పవన్‌ను వీక్ చేసేందుకు బీఆర్ఎస్‌ కుట్ర – వీర్రాజు పాత్ర ఉందంటున్న కన్నా !

ఏపీలో కాపు సామాజిక వర్గానికి చెందిన కొంత మంది నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరడం చర్చనీయాంశమవుతోంది. వారిని ఎవరు ఆ పార్టీలో చేర్పించారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే వారిని సోము వీర్రాజే బీఆర్ఎస్‌లో చేర్పించారన్న అనుమానాలను కన్నా లక్ష్మినారాయణ వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన వారిలో సోము వీర్రాజు వియ్యంకుడు ఉన్నారని.. ఆయన ఎందుకు బీఆర్ఎస్‌లో చేరారో చెప్పాలంటున్నారు. కన్నా వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. సోము వీర్రాజే నేతల్ని బీఆర్ఎస్‌లోకి చేరేలా మోటివేట్ చేశారన్న అభిప్రాయం బీజేపీలో వినిపిస్తోంది.

జగన్ – కేసీఆర్ కుట్రలో భాగంగానే బీఆర్ఎస్‌లోకి ఏపీ నేతలు వెళ్లారని కన్నా అనుమానం వ్యక్తం చేశారు. ఆంధ్రాలో పవన్ , తెలంగాణ లో బండి సంజయ్‌ ను వీక్ చేసే కుట్ర జగన్, కేసీఆర్‌లు కలిసి చేస్తున్నారు. ఒన్ షాట్ టూ బర్డ్స్‌గా కాపు నేతలపై బీఆర్ఎస్ దృష్టి పెట్టిందన్నారు. పవన్‌కు మేమంతా అండగా ఉంటాం. కాపులపై ఈ మధ్య కాలంలో మీడియా దుష్ప్రచారం చేస్తోంది అంటూ కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు చేశారు. జీవీఎల్ పైనా విమర్శలు చేశారు. ఎంపీ జీవీఎల్ ఆలోచన స్థానిక బీజేపీ కార్యకర్తల అభిప్రాయాలకు ఎప్పుడూ భిన్నంగా ఉంటుంది. అమరావతి రాజధాని సహా అనేక అంశాలలో జీవీఎల్ వైఖరి చూశామని గుర్తు చేశారు.

సోము వీర్రాజు ఇటీవల కన్నా లక్ష్మినారాయణ అనుచరుల్ని జిల్లా అధ్యక్ష పదవుల నుంచి తొలగిస్తున్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నియమించిన వారిని ఇప్పుడు తొలగిస్తూ ఉండటంపై కన్నా మండిపడ్డారు. కోర్ కమిటీలో చర్చించకుండా జిల్లా అధ్యక్షుల్ని ఎలా మారుస్తారని ప్రశ్నిస్తున్నారు. కన్నా వ్యవహారం బీజేపీలో మరోసారి కలకలం రేపుతోంది. కన్నా లక్ష్మినారాయణ ఇటీవలి కాలంలో పార్టీపై.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపై అసంతృప్తి వ్యక్తం చేయడం రెండో సారి. ఆయన కొద్ది రోజుల కిందట పార్టీ మారుతారన్న ప్రచారం జరిగింది. కానీ పార్టీ హైకమాండ్ ఫోన్ చేసి.. బహిరంగంగా మాట్లాడవద్దని సూచించడంతో ఆయన సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మళ్లీ విమర్శలు అందుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close