బడ్జెట్ పై అమ్మకీ అసంతృప్తే..మోడీ సంజాయిషీలు చెప్పుకోక తప్పదు

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బడ్జెట్ పై అసంతృప్తి వ్యక్తం చేసారు. ఆమె నిన్న మీడియాతో మాట్లాడుతూ “గత బడ్జెట్ లో ప్రతిపాదించిన అనేక పధకాలకు ఈసారి బడ్జెట్ లో నిధులు కేటాయించలేదు. ఈ బడ్జెట్ లో ప్రత్యక్ష, పరోక్ష పన్ను ప్రతిపాదనలు దేశాన్ని తిరోగమన దిశకి నడిపించేవిగా ఉన్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలలో 100 శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించడం దొడ్డిదారిన విదేశీ కంపెనీలను భారత్ లో ప్రవేశించేందుకు అనుమతించడమే అవుతుంది. గ్రామీణాభివృద్ధి కోసం అన్నిరకాల సేవలపై కొత్తగా పన్ను విధించడం, వాహనాల ఎక్సయిజ్ డ్యూటీపై మౌలిక సదుపాయాల అభివృద్ధి పన్ను విధించడం కూడా సరి కాదు. ఈ బడ్జెట్ పై తమిళనాడు రాష్ట్ర ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు,” అని ఆమె కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించారు.

అయితే బడ్జెట్ లో కొన్ని అంశాలపట్ల ఆమె హర్షం వ్యక్తం చేసారు. బడ్జెట్ లో ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాలలో ఉన్న బారీ తేడాని అంకెల గారడీతో దాచిపుచ్చే ప్రయత్నం చేయకుండా దానిని బడ్జెట్ లో స్పష్టంగా పేర్కొన్నందుకు ఆమె కేంద్రాన్ని మెచ్చుకొన్నారు. అలాగే గ్రామీణాభివృద్ధి, పానాలకు భీమా పధకం, రోడ్ల నిర్మాణం, పేదల కోసం ఆరోగ్య పధకాలను ఆమె మెచ్చుకొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ బడ్జెట్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తే దానిని కేంద్రం పట్టించుకోకపోవచ్చును కానీ అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్న తమిళనాడు రాష్ట్రంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత బడ్జెట్ పట్ల కొద్దిగా అసహనం వ్యక్తం చేసినా కేంద్రం తల్లడిల్లిపోక తప్పదు. ఆ రాష్ట్రంలో అన్నాడిఎంకె పార్టీతో పొత్తుల కోసం మోడీ ప్రభుత్వం చాలా ఆరాటపడుతోంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన డి.ఎం.కె.తో పొత్తులకి సిద్దమయిపోయింది. కనుక బీజేపీకి జయలలిత అనుగ్రహం చాలా అవసరం లేకుంటే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో అది ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. కనుక బడ్జెట్ పై ఆమె లేవనెత్తిన అంశాలపై వివరణ ఇచ్చుకోవడానికి నేడో రేపో కేంద్ర మంత్రులు ఎవరో ఒకరు చెన్నైలో ఆమె ముందు వాలిపోయి వివరణ ఇచ్చుకొన్నా ఆశ్చర్యం లేదు. కానీ చంద్రబాబు నాయుడు అసంతృప్తిని ఎవరూ పట్టించుకోకపోవచ్చును. ఆ అవసరం కూడా లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. పైగా రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు లేవు కూడా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నాగ్ చేతి నిండా మ‌ల్టీస్టార్ల‌ర్లే!

సీనియ‌ర్ హీరోలు పంథా మార్చుకొంటున్నారు. సినిమా అంతా త‌మ భుజాల‌పైనే న‌డ‌వాల‌ని కోరుకోవ‌డం లేదు. క‌థ‌లో భాగం అయితే చాల‌నుకొంటున్నారు. అందుకే వాళ్ల‌కు మంచి పాత్ర‌లు ద‌క్కుతున్నాయి. నాగార్జున కూడా అదే బాట‌లో...

చేతిలో 8 సినిమాలు.. మ‌రీ ఇంత బిజీనా?

సుహాస్‌.. ఒక‌ప్పుడు బుల్లి తెర‌పై క‌నిపించాల‌ని త‌హ‌త‌హ‌లాడాడు. అదృష్టానికి ప్ర‌తిభ తోడై, మంచి క‌థ‌లు వ‌చ్చి, ఇప్పుడు బిజీ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సుహాస్ డేట్లు హాట్ కేకులు. చిన్న సినిమా, కాన్సెప్ట్...

శ్రీకాళహస్తి రివ్యూ : బొజ్జల వారసుడికి రెడ్ కార్పెట్ వేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే !

శ్రీకాళహస్తి రాజకీయం అంటే అందరికీ గుర్తొచ్చే పేరు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సుదీర్ఘ కాలం సేవలు అందించిన ఆయన నియోజకవర్గ ప్రజలందరికీ ఆత్మీయుడు. శ్రీకాళహస్తికి ఓ ఇమేజ్ తెచ్చి పెట్టారు. కానీ గత...

ధర్మారెడ్డి కోసం ఆలిండియా రూల్స్ మారిపోతాయ్ !

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి మరోసారి డిప్యూటేషన్ పొడిగించారు. రిటైరయ్యే వరకూ అంటే జూన్ 30వ తేదీ వరకూ ఆయన డిప్యూటేషన్ లోనే ఉంటారు. ఇప్పటికే రెండు సార్లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close