టైటిల్ అయినా మార్చాల్సింది వినాయ‌క్‌!

హిందీ ఛ‌త్ర‌ప‌తికి ఎట్ట‌కేల‌కు మోక్షం ద‌క్కింది. మే 12న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తామ‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఈ సినిమాకి టైటిల్ ఛ‌త్ర‌ప‌తిగా ఫిక్స్ చేసింది. ఈ సినిమాకి ఆది నుంచీ.. క‌ష్టాలే. బ‌డ్జెట్ ఎక్కువైపోయింద‌ని, రీషూట్లు చేశార‌ని, టైటిల్ దొర‌క‌లేద‌ని… ర‌క‌ర‌కాల అడ్డంకులు. ఎట్ట‌కేల‌కు ఇప్పుడు ఫ‌స్ట్ కాపీ చేతికి వ‌చ్చింది.

ఛ‌త్ర‌ప‌తి సినిమాని రీమేక్ చేయ‌డ‌మే.. పెద్ద సాహ‌సం. అందులోనూ హిందీలో. ఎందుకంటే.. ఛ‌త్ర‌ప‌తి డ‌బ్బింగ్ రూపంలో హిందీకి వెళ్లింది. అక్క‌డ సోనీ మాక్స్‌లో ఈ సినిమాని తెగ చూసేశారు జ‌నాలు. బాహుబ‌లి హిట్ట‌య్యాక‌… సోనీలో ఈ సినిమా మ‌రిన్నిసార్లు ప్ర‌ద‌ర్శించారు. ప్ర‌తీసారీ వ్యూవ‌ర్ షిప్ అదిరిపోతూ వ‌స్తోంది. దానికి తోడు యూ ట్యూబ్‌లో హిందీ వెర్ష‌న్ సిద్ధంగా ఉంది. అయినా స‌రే, రీమేక్ చేస్తున్నారు. క‌నీసం టైటిల్ అయినా మారిస్తే బాగుండేది. అదే టైటిల్ పెట్టారు. పైగా ఈ టైటిల్ కోసం రూ.2 కోట్లు ఖ‌ర్చు పెట్టారు.ఎందుకంటే.. ఈ టైటిల్ ఇది వ‌ర‌కే ఓ నిర్మాత రిజిస్ట‌ర్ చేయించాడు. అత‌నితో బేర‌సారాలు ఆడి, రూ.2 కోట్ల‌కు ఈ టైటిల్ కొనేశారు. ప్రీ లుక్ పోస్ట‌ర్‌లోనూ కొత్త‌ద‌నం ఏమీ లేదు. ఛ‌త్ర‌ప‌తిలోని ఓ ఐకానిక్ సీన్‌ని.. పోస్ట‌ర్ గా డిజైన్ చేశారు. మొత్తానికి అడుగ‌డుగునా ఛ‌త్ర‌ప‌తిని ఫాలో అయిపోయిన వినాయ‌క్‌.. క‌థాప‌రంగా గొప్ప మార్పులు చేస్తాడ‌ని ఆశించ‌లేం. కాపీ పేస్ట్ వ్య‌వ‌హారం లానే ఉండొచ్చు. మ‌రి.. ఇలాంటి సినిమాని బాలీవుడ్ జ‌నాలు మ‌ళ్లీ ఆద‌రిస్తారా? బెల్లం కొండ కోసం టికెట్ కొని మ‌రీ థియేట‌ర్ల‌కు వెళ్తారా? ఇవ‌న్నీ మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌లు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

మాఫియాను అంతం చేసేందుకే కూటమి : అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ భూ మాఫియాను అంతం చేసి అమరావతిని రాజధానిగా చేసేందుకు కూటమిగా ఏర్పడ్డమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ధర్మవరంలో ఎన్నికల ప్రచారసభకు హాజరయ్యారు. చంద్రబాబు కూడా అమిత్ షాతో...

విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టిన ‘గెట‌ప్’ శ్రీ‌ను!

'జ‌బ‌ర్‌ద‌స్త్' బ్యాచ్‌లో చాలామంది ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. జ‌న‌సేనానికీ, కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యాచ్ ఇలా స్వ‌చ్ఛందంగా ప్ర‌చారానికి దిగ‌డం.. వైకాపా వ‌ర్గానికి న‌చ్చ‌డం లేదు. దాంతో వాళ్ల‌పై ర‌క‌ర‌కాల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close