కవిత విషయంలో మరింత పట్టుదలగా ఈడీ !

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసులో ఈడీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎలాంటి ముందస్తు ఆర్డర్లు పాస్ చేయొద్దంటూ కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. తమ వాదనలు వినకుండా ఎలాంటి నిర్ణయాలు వెల్లడించరాదని కోర్టును కోరింది. ఈడీ కేసులో మార్చి 11న విచారణ ఎదుర్కొన్న కవితను.. మార్చి 16న మరోసారి విచారణకు రావాలని ఆదేశించింది. అయితే ఈడీ దర్యాప్తును సవాల్ చేస్తూ కవిత సుప్రీంలో పిటిషన్ వేసింది. కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై తక్షణ విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించింది. మార్చి 24న విచారణ చేపడతామని స్పష్టం చేసింది.

ఈ క్రమంలో కవిత పిటిషన్ పై ఈడీ కేవియట్ పిటిషన్ వేసింది. దీంతో ఇరు వర్గాల పిటిషన్లపై మార్చి 24 న సుప్రీంలో విచారణ జరగనుంది. ఈడీతో పాటు కవిత తరపు లాయర్ వాదనలు వినిపించనున్నారు. అయితే అంతకు ముందే సోమవారమే కవిత ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ కవిత సుప్రీంకోర్టులో విచారణ పూర్తయిన తర్వాతనే వస్తానని ఇంతకు ముందు లేఖ రాశారు. అందుకే విచారణకు వెళ్లరని తెలుస్తోంది. హైదరాబాద్‌లోనే ఉంటారని ఇప్పటికే స్పష్టత వచ్చింది.

తమ వాదనలు కూడా వినాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఈడీ … విచారణలో కోర్టు ముందు కీలక విషయాలు వెల్లడిస్తే కవితకు మైనస్ అవుతుంది. ఆమె ప్రమేయంపై స్పష్టమైన సాక్ష్యాలున్నాయని .. ఆమె నిందితురాలేనని ఆరోపిస్తే… ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆమె అనుమానితురాలని ప్రత్యేక కోర్టుకు ఈడీ తెలిపింది .

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close