వారిద్దరూ మ‌ళ్లీ మైత్రీలోనే..

ఈ సంక్రాంతి క‌చ్చితంగా మైత్రీ మూవీస్‌దే. ఈ సంస్థ నుంచి వ‌చ్చిన వీర సింహారెడ్డి, వాల్తేరు వీర‌య్య హిట్ జాబితాలో చేరిపోయాయి. ఒకేసారి ఇద్ద‌రు స్టార్ హీరోల‌తో సినిమాలు నిర్మించి, ఒక రోజు వ్య‌వ‌ధిలో విడుద‌ల చేసి, హిట్ కొట్టిన అరుదైన ఘ‌న‌త మైత్రీ సాధించింది. ఈ విజ‌యాల్లో… ద‌ర్శ‌కులు గోపీచంద్ మ‌లినేని, బాబీల వాటా త‌క్కువేం కాదు. త‌మ అభిమాన హీరోల్ని అభిమానుల‌కు న‌చ్చేలా చూపించి, హిట్లు కొట్టారు. ఇప్పుడు వీరిద్ద‌రూ మ‌ళ్లీ మైత్రీలోనే ప‌ని చేయ‌బోతున్నారు.

అవును.. గోపీచంద్ మ‌లినేని, బాబిల త‌దుప‌రి చిత్రాలు మైత్రీలోనే. ఇప్ప‌టికే ఈ ఇద్ద‌రు ద‌ర్శ‌కులూ క‌థ‌లు రెడీ చేసేసుకొన్నారు. హీరోల‌కు చెప్పి ఒప్పించ‌డ‌మే త‌రువాయి. మైత్రీ చేతిలో అగ్ర హీరోల డేట్లు ఉన్నాయి. కాక‌పోతే… టైమ్ కుద‌రాలంతే. హీరోలంతా ర‌క‌ర‌కాల ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నారు. బాబి, గోపీచంద్ క‌థ‌ల‌కు ఏ హీరోలు సెట్ అవుతారో చూసుకొని, ఆ హీరోల కాల్షీట్లు సంపాదించుకోవ‌డం పెద్ద టాస్క్‌. గోపీచంద్ మ‌లినేని కైతే ప‌వ‌న్‌తో ఓ సినిమా చేయాల‌ని ఉంది. మ‌రి ప‌వ‌న్ దొరుకుతాడో? లేదో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close