చైతన్య : ప్రజలు డిసైడైతే అంతే !

ప్రభుత్వం వద్దనుకుంటే ప్రజలు ఏం చేస్తారో ప్రజాస్వామ్యం గురించి తెలిసిన వారందరికీ స్పష్టత ఉంటుంది. అయితే అధికార మదం తలకెక్కిన వారు అర్థం చేసుకోకపోవచ్చు. అధికారం పోయిన తర్వాత.. వారికి అసలు విషయం తెలుస్తుంది. ఈ విషయం విపక్ష పార్టీలకూ ఓ స్పష్టత ఉంటుంది. ఉండాల్సిన అవసరం ఉంది. ఏపీ రాజకీయ పరిస్థితుల్లో ఇది ఇంకా ముఖ్యం అనుకోవచ్చు. ఏపీలో ప్రస్తుత రాజకీయం భిన్నంగా సాగుతోంది. కలిసి పని చేసే విషయంలో విపక్ష పార్టీలు ఇగో సమస్యలకు పోతున్నాయి. సీట్ల గురించి చర్చించుకోకుండానే బయట మాట్లాడేస్తున్నారు. ఇది ఆయా పార్టీల మధ్య విశ్వాసాన్ని తగ్గిస్తోంది.

ప్రభుత్వం వద్దనుకుంటే ప్రజలు ఒక పార్టీవైపే మొగ్గుతారు !

కొద్ది రోజుల కిందట పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు వద్దనుకున్నారు. బలమైన ఇతర పక్షాలు ఉన్నా ఆమ్ ఆద్మీ పార్టీకే మద్దతు ఇవ్వాలనుకున్నారు. అలాగే ఇచ్చారు. అందుకే ఏకపక్ష ఫలితాలొచ్చాయి. దేశ రాజకీయాల్లో వచ్చిన ఓ బలమైన మార్పుగా చూడవచ్చు. ప్రస్తుత అధికార పార్టీని ఎవరైతే ఓడించగలరో వారికి ప్రజలు పట్టం కడతారు.అందులో సందేహం ఉండదు. ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ అంశాన్ని ఉపయోగింంచుకోవాలి కానీ లేనిపోని రాజకీయం చేసుకుంటే మొదటికే మోసం వస్తుంది.

ఏపీలో ప్రభుత్వాన్ని ప్రజలు వద్దనుకుంటున్నారు !

పది లక్షల మంది పట్టభద్రులు మెజార్టీ నియోజకవర్గాల నుంచి ఓట్లు వేశారు. ఇందులో కోస్తా ప్రాంతం లేదు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కడప జిల్లా ప్రజలు కూడా తమ అభిమతం చెప్పకనే చెప్పారు. ఇప్పుడు ఈ విషయాన్ని విపక్షాలు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ప్రభుత్వాన్ని మళ్లీ లేవకుండా ప్రజాబలంతో కొట్టాల్సిన సమయం వచ్చింది. ప్రజా కంటక పాలన అని ప్రతి ఒక్కరూ అంటున్నారు కాబట్టి… ఏ స్థాయి విజయం సాధించాలనేది విపక్షాల తీరును బట్టే ఉంటుంది.

అతిశయానికి పోకుండా బలానికి తగ్గట్లుగా సర్దుబాటు చేసుకోవడమే రాజకీయం !

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ద్వితీయ ప్రాధాన్య ఓట్లు ఎలా పని చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విపక్షాలు కలిస్తే వచ్చే అడ్వాంటేజ్ అది. అయితే మా ఓటు వల్లే గెలుస్తామని ఆశ పడి అతిశయానితే … ఆ ఓటు వల్ల వాళ్లకీ ఉపయోగం ఉండదు. మనది మెజార్టీ ప్రజాస్వామ్యం. టీడీపీకి నలభై శాతం ఓట్లు వచ్చినా సీట్లు మాత్రం 23 మూడే. జనసేనకు ఆరు శాతం ఓట్లు వచ్చినా ఒక్క ఎమ్మెల్యేనే. ఇక్కడ ఓట్లు కాదు సీట్లు సాధించడం కూడా ముఖ్యమే. బలాలను అంచనా వేసుకుని రాజకీయ పార్టీలు అశకు.. అతిశయానికి పోకుండా రియాలిటీ రాజకీయం చేస్తే… ఏడాది తర్వాత వారి భాగస్వామ్యంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. లేకపోతే…..ఏం జరుగుతుందో ప్రజలు ఇప్పటికే శాంపిల్ గా చెప్పారని అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close