపించింది కాసేపే అయినా వారి ప్రజన్స్ ఆకట్టుకుంది. ఎసీపీ విక్రమ్ గా శత్రు నటన బావుంది. మిగతా పాత్రలు పరిధిమేర చేశారు.

హర్షవర్థన్ రామేశ్వర్ నేపధ్య సంగీతం బావుంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. విజువల్స్‌ డీసెంట్ గా వున్నాయి. నిర్మాణ ప‌రంగా ఎక్క‌డా రాజీ ప‌డ‌లేదు. ఓ నాణ్య‌మైన చిత్రాన్ని ఇవ్వాల‌న్న ఆలోచ‌న నిర్మాత‌ల్లో క‌నిపించింది. చేజింగ్ సీన్స్ బాగా తీశారు. దర్శకుడు ఎత్తుకున్న పాయింట్ బావుంది. అయితే దాన్ని ఒక గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా మార్చడానికి మరింత వర్క్ చేయాల్సింది. డిఫరెంట్ జోనర్స్ ని ప్రయత్నిస్తున్నాడు ఆది. తన వరకూ ఇది భిన్నమైన ప్రయత్నమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close