సీబీఐకి ఫామ్ హౌస్ కేసు ఫైళ్లు ఇవ్వని తెలంగాణ సర్కార్ !

ఫామ్ హౌమ్ కేసు సీబీఐ చేతికి వెళ్లకుండా .. తెలంగాణ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలేమీ ఫలించడం లేదు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై మళ్లి సింగిల్ బెంచ్‌లో పిటిషన్ వేసింది ప్రభుత్వం. అలా ఎలా వస్తారని డివిజన్ బెంచ్ కు వెళ్లి అనుమతి తెచ్చుకోమని న్యాయమూర్తి స్పష్టం చేయడంతో మళ్లీ డివిజన్ బెంచ్‌కు వెళ్లారు. ఎందుకైనా మంచిదని సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేయడంతో హైకోర్టు డివిజన్ బెంచ్.. ఇక హైకోర్టులో ఏమీ లేదని.. సుప్రీంకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసిది.

అదే సుప్రీంకోర్టులో అత్యవసరంగా విచారించాలని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది విజ్ఞప్తి చేస్తే.. అంత తొందరేం లేదని సీజేఐ స్పష్టం చేశారు. పదిహేడో తేదీన విచారిస్తామని తెలిపారు. అదే సమయంలో స్టేటస్ కో ఇవ్వడానికి కూడా నిరాకరించారు. విచారణలో కేసు లో మెరిట్స్ ఉంటే హై కోర్ట్ తీర్పును రివర్స్ చేస్తామని సీజేఐ తెలంగాణ న్యాయవాదికి తెలిపారు. సిబిఐ చేతికి సాక్ష్యాలు వెళ్తే చేసేది ఏమీ లేదని వాదించినా సీజేఐ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో విచారణకు పదిహేడో తేదీ వరకూ ఆగాల్సింది. ఇదే సమయంలో విచారణ ప్రారంభించడానికి సీబీఐకి ఎలాంటి అడ్డంకులు లేవు.

సీబీఐ ఇప్పటికి మూడు సార్లు కేసు ఫైల్స్ ఇవ్వాలని చీఫ్ సెక్రటరీకి లేఖ రాసింది. కానీ ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. మరోసారి సీబీఐ లేఖ రాసింది. సీఎస్ స్పందన ఎలా ఉంటుందో స్పష్టత లేదు. కేసు ఫైల్స్ సీబీఐ చేతికి వెళ్లకూడదని తెలంగాణ ప్రభుత్వం పట్టుదలగా ఉంది. ఇప్పటికీ కేసు ఫైల్స్ అప్పగించకపోతే.. కోర్టు ధిక్కరణ అవుతుంది. సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స్మూత్ గా ఓట్ల బదిలీ ఖాయం – ఫలించిన కూటమి వ్యూహం !

ఏపీలో ఎన్డీఏ కూటమి మధ్య ఓట్ల బదిలీ సాఫీగా సాగిపోయే వాతావరణం కనిపిస్తోది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని అనుకున్నప్పుడు చాలా మంది ఓటు బదిలీపై...

బెట్టింగ్ రాయుళ్ల టార్గెట్ ప‌వ‌న్‌!

ఏపీ మొత్తానికి అత్యంత ఫోక‌స్ తెచ్చుకొన్న నియోజ‌క వ‌ర్గం పిఠాపురం. ప‌వ‌న్ క‌ల్యాణ్ అక్క‌డి నుంచి పోటీ చేయ‌డంతో పిఠాపురం ఒక్క‌సారిగా టాక్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ అయ్యింది. గ‌త ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం,...

ప్రధాని రేసులో ఉన్నా : కేసీఆర్

ముఖ్యమంత్రి పదవి పోతే పోయింది ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడతానని కేసీఆర్ అంటున్నారు. బస్సు యాత్రతో చేసిన ఎన్నికల ప్రచారం ముగియడంతో .. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ...

ఎక్స్ క్లూజీవ్‌: ర‌ణ‌వీర్‌, ప్ర‌శాంత్ వ‌ర్మ‌… ‘బ్ర‌హ్మ‌రాక్ష‌స‌’

'హ‌నుమాన్' త‌రువాత ప్ర‌శాంత్ వ‌ర్మ రేంజ్ పెరిగిపోయింది. ఆయ‌న కోసం బాలీవుడ్ హీరోలు, అక్కడి నిర్మాణ సంస్థ‌లు ఎదురు చూపుల్లో ప‌డిపోయేంత సీన్ క్రియేట్ అయ్యింది. ర‌ణ‌వీర్ సింగ్ తో ప్ర‌శాంత్ వ‌ర్మ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close