విశాఖకు వెళ్లేది జూలైలోనట!

సీఎం జగన్ కన్ఫ్యూజ్ అవుతున్నారో జనాలను కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారో కానీ అదిగో విశాఖకు వెళ్తున్నా.. ఇదిగో విశాఖకు వెళ్తున్నా అని అంటూనే ఉన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించినప్పటి నుండి ఆయన విశాఖకు అదిగో ఇదిగో అంటూనే ఉన్నారు. ఇప్పుడు కూడా అదే మాట. నిన్నటిదాకా ఇక ఉగాది నుంచి అక్కడే అంటూ నీతి మీడియా ముఠాతో చెప్పించారు. కానీ ఇప్పుడు ఆయన మాత్రం మంత్రులకు జూలై అంటూ కొత్త నెల కథ చెప్పారు. దీంతో మంత్రులు కూడా ఇదేం సీరియల్ అనుకోవాల్సి వచ్చింది.

ఉగాది నుంచి సీఎం జగన్ .. విశాఖకు వెళ్తారని అక్కడి నుంచే పరిపాలన చేస్తారని కొంత కాలంగా వైఎస్ఆర్‌సీపీ నేతలు చెబుతున్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్, మరో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా అదే చెబుతున్నారు. ఉగాది వేడుకల్ని కూడా విశాఖలోనే నిర్వహించాలనుకున్నారన్న ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడే కాదని సీఎం జగన్ ఇచ్చిన క్లారిటీతో స్పష్టమయిందని మంత్రులు ఓ అభిప్రాయానికి వచ్చారు.

ప్రస్తుతం మూడు రాజధానుల అంశం సుప్రీంకోర్టులో ఉంది. అది తేలాల్సి ఉంది. అక్కడ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తే.. జీవితంలో ఇక జగన్ మూడు రాజధానులు చేయలేరు. రాజ్యాంగంలో రాజధానులు అనే ప్రస్తావన లేదు కాబట్టి తాను విశాఖ నుంచి పరిపాలన చేస్తానని ఆయన సొంత నిర్ణయాలు తీసుకుంటే తీసుకోవచ్చేమో కానీ చట్ట ప్రకారం రాజధానిని మార్చలేరు. ఈ విషయం ఆయనకు కూడా తెలుసు. కానీ ప్రజల్ని మభ్య పెట్టేందుకు..ఇదిగో విశాఖ.. అదిగో విశాఖ అంటూ కబుర్లు చెబుతున్నారు.

ఇలాంటి మాటలు వినీ వినీ ప్రజలకు విసుగెత్తిపోయింది. అయినా వైసీపీ నాయకులు అధినేతతో సహా కబుర్లు చెబుతూనే ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్ చెప్తున్న ఆ వ్యాఖ్యలను నమ్మి జనం ఓటేస్తారా..?

తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సేనని కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావులు పదేపదే చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో ఎక్కడ చూసినా ఇదే రొటీన్ డైలాగ్ లా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో...

పెద్దిరెడ్డి విశ్వరూపం – వాడిపోతున్న రోజా !

నగరి వైసీపీలో ఐదు మండలాల ఇంచార్జ్‌లతో పాటు ఇతర నేతలంతా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి.. రోజాను ఘోరంగా ఓడించి .....

ప్రశ్నించిన మహిళ చెంప చెల్లుమనిపించిన కాంగ్రెస్ అభ్యర్ధి

ఫించన్ రావడం లేదని నిలదీసిన ఉపాధి కూలీ మహిళ చెంప చెల్లుమనిపించారు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. శుక్రవారం నిజామాబాద్ జిల్లా గోవింద్ పేట్ , చేపూర్, పిప్రి గ్రామాల్లో...

ఓటేస్తున్నారా ? : లా అండ్ ఆర్డర్‌ను గుర్తు చేసుకోండి !

రాష్ట్రంలో ప్రజల్ని ప్రశాంతంగా బతకనివ్వడం అనేది ప్రభుత్వాలు ప్రజలకు కల్పించిన మొదటి సౌకర్యం. కానీ గత ఐదేళ్లుగా ఏపీలో ఎప్పుడైనా శాంతిభద్రతలు ఉన్నాయా?. పోనీ ప్రజలు నిర్భయంగా బతగలిగారా ?. పోనీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close