లోకేష్ పాదయాత్ర సన్నాహాలు – వైసీపీ రివర్స్ ప్లాన్లు !

నారా లోకేష్ కుప్పం నుంచి ఇచ్చాపురం వరకూ యువగళం పేరుతో చేయాలనుకున్న పాదయాత్ర కోసం గత ఆరు నెలలుగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఆయన తనకు మద్దతుగా ఉంటున్న ప్రతి ఒక్కరినీ కలుస్తున్నారు. ఇలా కొన్ని వేల మందితో ముఖాముఖి సమావేశం అయ్యారు. కనీసం పాతిక వేల మందితో సమావేశం అయ్యారు. వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. వారి మద్దతు కోరారు. ఓ పాజిటివ్ వేవ్ తన పాదయాత్రలో ఉండేలా ప్రయత్నాలు చేసుకున్నారు. ఇప్పుడు పాదయాత్ర ప్రారంభం దగ్గరకు వచ్చేసింది.

తన పాదయాత్రను లోకేష్ ఎంత సీరియస్‌గా తీసుకున్నారో.. వైసీపీ కూడా అంత కంటే ఎక్కువగానే సీరియస్‌గా తీసుకుంది. ఆయన పాదయాత్రను అడ్డుకోవడానికి దేనికైనా తెగిస్తామన్న సంకేతాలు పంపుతోంది. ఆయన పాదయాత్ర రోజు వెళ్లకుండా యువ నేతలను కేసుల్లో విచారణ పేరుతో పిలిపించే ప్రయత్నం చేయడమే కాదు.. ప్రారంభం రోజున కుప్పంలో రణరంగం సృష్టించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. లోకేష్ పాదయాత్రపై దాడులు చేద్దాం రమ్మంటూ శాంతిపురం మండల ఎంపీపీ సోషల్ మీడియా ద్వారా పిలుపునిస్తున్నారు. ఆ రోజున కుప్పంలో ఏం జరగబోతోందో ముందే చెబుతున్నారు.

మరో వైపు నారా లోకేష్ మీడియా మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పలు టీవీ చానళ్ల యజమానులతో ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. దీనికి పోటీగా వైసీపీ పెద్దలు కూడా కొన్ని టీవీ చానళ్ల యజమానులను హైదరాబాద్ పిలిపించి మాట్లాడినట్లుగా తెలుస్తోంది. లోకేష్ పాదయాత్రకు కవరేజీ ఇవ్వాల్సి వస్తే అది నెగటివ్ గానే ఉండాలి తప్ప.. పాజిటివ్ గా ఉండకూడదని.. సమస్యలు హైలెట్ అయ్యే లా అసలు ఉండకూడదని సూచనలు ఇచ్చి పంపినట్లుగా తెలుస్తోంది. ఓ ఈ విషయంలో ఏపీ సర్కార్ నుంచి అనేక ప్రయోజనాలు పొందిన కాంట్రాక్టర్ల చేతిలో ఉన్న చానల్ మరింత అత్యుత్సాహం చూపించడానికి ప్లాన్ చేసుకున్నట్లు.. ఇందు కోసం లోకేష్ పాదయాత్రకు ప్రత్యేక బృందాన్ని కూడా పంపనున్నట్లుగా చెబుతున్నారు.

కారణం ఏదైనా.. ప్రతిపక్ష నేత పాదయాత్ర చేస్తే.. అడ్డుకోవడాలు.. ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోయేలా చూసుకోవడమే బెటరని లేకపోతే ప్రజల్లో చెడ్డపేరు వస్తుందని నిన్నటి వరకూ రాజకీయ పార్టీలు భావించాయి. కానీ ఇప్పుడు ప్రజలేమనుకున్నా పర్వాలేదు వాళ్లను రోడ్డుపైకి ఎక్కనివ్వకూడదని.. కావాలటే చీకటి జీవోలు.. దాడులు .. దహనాలు చేసైనా ఆపేయాలన్న ఆలోచనలో ఉన్నారు. రాజకీయం కూడా.. రాజకీయ నేతల మనస్థత్వానికి తగ్గట్లుగానే ఉంటుందని దీన్ని బట్టే తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రొద్దుటూరు రివ్యూ : పెద్దాయన వరదరాజుల రెడ్డికి అడ్వాంటేజ్!

ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి ఈ సారి గతంలో ఉన్నంత సానుకూల పరిస్థితి కనిపిండం లేదు. కనీసం నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ముందున్నారన్న విశ్లేషణలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం...

టీడీపీలోకి క్యూ కడుతున్న వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు

వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు టీడీపీలోకి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. అందరూ చంద్రబాబు, లోకేష్ సమక్షంలోనే కాదు..ఎవరు అందుబాటులో ఉంటే వారి సమక్షంలో చేరిపోతున్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ గట్టిపోటీ...

ప్రతి ఇంట్లో ఫోటో ఉండేలా పాలన చేస్తానంటే ఇలానా !?

మా పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఏంటి అని ఓ పులివెందుల రెడ్డిరైతు భారతిరెడ్డిని ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇవ్వలేకపోయింది. కానీ మనసులో అనుకునే ఉంటారు. ఎన్నికల్లో హామీ ఇచ్చారు అందుకే...

సీరం ఇన్‌స్టిట్యూట్ బీజేపీకి 50 కోట్ల విరాళం ఇచ్చిందా…కారణం ఇదేనా..?

కోవిషీల్ద్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలకు కారణం అవుతుందని వ్యాక్సిన్ తయారీదారు అంగీకరించిన నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై కాంగ్రెస్ ఎదురుదాడి ప్రారంభించింది. జర్మనీ, డెన్మార్క్, నెథర్లాండ్స్, థాయ్‌ల్యాండ్ వంటి దేశాలు ఆస్ట్రాజెనికా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close