కిక్కురుమనకుండా సీబీఐ అధికారుల ఎదుట హాజరైన అవినాష్ రెడ్డి!

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ నాలుగోసారి ప్రశ్నించింది. దాదాపుగా నాలుగున్నర గంటల పాటు ఆయనను సీబీఐ అధికారులు ప్రశ్నించారు.
కడప నుంచి ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి తాను ఈ రోజు విచారణకు హాజరు కాలేనని సీబీఐకి లేఖ రాశారు. తాను ఎంపీనని తనకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయని.. విచారణ నుంచి మినహాయింపు కావాలని ఆయన సీబీఐకి లేఖ రాశారు. కానీ సీబీఐ సమాధానం ఇవ్వలేదు. చివరికి అవినాష్ రెడ్డి పార్లమెంట్ సమావేశాలకు వెళ్లకుండా సీబీఐ విచారణకు హాజరయ్యారు.

సోమవారం హైకోర్టు మేరకు తుది తీర్పు ఇచ్చే వరకూ అరెస్ట్ చేయవద్దని ఇచ్చిన ఆదేశాల మేరకు అరెస్ట్ చేయరని క్లారిటి రావడంతో ఈ సారి సీబీఐ ఆఫీసు దగ్గర పెద్దగా హడావుడి కనిపించలేదు. అనుచరుల్ని పెద్దగా హైదరాబాద్ తీసుకు రాలేదు. ఓ లాయర్‌తో కలిసి వచ్చారు. నాలుగున్నర గంటల విచారణ తర్వాత తిరిగ ివెళ్లారు. గత విచారణ సందర్భంగా సీబీఐ ఆఫీసు ముందు మీడియాతో మాట్లాడిన అవినాష్ రెడ్డి సీబీఐపై చాలా విమర్శలు చేశారు. అలాగే దర్యాప్తు జరుగుతున్న తీరునూ ఖండించారు. కేసులో కొత్త కోణాలు ఆవిష్కరించి హత్య ఎందుకు జరిగిందో చెప్పారు. అయితే సీబీఐ దర్యాప్తు జరుగుతూండగా.. ఇలా ప్రెస్ మీట్ పెట్టడం ఏమిటని హైకోర్టు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ సారి మీడియాతో మాట్లాడకుండానే అవినాష్ రెడ్డి వెళ్లిపోయారు.

మరోసారి అవినాష్ రెడ్డిని విచారణకు పిలిచారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ప్రస్తుతం అవినాష్ రెడ్డికి సీబీఐ అరెస్ట్ చేయకుండా రక్షణ ఉన్నట్లే. దర్యాప్తులో తేలిన అంశాలను బట్టి తాము అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలను కూడా అరెస్ట్ చేయాలనుకుంటున్నామని హైకోర్టుకు సీబీఐ అధికారులు తెలిపారు. అయితే హైకోర్టు.. తుది తీర్పు వరకూ అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇచ్చి తీర్పు రిజర్వ్ చేయడంతో అవినాష్ రెడ్డికి ఊరట లభించినట్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప‌తంజ‌లిని మ‌ళ్లీ నిల‌దీసిన సుప్రీం… ఈసారి ఇంకా ఘాటుగా!

ప‌తంజ‌లి క్ష‌మాప‌ణ‌ల‌కు స‌సేమిరా అంటున్న సుప్రీంకోర్టు... ప‌తంజ‌లి ప్ర‌మోట‌ర్ల‌పై మ‌రోసారి మండిప‌డింది. కావాల‌నే తెలివిగా ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా ప్ర‌క‌ట‌న‌లు ఇస్తూ త‌మ ఉత్ప‌త్తుల‌ను అమ్ముకున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై సాగుతున్న విచార‌ణ‌లో భాగంగా...

సూర‌త్ ఎన్నిక వెనుక జ‌రిగింది ఇదేనా?- బీజేపీలోకి కాంగ్రెస్ అభ్య‌ర్థి

క‌మ‌ల వికాసం మొద‌లైపోయింది. సూర‌త్ లో బీజేపీ అభ్య‌ర్థి గెలుపుతో మొద‌లైన ఈ హ‌వా 400సీట్ల‌కు చేర‌కుంటుంద‌ని బీజేపీ సంబురాలు చేసుకుంటుంది. అనైతిక విజ‌యం అంటూ కాంగ్రెస్ విరుచుక‌ప‌డుతుంటే, నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణకు గురైన...

భయమే బంగారమాయెనా…

హారర్ సినిమా అనగానే ఆడియన్స్ లిమిట్ అయిపోతారు. స్టార్ హీరోలు ఈ కథలని వినడానికి పెద్ద ఆసక్తి చూపించారు. కానీ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి హారర్ సినిమాలంటే క్రేజ్. నిజానికి...

భయమా..? అభద్రతాభావమా..?

కొద్ది రోజుల కిందట వరకు దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ ఎన్నికలకు సమయం సమీపించే కొద్దీ ఆ పార్టీ గ్రాఫ్ వేగంగా పతనం అవుతూ వస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close