ర‌చ్చ గెలిచిన పైడిప‌ల్లి

విజ‌య్‌తో్ వంశీ పైడిప‌ల్లి సినిమా అన‌గానే చాలామంది ఆశ్చ‌ర్య‌పోయారు. చాలా అనుమానాలూ వ‌చ్చాయి. ఇది త‌మిళ సినిమా? తెలుగు సినిమానా? అని. ద్విభాషా చిత్రం అంటూ బిల్డ‌ప్పులు ఇవ్వ‌కుండా ఇది త‌మిళ సినిమానే అంటూ.. చిత్ర బృందం ముందుగానే క్లారిటీ ఇచ్చేసింది. తెలుగులో ఇది డ‌బ్బింగ్ బొమ్మ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఓ తెలుగు ద‌ర్శ‌కుడిగా వంశీ పైడిప‌ల్లి త‌మిళ సూప‌ర్ స్టార్ తో సినిమా తీయ‌డం… నిజంగానే ఓ ఎచీవ్‌మెంట్‌. తెలుగులో వార‌సుడు చూసి పెద‌వి విరిచారంతా. సీరియ‌ల్‌లా ఉంద‌నో, మిక్చ‌ర్ పొట్ల‌మ‌నో.. కామెంట్లు చేశారు. కానీ.. త‌మిళంలో మాత్రం `వారిసు` పెద్ద హిట్టు. అక్క‌డ విజ‌య్ గ‌త చిత్రాల రికార్డుల్ని తిర‌గ‌రాసింది. దీన్ని త‌మిళ సినిమాగానే ప్ర‌మోట్ చేస్తూ వ‌చ్చిన దిల్ రాజు అండ్ కో.. చివ‌రి వ‌ర‌కూ దానికే క‌ట్టుబ‌డి ఉన్నారు. తెలుగులో కంటే త‌మిళంలో ఎక్కువ ప్ర‌మోష‌న్లు చేశారు. తెలుగులో ఎంతొచ్చినా బోన‌స్ అనుకొన్నారు. తెలుగులో వ‌చ్చిన టాక్‌, వ‌సూళ్లు ప‌క్క‌న పెడితే.. త‌మిళంలో `వారిసు` హిట్టే. అందుకు క‌ల‌క్ష‌న్లే సాక్ష్యం. 8 రోజుల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.200 కోట్లు సాధించింన సినిమా ఇది. తమిళంలో విజ‌య్‌ది మాస్ ఇమేజ్‌. దానికి కాస్త భిన్నంగా ఫ్యామిలీ ట‌చ్‌తో తీసిన సినిమా ఇది. అందుకే విజ‌య్ ఫ్యాన్స్‌కి సైతం అక్క‌డ కొత్త‌గా అనిపించింది.అదే `వారిసు` విజ‌య ర‌హ‌స్యం. తెలుగు ద‌ర్శ‌కులు చాలామంది త‌మిళంలో సినిమాలు తీశారు. త‌మిళ ద‌ర్శ‌కుడు సైతం తెలుగు హీరోల‌తో హిట్టు కొట్టాల‌ని ప్ర‌య‌త్నించారు. కానీ వాళ్లెవ‌రికీ సాధ్యంకాని హిట్.. వంశీ పైడిప‌ల్లి ఖాతాలో ప‌డిన‌ట్టైంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఓటేస్తున్నారా ? : ఓ సారి రోడ్ల వైపు చూడండి!

ఏదైనా ఓ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముందుగా మౌలిక సదుపాయాలు ఉండాలి. అంటే రోడ్లు, కరెంట్, నీరు వంటివి. ఏపీలో రూ. 43 వేల కోట్లతో రోడ్లేశామని మేనిఫెస్టో విడుదల సందర్భంగా...

రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు..ప్రజలకు వైద్య ఆరోగ్యశాఖ సూచనలివే

తెలుగు రాష్ట్రాల్లో భానుడు సెగలు కక్కుతున్నాడు. రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం , సాయంత్రం అనే తేడా లేకుండా భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. మే నెల ప్రారంభమైన మొదటి రోజే భానుడు...

టీడీపీ స్టార్ క్యాంపెయినర్ గా జగన్ రెడ్డి..!?

తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన పొరపాటే వైసీపీ కూడా చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను బీఆర్ఎస్ విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్తే..ఏపీలో టీడీపీ సూపర్ సిక్స్ గ్యారంటీలను జగన్ రెడ్డి ప్రజల్లోకి...

జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ ను రేసులో నిలబెడుతోన్న రేవంత్..!!

రేవంత్ రెడ్డి...ఈ పేరు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. వ్యుహమో మరేమో కానీ, రిజర్వేషన్లపై కుట్ర జరుగుతుందంటూ బీజేపీకి ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. రిజర్వేషన్లపై రేవంత్ వ్యాఖ్యల పుణ్యమా అని బీజేపీ జాతీయ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close