కుమారస్వామి, కేసీఆర్ మధ్య ఏం జరిగింది ?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. కానీ భారత రాష్ట్ర సమితి అసలు పట్టించుకోవడం లేదు. మహారాష్ట్ర నుంచి ఎప్పుడో పాతికేళ్ల కిందట ఓ జిల్లాకు జడ్పీ చైర్మన్ గా చేశారని ఆయన కంటే ప్రముఖ నేత ఎవరూ ఉండరన్నట్లుగా ప్రొజెక్ట్ చేసుకుని వారికి కండువాలు కప్పి.. మహారాష్ట్రలో బీఆర్ఎస్ హవా అని ఆస్థాన పత్రికలో రాసుకుంటున్నారు. కానీ తమ తొలి టార్గెట్ కర్ణాటక అని కేసీఆర్ స్వయంగా ప్రకటించిన రాష్ట్రంపై మాత్రం కనీసం దృష్టి పెట్టడం లేదు.

టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చాలనుకున్న తర్వాత కేసీఆర్ కు అత్యంత ఆప్తునిగా మారిన నేతలు జేడీఎస్ నేతలు. కుమారస్వామి .. ఆయన కుమారుడు పిలిచిందే తడవుగా హైదరాబాద్ వచ్చేవారు. కేటీఆర్ కుమారస్వామి కుమారునికి ఆప్యాయంగా టిఫిన్లు వడ్డించిన దృశ్యాలు కూడా వైరల్ అయ్యాయి. తాము కర్ణాటక ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ తండ్రీ కొడుకులు బీఆర్ఎస్ గురించే ఆలోచించడం లేదు. బీఆర్ఎస్ మద్దతు గురించే ఆలోచించడం లేదు. ఆ పార్టీకి ఎప్పట్లాగే పాతిక సీట్ల వరకూ వస్తాయని సర్వేలు చెబుతున్నాయి. కానీ కాంగ్రెస్ కు క్లియర్ మెజార్టీ వస్తుందని.. కింగ్ మేకర్ అయ్యే చాన్స్ లేదని ఆ సర్వేలు చెబుతున్నాయి.

దీంతో వారు మరింత కష్టపడుతున్నారు. యాత్రలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలో తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మద్దతిస్తామని బీఆర్ఎస్ ఆసక్తి చూపినా కుమారస్వామి ఆసక్తిగా లేరని చెబుతున్నారు . కేసీఆర్ ను చూస్తే గుర్తొచ్చేది తెలంగాణ ఉద్యమ నేత మాత్రమేనని అలాంటి నేత తమ రాష్ట్రం కోసం పని చేస్తారంటే కన్నడ ప్రజలు నమ్మరని.. అది పార్టీకి మైనస్ అవుతుందని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికలకు ఆర్థిక సాయం ప్రచారం ఉన్నా… కుమారస్వామి మాత్రం బీఆర్ఎస్‌తో వీలైనంత దూరం మెయిన్ టెయిన్ చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close