లిక్కర్ స్కాం లాభాలతో భారీగా భూములు కొన్న కవిత !

కాలు ఫ్రాక్చర్ అయిందని బయటకు రాని కవితకు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ, సీబీఐలు కలిసి గట్టి షాకులిస్తున్నాయి. ఢిల్లీ కోర్టులో మేడే రోజున మూడో చార్జిషీటు దాఖలు చేశారు. అందులో కవిత గురించే ప్రధానంగా చెప్పారు. కవిత ఎలా స్కాం చేశారు.. వచ్చిన డబ్బులతో ఎలా భూములు కొన్నారో కూడా వివరించడం సంచలనంగా మారింది. లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితనే ముడుపులు ఇచ్చారని ఆరోపించింది. లిక్కర్ లాభాలతో అరుణ్ పిళ్లై ద్వారా భూములు కొనుగోలు చేశారని చెప్పింది. తనకున్న పలుకుబడితో హైదరాబాద్ లో తక్కువ ధరకే కవిత భూములు కొన్నారని తెలిపింది. భూముల కొనుగోలు లావాదేవీలన్నీ అరుణ్ పిళ్లై బ్యాంక్ ఖాతా ద్వారానే జరిగినట్లు చెప్పింది.

ఆర్థిక లావాదేవీలపై కీలక అభియోగాలు మోపింది ఈడీ. చార్జ్ షీట్ లో కవిత భర్త అనిల్ కుమార్ తో పాటు ఆమె సన్నిహితుల పేర్లను చేర్చింది ఈడీ. చార్జి షీట్ లో ఫినిక్స్ శ్రీహరి పేరు, కవిత సన్నిహితులు వి శ్రీనివాస రావు, సృజన్ రెడ్డి పేర్లను చేర్చింది. చార్జిషీట్‌లో సాక్ష్యాలుగా వాట్సాప్ చాట్ లు , ఈ మెయిల్స్ కూడా జత చేసింది. ఇవన్నీ కవిత సమర్పించిన ఫోన్ల నుంచి రీట్రీవ్ చేశారో లేకపోతే చోట సేకరించారో కానీ.. పక్కా ఆధారాలు, బ్యాంక్ స్టేట్ మెంట్లతోనే రంగంలోకి దిగినట్లుగా కనిపిస్తోంది.

కవిత బినామీగా వ్యవహరించి ఆరోపణలు ఎదుర్కొన్న అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ మార్చి 6న అరెస్ట్ చేసింది. కేసులో మరో నిందితుడిగా ఉన్న సమీర్ మహేంద్రతో కలిసి ఢిల్లీ లిక్కర్ స్కాంలో.. రామచంద్ర పిళ్లై కీలకంగా వ్యవహరించారని.. హవాలా రూపంలో నగదు లావాదేవీలు చేశారని.. ఈ లావాదేవీలకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున కస్టడీ ఇవ్వాలని పిటీషన్ దాఖలు చేసింది ఈడీ. ఇటీవల ఆడిటర్ బుచ్చిబాబు అప్రూవర్ అయ్యారన్న ఓ ప్రచారాన్ని ప్రారంభించారు. అదే జరిగితే కవితను ఆర్థిక నేరాల విషయంలో గట్టి సాక్ష్యాలతోనే బుక్ చేసినట్లుగా కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఓ వైపు జైల్లో ఉన్న సుకేష్ లేఖలు రాస్తున్నారు. మరో వైపు ఈడీ , సీబీఐ చార్జిషీట్లు వేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు కవిత బయటకు రాకుండా గాయం పేరుతో మ్యానేజ్ చేస్తున్నారు. మరో వైపు ఈడీ ఆఫీసుకు పిలవకుండా.. అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌నే ప్రత్యేక సిట్ తో దర్యాప్తు చేయించాలన్న పిటిషన్ పై త్వరగా విచారణ జరపాలని సుప్రీంకోర్టును కోరుతున్నారు. ఈ పరిణామాలతో.. కేసు నెమ్మదిగా సాగుతున్నా… ఆగిపోలేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close