వైసీపీ ఎమ్మెల్యే “అవినీతిలో నిజాయితీ” చూస్తే మైండ్ బ్లాంకే !

మేమేమి నీతి మంతులం కాదు.. అవినీతి చేయడం లేదని చెప్పడంలేదు.. కానీ తక్కువే చేస్తున్నాం… అని ఘనంగా ప్రకటించుకున్నారు.. ఓ వైసీపీ ఎమ్మెల్యే. తక్కువే అంటే ఎంత అనే డౌట్ ఇతరులకు వస్తుంది కాబట్టి.. దాన్ని కూడా ఆయనే క్లారిఫై చేశారు. గత టీడీపీ హయాంలో జరిగిన దానికంటే తక్కువే అవినీతి చేస్తున్నారట. ఈ అవినీతి లో నిజాయితీ చూపిస్తున్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కావలి నియోజకవర్గం నుంచి వరుసగా గెలుస్తున్నారు. ఆయన మాటలు వినిపి.. వైసీపీ నేతలకు కూడా షాక్ తగిలినట్లయింది. అవినీతి చేస్తున్నామని ఇంత బహిరంగంగా చెబుతున్నారు.. ఆ అవినీతిలో తమకూ భాగముందని అంటారేమోనని వారి భయం.

రాష్ట్రం మొత్తం వైసీపీ నేతలు విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారు.. నీరు, మట్టి , ఇసుకతో పాటు ప్రజల్నీ దోచుకుంటున్నారని తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. కావలిలోనూ ఎక్కువగానే ఉన్నాయి. దీనిపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీన్ని సమర్థించుకోవడానికి రామిరెడ్డి ఇలా తెర ముందుకు వచ్చారు. ఎస్ ..మేము అవినీతి చేస్తున్నామని నిజాయితీగా ఒప్పుకున్నారు. అయితే.. తమది తక్కువే అని చెప్పడానికి గత ప్రభుత్వంలో జరిగిన దాని కన్నా తక్కువే అని చెప్పుకుంటున్నారు. సీఎంజగన్ తాను గత ప్రభుత్వం కన్నా తక్కువే అప్పులు చేశానని చెప్పుకుంటూ ఉంటారు.. ఇప్పుడు ఎమ్మెల్యేలు గత ప్రభుత్వం కంటే తక్కువే అవినీతి చేస్తున్నామని సర్టిఫై చేసుకుంటున్నారు.

ఇటీవల అంబటి రాంబాబు కూడా అదే చెప్పారు . తానేమీ సుద్దపూసను కానని.. రాజకీయాలన్నాక కొన్ని అవసరాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. ఏ సందర్భంలో అంటే.. ఓ తల్లిదండ్రులకు బిడ్డ చనిపోతే వచ్చిన పరిహారంలో రెండున్నరలక్షల వాటా కావాలని అడిగిన విషయం బయటకు వచ్చినందుకు. వైసీపీ నేతలు మెల్లగా అవినీతి కూడా తప్పే కాదని..రాజకీయాల్లో అవసరాలు ఉంటాయని వాదించడానికి సద్ధపడుతున్నట్లుగా తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్, కేటీఆర్ లేకపోతే తెలంగాణ ఏమైపోతుందో !?

బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణను ఎవరో ఎత్తుకుపోతారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాము ఉన్నప్పుడంతా స్వర్గం.. ఇప్పుడు నరకం అని ప్రజలకు చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే.. కొత్తగా తాము లేకపోతే...

వాలంటీర్ల లేకపోతే ఇంటింటికి పెన్షన్లు ఇవ్వలేరా ?

ఒకటో తేదీన పించను ఇంటి వద్ద ఇవ్వడానికి ఉద్యోగులు సరిపోరని నమ్మించడానికి ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పించన్లను బ్యాంక్ అకౌంట్లలో...

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close