ఏపీలో అధికారంలోకి వచ్చేది బీజేపీ కూటమేనట!

ఏపీలో భారతీయ జనతా పార్టీ కూటమే అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేత సీఎం రమేష్ చెబుతున్నారు. అయితే ఆ కూటమిలో జనసేన మాత్రమే ఉంటుందని చెప్పడం లేదు. జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పుకుండా కేవలం బీజేపీ ఉన్న కూటమే అధికారంలోకి వస్తుదంటున్నారు. మరి వైసీపీతో పొత్తులు పెట్టుకుంటున్నారా అనే డౌట్ వస్తుందని.. తెలిపివి వైసీపీపై విమర్శలు చేస్తున్నారు. వైసీపీ పాలన దారుణంగా ఉందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రం సహించదని చెబుతున్నారు. అంటే ఆయన ఉద్దేశం టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందనే.

తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తుందో లేదో కానీ… ఆ పార్టీతో వైరానికి మాత్రం సిద్ధంగా లేదు. ఎన్నికల్లో వైసీపీకి సపోర్ట్ చేయకుండా కనీసం న్యూట్రల్ గా ఉండి ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి సహకరిస్తే చాలన్నట్లుగా ఉంది. బీజేపీకి ఏపీలో ఉన్న ఓటు బ్యాంక్ ప్రకారం ఆ పార్టీతో పొత్తులకు ఎవరూ ఆసక్తి చూపరు. కేంద్రంలో అధికారంలో ఉందన్న ఒక్క కారణంగానేఆ పార్టీ విషయంలో కాస్త సాఫ్ట్ గా ఉంటారు. అయితే బీజేపీలోనూ.. ఓ వర్గం .. టీడీపీతో పొత్తు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

టీడీపీ నుంచి వెళ్లి చేరిన వాళ్లతో పాటు టీడీపీతో పొత్తు ఉంటు సీట్లు వస్తాయని ఆశపడేవారు కూడా పొత్తు కోరుకుంటున్నారు. వైసీపీతో సన్నిహితంగా ఉంటున్న నేతలు మాత్రం పొత్తులు వద్దనుకుంటున్నారు. నిఖార్సైన బీజేపీ నేతలు ఏం చేయాలో తెలియక మాధవ్ లా సైలెంట్ గా ఉంటున్నారు. కారణం ఏదైనా బీజేపీలో ఎవరు ఫుల్ అయితే.. వారి మాట కేంద్రం దగ్గర నెగ్గుతుంది. అది ఏమిటన్నది తేలాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీరియల్ న‌టుడు చందు ఆత్మ‌హ‌త్య‌కు అస‌లు కార‌ణాలు ఇవేనా?

బుల్లి తెర ప్రేక్షకులు దిగ్బ్రాంతిలో ఉన్నారు. కారణం త్రినయని సీరియల్ యాక్టర్స్ వరుసగా ఈ లోకం వీడి వెళ్లిపోవ‌డ‌మే. మొదట ఈ సీరియల్ లో కీల‌క పాత్ర పోషించిన‌ పవిత్రా జయరాం యాక్సిడెంట్...

అప్పుడే చంద్రబాబు ఆన్ డ్యూటీ..!!

అల్లర్లతో ఏపీ అట్టుడుకుతుంటే సీఎంగా తన బాధ్యతను జగన్ రెడ్డి విస్మరించి విదేశాలకు వెళ్ళగా... ఇప్పుడు ఆ బాధ్యతలను చంద్రబాబు నిర్వర్తిస్తున్నట్లుగా కనిపిస్తోంది. జగన్ తన ఫ్యామిలీతో కలిసి విహారయాత్రకు వెళ్ళడంతో చంద్రబాబు...

సచిన్ వారసుడు భయపడుతున్నాడా?

క్రికెట్‌ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌ తనయుడు అర్జున్‌ పై తొలి నుంచి అందరి ద్రుష్టి పడింది. అర్జున్ చిన్నప్పటినుంచి క్రికెట్ ప్రపంచానికి తెలుసు. తండ్రి బాటలోనే తను కూడా క్రికెట్ ఆటనే కెరీర్...

బీఆర్ఎస్ మాజీ మంత్రి అరెస్ట్..!!

మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన ల్యాండ్ ను కబ్జా చేసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని అక్కడికి వెళ్లి నానా హంగామా చేశారు. మల్లారెడ్డి తన అల్లుడు రాజశేఖర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close